బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (89) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కష్ట సమయంలో అతని కుటుంబం ప్రైవసీ కోరుతుండగా.. అతడు చికిత్స పొందుతున్న వీడియో బయటకు రావడం సంచలనం రేపింది. ఆ వీడియో తీసిన బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ వ్యక్తిని పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేయడం గమనార్హం. నవంబర్ 12న అతడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
వీడియో రికార్డు చేసిన ఉద్యోగి అరెస్ట్

వైరల్ అయిన ఈ క్లిప్ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి ఐసీయూ లోపల నుంచి లీక్ అయింది. అందులో ధర్మేంద్ర కదల్లేని స్థితిలో బెడ్‌పై పడుకుని ఉన్నాడు. అతని చుట్టూ అతని కుమారులు బాబీ డియోల్, సన్నీ డియోల్, ఇతర కుటుంబ సభ్యులు, కరణ్ డియోల్, రాజ్‌వీర్ డియోల్ ఉన్నారు. వాళ్లంతా చాలా బాధలో కనిపించారు. ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్ కౌర్ కూడా అతని పక్కనే కూర్చుని ఉంది.
డియోల్ కుటుంబానికి సంబంధించిన ఈ అత్యంత వ్యక్తిగత క్షణాన్ని రికార్డు చేసి, సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆసుపత్రి ఉద్యోగిని అరెస్టు చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ సిటీకి ప్రత్యేక సమాచారం అందింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
కుటుంబం అధికారిక ప్రకటన
బుధవారం ఉదయం 7:30 గంటలకు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత కుటుంబం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. “ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంట్లోనే తన ఆరోగ్య సంరక్షణను కొనసాగిస్తారు.
మీడియా, ప్రజలు ఇకపై ఎటువంటి ఊహాగానాలు చేయవద్దని, ఈ సమయంలో ఆయన, కుటుంబం ప్రైవసీని గౌరవించాలని మేము అభ్యర్థిస్తున్నాము. ఆయన త్వరగా కోలుకోవడానికి, మంచి ఆరోగ్యానికి, దీర్ఘాయుష్షు కోసం అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు మేము కృతజ్ఞులం. దయచేసి ఆయనను గౌరవించండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తారు” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ధర్మేంద్ర చనిపోయాడన్న పుకార్లు
నిజానికి నాలుగు రోజుల కిందటే ధర్మేంద్ర చనిపోయాడన్న పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అతని కూతురు ఇషా డియోల్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. హేమా మాలిని కూడా కొన్ని న్యూస్ ఛానెల్స్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయని విమర్శించింది.
{{/usCountry}}నిజానికి నాలుగు రోజుల కిందటే ధర్మేంద్ర చనిపోయాడన్న పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అతని కూతురు ఇషా డియోల్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. హేమా మాలిని కూడా కొన్ని న్యూస్ ఛానెల్స్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయని విమర్శించింది.
{{/usCountry}}అతడు బాగానే ఉన్నాడని, చికిత్సకు స్పందిస్తున్నాడని అతని ఫ్యామిలీ తెలిపింది. రెండు రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఇప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
మీడియాపై సన్నీ డియోల్ ఆగ్రహం
ఇక ధర్మేంద్ర పెద్ద కొడుకు, నటుడు సన్నీ డియోల్ గురువారం (నవంబర్ 13) మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. అందులో ఇంట్లోకి వెళ్తున్న అతన్ని వీడియో తీస్తున్న కొందరిపై సన్నీ కోప్పడ్డాడు. మీ ఇంట్లో కూడా తల్లి, తండ్రి, అక్కా చెల్లెళ్లు ఉంటారు కదా.. కాస్తయినా సిగ్గు తెచ్చుకోండి.. ఇలా వీడియో తీస్తే ఎలా అని అతడు అనడం ఆ వీడియోలో వినిపిస్తోంది.