Dhee Raju Audio Leak: మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా..రెండు రోజులకోసారి నిన్ను కలుస్తా..ఢీ విన్నర్ రాజు ఆడియో కాల్ లీక్!

Dhee Raju Audio Leak: అదరగొట్టే డ్యాన్స్ లతో ఢీ 10, 20 సీజన్లలో విన్నర్ గా నిలిచిన రాజుపై ఇప్పుడు తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఓ అమ్మాయిపై లైంగిక వేధింపుల కేసులో అతను అరెస్టయ్యాడు. తాజాగా ఓ అమ్మాయితో రాజు మాట్లాడిన ఆడియో కాల్ ఒకటి ఆన్ లైన్ లో లీక్ అయిందనే టాక్ వైరల్ గా మారింది.

Published on: Sep 15, 2026, 13:57:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Dhee Raju Audio Leak: డ్యాన్స్ షో ‘ఢీ’తో పాపులర్ అయిన రాజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అమ్మాయిపై లైంగిక వేధింపుల కేసులో ఢీ రాజు అరెస్టైన సంగతి తెలిసిందే. అతనికి కోర్టు రిమాండ్ విధించింది. అయితే తాజాగా అతని ఆడియో కాల్ ఒకటి లీక్ అయినట్లు సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా..రెండు రోజులకోసారి నిన్ను కలుస్తా..ఢీ విన్నర్ రాజు ఆడియో కాల్ లీక్! (instagram-Kandimalla sakethraju)
మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా..రెండు రోజులకోసారి నిన్ను కలుస్తా..ఢీ విన్నర్ రాజు ఆడియో కాల్ లీక్! (instagram-Kandimalla sakethraju)

ఢీ రాజు ఆడియో కాల్ లీక్

ఢీ 10, 20 సీజన్లలో విన్నర్ గా నిలిచిన రాజుకు సంబంధించిన ఆడియో కాల్ ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయిందనే వార్తలు వస్తున్నాయి. అందులో అతను శిరీష అనే అమ్మాయితో మాట్లాడుతున్నట్లు ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఆడియో కాల్ లీక్ హాట్ టాపిక్ గా మారింది. అయితే అందులో మాట్లాడుతుంది ఢీ రాజు అనేదానిపై అఫీషియల్ సమాచారం ఏం లేదు.

ప్రేమించా రాజు

సోషల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం శిరీష్ అనే అమ్మాయితో ఢీ రాజు ఫోన్లో మాట్లాడుతున్నట్లు ఆ ఆడియోలో ఉంది. రాజు వేరే అమ్మాయితో తిరుగుతుండటాన్ని శిరీష ప్రశ్నిస్తున్నట్లుగా అందులో ఉంది. ‘నిన్ను ప్రేమించాను రాజు. వదులుకోలేను’ అంటూ ఆ అమ్మాయి ఎమోషనల్ అవుతుంది.

అమ్మాయితో పెళ్లి

‘‘నేను వేరేవాళ్లను పెళ్లి చేసుకుంటా. నీతో ఫ్రెండ్లీగా ఉంటా. రెండు రోజులకోసారి కలుస్తా. నీకు ఓకేనా? ఎందుకు ఓకే చెప్పట్లేదు. మనం బయట కలుస్తాం. అలా ఓకే కదా. లైఫ్ లాంగ్ నీతో ఫ్రెండ్లీగా ఉండాలని అనుకుంటున్నా శిరీష. నీకు అలాగే ఉందా’’ అని ఆ అమ్మాయిని రాజు అడిగినట్లు ఆ ఆడియో కాల్ లో ఉంది.

చిట్టి మాస్టర్ కు ఏం చెప్తావని రాజును శిరీష అడుగుతుంది. ‘‘నా వల్ల కాదు రాజు. నువ్వు డబ్బులు కట్టి వెళ్లిపోతానన్నావ్ కాదు వెళ్లు. మనస్ఫూర్తిగా ప్రేమించా. నిన్ను అలాగే చూశా. నిన్ను వేరే అమ్మాయితో ఊహించుకోవడం తట్టుకోలేను’’ అని శిరీష ఏడ్చేస్తుంది.

నా దారి నాది

‘‘నా వరకు నేను సినిమాలు చూసుకుంటుంటే పక్కవాళ్లు రెచ్చగొట్టారు. అమ్మాయితో తిరుగుతున్నావన్నారు. నువ్వు తిరుగుతున్నావ్. నువ్వు ఉంటే నాతో ఉండాలి. లేదంటే నా దారి నాది, నీ దారి నీది. డబ్బులు ఇవ్వడానికి ఇంకో వారం ఎక్స్ ట్రా తీసుకో. డబ్బులు తీసుకున్నాక పెళ్లి చేసుకోవాలని గట్టిగా అడిగే హక్కు నాకు ఉండదు’’ అని ఆ అమ్మాయి చెప్తుంది.

రూ.4 లక్షలు ఇస్తానని రాజు రిక్వెస్ట్ చేస్తాడు. ‘‘నువ్వు మనసు మార్చుకొని వస్తే రూ.50 లక్షలు నీ చేతిలో పెడతా. నేను నాలుగు సంవత్సరాలు కష్టపడి రూ.30 లక్షలు దాచుకున్నా’’ అని శిరీష చెప్పినట్లు ఉంది. రూ.7 లక్షలు కాకపోయినా రూ.5 లక్షలకైనా ఓకే చెప్పు శిరీష అని రాజు రిక్వెస్ట్ చేస్తాడు.

ఏం జరుగుతుందో?

ప్రస్తుతం ఢీ రాజు ఆడియో కాల్ లీక్ వైరల్ గా మారింది. మరి ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన రాజు వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇప్పటికే అమ్మాయి స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డు చేశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More