Dhurandhar 2 Box Office: ధురంధర్ 2.. రెండు రోజుల్లోనే రూ.331 కోట్లు.. ఇండియాలో రూ.220 కోట్లు దాటిన నెట్ వసూళ్లు
Dhurandhar 2 Box Office: ధురంధర్ 2 బాక్సాఫీస్ వసూళ్ల జోరు కొనసాగుతోంది. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు కాస్త జోరు తగ్గినా.. రెండు రోజుల్లోనే ఇండియాలో నెట్ వసూళ్లు రూ.220 కోట్ల మార్క్ దాటడం విశేషం.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన 'ధురంధర్ ద రివెంజ్' బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజే పాత రికార్డులన్నీ బద్దలు కొట్టిన ఈ సినిమా, రెండో రోజు కూడా అదే జోరు చూపించింది. థియేటర్లలో ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ, జనాలు కదలకుండా కూర్చుని ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో రెండు రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.331 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోత..
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ధురంధర్ 2 సినిమా కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ.331 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు sacnilk.com వెల్లడించింది. ఇక ఇండియాలో ఈ గ్రాస్ వసూళ్లు రూ.267 కోట్లుగా ఉండగా.. ఓవర్సీస్ లో మరో రూ.64 కోట్లు వచ్చాయి. శని, ఆదివారాల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇదే ఊపు కొనసాగితే ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ సినిమా చాలా తేలికగా రూ.500 కోట్ల మార్క్‌ను దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇండియాలో వసూళ్ల సునామీ..
ఇక మన ఇండియా విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లతో దూసుకుపోతోంది. రెండు రోజులకు కలిపి ఇండియాలో రూ.267 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. పన్నులు లాంటివి తీసేసి చూసుకుంటే ఇండియా నెట్ కలెక్షన్లు రూ.220.50 కోట్లుగా నమోదయ్యాయి.
కేవలం రెండు రోజుల్లోనే దేశీయ బాక్సాఫీస్ దగ్గర 200 కోట్ల నెట్ మార్క్ దాటడం అంటే మామూలు విషయం కాదు. శనివారం హిందీకితోడు తెలుగు, తమిళం వెర్షన్లు కూడా రిలీజ్ కానుండటంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇండియాలో రెండో రోజు రూ.80 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. తొలి రోజు ఇది రూ.102 కోట్లుగా ఉన్నాయి.
ఆగని జోరు.. దారికి అడ్డొచ్చేదే లేదు
ధురంధర్ 2 సినిమాకు అసలు అడ్డే కనిపించడం లేదు. ఒకపక్క రణ్‌వీర్ సింగ్ అద్భుతమైన నటన, మరోపక్క ఆదిత్య ధర్ టేకింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ లాంటి వాళ్లు ఉండటం కూడా సినిమాకు బాగా కలిసొచ్చింది.
ప్రస్తుతం థియేటర్లలో పోటీగా వేరే పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం, వీకెండ్ కావడం వల్ల శని, ఆదివారాల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ఇలాంటి సినిమాలకు ఉండే క్రేజ్ ఎలాంటిదో ఈ వసూళ్లు మరోసారి నిరూపించాయి. తెలుగు స్టార్ హీరోలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


