అనుభవంతో చెబుతున్నా.. జాగ్రత్త.. ఇది చాలా క్రూరమైన వ్యవస్థ: ధురంధర్ 2 డైరెక్టర్‌కు కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వార్నింగ్
ధురంధర్ 2 మూవీ సక్సెస్ అయినందుకు అభినందిస్తూనే ఆ మూవీ డైరెక్టర్ ఆదిత్య ధర్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ఇది చాలా క్రూరమైన వ్యవస్థ అని, జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.
రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన సెన్సేషనల్ మూవీ 'ధురంధర్ 2'ను ఫైనల్‌గా ప్రముఖ ఫిల్మ్‌మేకర్ వివేక్ అగ్నిహోత్రి చూశాడు. సినిమా చూశాక అతడు ఫుల్ ఫిదా అయిపోయాడు. ఈ సినిమా రాబోయే ఎన్నో ఏళ్లకు ఒక బెంచ్‌మార్క్‌లా నిలిచిపోతుందని గట్టిగా మెచ్చుకుంటూనే.. సక్సెస్ వచ్చినప్పుడు చుట్టుముట్టే ఒక విషపూరితమైన వాతావరణం గురించి ఆదిత్యకు ఒక చిన్న వార్నింగ్ కూడా ఇచ్చాడు.

ఆదిత్య ధర్‌కు వివేక్ అగ్నిహోత్రి ప్రశంసలు..
బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న స్పై థ్రిల్లర్ ధురంధర్ 2 చూశాక.. సోమవారం (మార్చి 30) నాడు ఎక్స్ వేదికగా వివేక్ అగ్నిహోత్రి తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ సినిమా చూడటం కోసమే తను స్పెషల్‌గా లాస్ ఏంజెల్స్‌కు వెళ్లానని 'ది కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్ చెప్పడం విశేషం.
ధురంధర్: ద రివెంజ్ టైటిల్‌ను ప్రస్తావిస్తూ.. "నేను కాలిఫోర్నియా గ్రామీణ ప్రాంతంలో ఉన్నాను. ఫైనల్‌గా ధురంధర్ చూడటానికి లాస్ ఏంజిల్స్ కి ఒక ట్రిప్ వేశాను. శభాష్.. బ్రావో.. ఆదిత్య ధర్ మరోసారి బ్రిలియంట్ అనిపించావు. నిజంగా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు.. దానంతట అదే మాట్లాడుతున్న ఒక అద్భుతం గురించి నేను ఇంకేం చెప్పినా అది ఒక నాయిస్‌లాగా అనిపిస్తుంది. దానికి బదులు నీకు డైరెక్ట్‌గా కాల్ చేసి మాట్లాడటమే బెటర్" అని వివేక్ ట్వీట్ చేశాడు.
వాళ్ల వర్క్ అదుర్స్.. సినిమా ఒక మాస్టర్ పీస్
ఈ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ టీమ్‌కు వివేక్ ఒక ప్రత్యేకమైన ప్రశంసలు ఇచ్చాడు. "అందరూ అద్భుతంగా పని చేశారు. కానీ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిన ఇద్దరు టెక్నీషియన్స్ గురించి నేను స్పెషల్‌గా చెప్పాలి. మొదటి వ్యక్తి వికాస్ నౌలాఖా, అతను అందించిన వరల్డ్ క్లాస్ సినిమాటోగ్రఫీ అద్భుతం. రెండో వ్యక్తి సైనీ జోహ్రే, అతను చేసిన ఎక్సెప్షనల్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు ప్రాణం పోసింది" అని రాసుకొచ్చాడు.
"సినిమాలో కెమెరా, ప్రొడక్షన్ డిజైన్ ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయి. ఆ రెండూ పూర్తి సింక్‌లో ఉంటే తప్ప ఒక సినిమా మాస్టర్‌పీస్ కాలేదు. ధురంధర్‌లో మనం చూసింది అదే. వికాస్, సైనీ ఇద్దరూ గ్రౌండ్ బ్రేకింగ్ వర్క్ చేశారు.. ఇది చాలా కాలం పాటు ఒక బెంచ్‌మార్క్‌గా ఉండిపోతుంది. మీ ఇద్దరికీ నా బెస్ట్ విషెస్, స్పెషల్ సెల్యూట్" అని మెచ్చుకున్నాడు.
అనుభవంతో చెబుతున్నా.. జాగ్రత్త
చివర్లో ఆదిత్యకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. "ఆదిత్య, నా అనుభవంతో అడగకుండానే ఒక చిన్న సలహా ఇస్తున్నాను. నువ్వు చాలా షార్ప్, నీ దారి ఏంటో నీకు తెలుసు. కానీ నీ చుట్టూ ఉన్న ఎకోసిస్టమ్ గురించి కొంచెం జాగ్రత్తగా ఉండు, అది ఎంత ఆకర్షనీయంగా ఉంటుందో అంతే విషపూరితంగా, క్రూరంగా కూడా ఉంటుంది" అని ముగించాడు.
ధురంధర్ 2 స్టోరీ, కలెక్షన్స్
డిసెంబర్ 2025లో వచ్చి ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసిన బ్లాక్ బస్టర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' కు ఇది సీక్వెల్.
ఈ ఫ్రాంచైజీలో రణ్‌వీర్ సింగ్ ఒక అండర్ కవర్ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్‌గా కనిపిస్తాడు. ఇండియాను టార్గెట్ చేసిన ఒక టెర్రర్ నెట్‌వర్క్‌ను నాశనం చేయడానికి అతను కరాచీలోని క్రిమినల్ సిండికేట్స్, పాకిస్థాన్ పొలిటికల్ పవర్ స్ట్రక్చర్స్‌లోకి ఎలా ఎంటర్ అయ్యాడు అనేది ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఇందులో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ కూడా నటించారు.
ఈ సినిమాకు భారీగా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తున్నప్పటికీ, ఇది కేవలం ఒక ప్రొపగాండా సినిమా అని కొంతమంది విమర్శిస్తుండటంతో పెద్ద డిబేట్ నడుస్తోంది. కొంతమందైతే వివేక్ తీసిన 'ది కశ్మీర్ ఫైల్స్' కూడా ప్రొపగాండానే అంటూ ధురంధర్‌తో పోల్చి విమర్శిస్తున్నారు. కానీ అనుపమ్ ఖేర్ నుంచి పీయూష్ మిశ్రా వరకు చాలామంది సెలబ్రిటీలు ఈ సినిమాకు సపోర్ట్‌గా నిలబడి, ఆ ప్రొపగాండా ట్యాగ్‌ను గట్టిగా కొట్టిపారేస్తున్నారు.
ఈ వివాదాలు ఎలా ఉన్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ధురంధర్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1250 కోట్లకు పైగా వసూలు చేయగా, ఇండియాలో రూ.840 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


