Operation Sindoor: మరో సంచలనానికి సిద్ధమైన వివేక్ అగ్నిహోత్రి! ఆపరేషన్ సింధూర్ మూవీ అనౌన్స్‌మెంట్.. పాక్‌లో భారత దాడులు
Operation Sindoor: ధురంధర్ 2 బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న వేళ.. దేశభక్తితో కూడిన మరో ప్రతిష్ఠాత్మక మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్ లో ‘ఆపరేషన్ సింధూర్’ ఆధారంగా సినిమా తెరకెక్కబోతుంది.
'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, ఇప్పుడు మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో కలిసి ఆయన 'ఆపరేషన్ సింధూర్' అనే కొత్త సినిమాను ప్రకటించాడు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో భారత సైన్యం జరిపిన మెరుపు దాడుల (Deep Strikes) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ధురంధర్ 2
ప్రస్తుతం ధురంధర్ 2 మేనియా సాగుతోంది. ఈ మూవీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వివేక్ అగ్నిహోత్రి మరో దేశభక్తి సినిమా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఆపరేషన్ సింధూర్ కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించనున్నారు.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా
ఆపరేషన్ సింధూర్ సినిమా లెఫ్టినెంట్ జనరల్ కె.జె.ఎస్. ధిల్లాన్ (రిటైర్డ్) రాసిన 'ఆపరేషన్ సింధూర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్‌సైడ్ పాకిస్థాన్' అనే పుస్తకం ఆధారంగా రూపొందుతోంది. దేశ రక్షణ కోసం మన సైనికులు ప్రాణాలకు తెగించి చేసిన పోరాటాన్ని వివేక్ అగ్నిహోత్రి తనదైన శైలిలో చూపించబోతున్నాడు.
వివేక్ అగ్నిహోత్రి
ఆపరేషన్ సింధూర్ సినిమాను ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్, టీ-సిరీస్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఒకప్పుడు 'హేట్ స్టోరీ', 'జిద్' వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న వివేక్ అగ్నిహోత్రి, గత కొన్నేళ్లుగా సామాజిక-రాజకీయ అంశాలపై మూవీస్ తీస్తున్నాడు.
'ది తాష్కెంట్ ఫైల్స్', ‘ది కాశ్మీర్ ఫైల్స్’, 'ది వ్యాక్సిన్ వార్' వంటి చిత్రాలు ఆయనకు భారీ విజయాలను అందించాయి. ఇప్పుడు 'ఆపరేషన్ సింధూర్' తో మరోసారి భారత సైనిక శక్తిని వెండితెరపై ఆవిష్కరించేందుకు ఆయన సిద్ధమయ్యాడు
టైటిల్స్ కోసం నిర్మాతల పోటీ
భారత్ సైనిక దాడుల తర్వాత బాలీవుడ్ చిత్రనిర్మాతలు ఆపరేషన్ సింధూర్ పేరుతో టైటిల్స్ రిజిస్టర్ చేయడానికి క్యూ కట్టారు. కేవలం రెండు రోజుల్లోనే 30కి పైగా అప్లికేషన్లు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. 'మిషన్ సింధూర్', 'హిందుస్థాన్ కా సింధూర్', 'సింధూర్ కా బద్లా' వంటి టైటిల్స్ కోసం ఆదిత్య ధర్, మధుర్ భండార్కర్ వంటి అగ్ర దర్శకులు కూడా పోటీ పడటం విశేషం.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ
ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) కు ఈ టైటిల్స్ కోసం విపరీతమైన డిమాండ్ పెరిగింది. సాధారణంగా ఇలాంటి కీలక సంఘటనల తర్వాత టైటిల్స్ సంఖ్య 60 వరకు పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఒకసారి టైటిల్ రిజిస్టర్ చేసుకుంటే, నిర్మాతలు ఆ సినిమాను పూర్తి చేయడానికి మూడు సంవత్సరాల సమయం ఉంటుంది. లేదంటే ఆ టైటిల్ రద్దు అవుతుంది.
దేశవ్యాప్తంగా అంచనాలు
'ఆపరేషన్ సింధూర్' ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతికారంగా భారత సైన్యం చేసిన దాడులను ఈ సినిమాలో ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 'ధురంధర్ 2' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుండటంతో, వివేక్ అగ్నిహోత్రి సినిమా కూడా అదే స్థాయి విజయం సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


