Diljit Dosanjh: పంజాబీ గ్లోబల్ స్టార్ దిల్జిత్ దోసాంజ్ లీడ్ రోల్ ప్లే చేసిన 'సత్లూజ్' (Satluj) సినిమా తెలుసు కదా. ఈ మూవీ కోసం ఆయన కేవలం ఒక్క రూపాయి మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నారనే షాకింగ్ విషయాన్ని డైరెక్టర్ హనీ ట్రెహాన్ బయటపెట్టారు. మానవ హక్కుల ఉద్యమకారుడు జస్వంత్ సింగ్ ఖల్రా రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా చుట్టూ జరుగుతున్న వివాదాల మధ్య ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
జీ5 ఓటీటీ వివాదం.. 48 గంటల్లోనే తొలగింపు

భారీ అంచనాల మధ్య జులై 3, 2026 న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (Zee5)లో ఈ సినిమా సైలెంట్‌గా రిలీజైంది. అయితే సెన్సార్ సర్టిఫికేషన్ వివాదాల కారణంగా కేవలం 48 గంటల్లోనే ఈ సినిమాను ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యంతరాల వల్ల సినిమా స్ట్రీమింగ్ ఆగిపోయినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ కోసం హీరో దిల్జిత్ దోసాంజ్ చూపించిన డెడికేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
దిల్జిత్ లేకుండా ఈ ప్రాజెక్ట్ సాధ్యం కాదు
సినిమా కాస్టింగ్ గురించి డైరెక్టర్ హనీ ట్రెహాన్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. దిల్జిత్ ఈ సినిమాలో నటించకపోయి ఉంటే అసలు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేదే కాదని స్పష్టం చేశారు. ఈ సినిమాకు పక్కా పంజాబీ సర్దార్ లుక్ ఉన్న నటుడే కావాలని, బాలీవుడ్ హీరోలను పెడితే ఆ ఒరిజినాలిటీ రాదని హనీ ట్రెహాన్ భావించారు. జస్వంత్ సింగ్ ఖల్రా సాహబ్ జీవితాన్ని, పంజాబ్ ప్రజలు అనుభవించిన బాధను కరెక్ట్‌గా తెరపై చూపించాలనే ఉద్దేశంతోనే ఆయన దిల్జిత్‌ను సంప్రదించారు.
30 నిమిషాల మీటింగ్.. 'వాహేగురు' అంటూ దండం పెట్టిన స్టార్
2021 లో హనీ ట్రెహాన్ ఈ సినిమా స్క్రిప్ట్ తో పాటు తన రిసెర్చ్ పేపర్స్‌ను దిల్జిత్ దోసాంజ్‌కు చూపించారు. జస్వంత్ సింగ్ ఖల్రా ఫోటోను చూడగానే దిల్జిత్ ఎమోషనల్ అయిపోయి సీట్ లోంచి లేచి నిలబడ్డారు. స్క్రిప్ట్‌ను తన నొసటికి తాకించుకుని "వాహేగురు" అని భక్తితో దండం పెట్టుకున్నారు.
{{/usCountry}}2021 లో హనీ ట్రెహాన్ ఈ సినిమా స్క్రిప్ట్ తో పాటు తన రిసెర్చ్ పేపర్స్‌ను దిల్జిత్ దోసాంజ్‌కు చూపించారు. జస్వంత్ సింగ్ ఖల్రా ఫోటోను చూడగానే దిల్జిత్ ఎమోషనల్ అయిపోయి సీట్ లోంచి లేచి నిలబడ్డారు. స్క్రిప్ట్‌ను తన నొసటికి తాకించుకుని "వాహేగురు" అని భక్తితో దండం పెట్టుకున్నారు.
{{/usCountry}}"ఖల్రా లాంటి గొప్ప దేశభక్తుడి పాత్రలో నటిస్తూ నేను డబ్బులు ఎలా తీసుకోగలను? అది చాలా అవమానకరం" అంటూ ఉచితంగా చేయడానికి ఒప్పుకున్నారు. కానీ అగ్రిమెంట్ ఫార్మాలిటీస్ కోసం డైరెక్టర్ పట్టుబట్టడంతో కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకున్నారు.
ఎవరీ జస్వంత్ సింగ్ ఖల్రా?
పంజాబ్‌లో 1990ల కాలంలో జస్వంత్ సింగ్ ఖల్రా ఒక సాధారణ బ్యాంక్ క్లర్క్‌గా ఉండేవారు. ఆ తర్వాత ఆయన మానవ హక్కుల పోరాట యోధుడిగా మారి పంజాబ్‌లో అక్రమంగా దహనం చేసిన 25 వేల మంది వివరాలను సేకరించి సంచలనం సృష్టించారు.
ఈ క్రమంలోనే 1995 లో ఆయనను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి, పోలీస్ కస్టడీలోనే దారుణంగా హత్య చేశారు. ఈ చారిత్రక సత్యాల ఆధారంగానే 'సత్లూజ్' సినిమాను ఎంతో నిజాయితీగా తెరకెక్కించారు హనీ ట్రెహాన్.
షూటింగ్ సెట్ లో దిల్జిత్ చూపించిన పెద్ద మనసు
దిల్జిత్ కేవలం రెమ్యునరేషన్ విషయంలోనే కాకుండా షూటింగ్ లో కూడా చిత్ర యూనిట్‌కు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. కొన్నిసార్లు ఉదయం 6 గంటలకే దిల్జిత్ మేకప్ వేసుకుని సెట్ లో రెడీగా ఉండేవారట. కానీ వేర్వేరు కారణాల వల్ల సాయంత్రం 4 గంటల వరకు ఆయన ఫస్ట్ షాట్ తీయడానికి కుదిరేది కాదు.
ఈ ఆలస్యానికి డైరెక్టర్ క్షమాపణలు చెప్పిన ప్రతిసారీ, "పాజీ.. పర్వాలేదు, మనం ఏం చేసినా సినిమా కోసమే కదా, నేను ఇక్కడ సపోర్ట్ చేయడానికే ఉన్నాను" అంటూ దిల్జిత్ కూల్‌గా సమాధానం చెప్పేవారని హనీ ట్రెహాన్ గుర్తు చేసుకున్నారు.