...
...
Next Story

దర్శకుడి కల నెరవేరినట్టయింది.. అల్లు అర్జున్ మూవీలో దీపికా పదుకొణెపై డైరెక్టర్ అట్లీ కామెంట్స్

అల్లు అర్జున్-అట్లీ మూవీ ఏఏ22ఏ6 మూవీలో హీరోయిన్‌గా దీపికా పదుకొణెను అధికారికంగా తాజాగా ఇవాళ (జూన్ 7) ప్రకటించారు. ఓ వీడియో విడుదల చేస్తూ దీపికా పదుకొణె పాత్ర ఏంటో చెప్పారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె చేయడంపై డైరెక్టర్ అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: Jun 7, 2025, 13:36:14 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఏఏ22ఏ6. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో దిగ్గజ సంస్థ కళానిధి మారన్‌కు చెందిన సన్ పిక్చర్స్ ఈ పాన్ ఇండియా సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. అనౌన్స్‌మెంట్ నుంచే సినిమాపై ఆకాశాన్నంటేలా అంచనాలు ఏర్పడ్డాయి.

బాలీవుడ్ గ్లామరస్ క్వీన్

దర్శకుడి కల నెరవేరినట్టయింది.. అల్లు అర్జున్ మూవీలో దీపికా పదుకొణెపై డైరెక్టర్ అట్లీ కామెంట్స్
దర్శకుడి కల నెరవేరినట్టయింది.. అల్లు అర్జున్ మూవీలో దీపికా పదుకొణెపై డైరెక్టర్ అట్లీ కామెంట్స్

దీన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లేలా బాలీవుడ్ గ్లామరస్ క్వీన్ దీపికా పదుకొణె కూడా ఈ టీమ్‌తో జాయిన్ కావటం విశేషంగా మారింది. పాన్ ఇండియా లెవల్‌లో బిగ్గెస్ట్ బడ్జెట్ విజువల్ వండర్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అద్భుతమైన తారాగణంతో ప్రభంజనం సృష్టించబోతోంది.

మెస్మరైజ్ చేస్తున్న దీపికా గ్లింప్స్

ఈ భారీ కాంబోను తెలియజేసేలా విడుదల చేసిన దీపికా పదుకొణె ఫస్ట్ గ్లింప్స్ వీడియో అభిమానులను, ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. డైరెక్టర్ అట్లీతో దీపికా పదుకొణె మాట్లాడే సన్నివేశాలతో ప్రారంభమైన ఈ వీడియో ఆమె శక్తివంతమైన పాత్రలోకి మారుతున్న విధానాన్ని చూపించిన తీరు అందరిలో ఉత్కంఠతను రేపుతోంది.

హెడ్ గేర్ ధరించి

హెడ్‌ గేర్‌ను ధరించి దీపికా పదుకొణె ఫుల్ కాస్ట్యూమ్స్‌తో సెట్లోకి అడుగు పెడుతూ యుద్ధానికి సిద్ధమైంది. ఈ సినిమా నుంచి దీపికా పదుకొణె ఫస్ట్ గ్లింప్స్ వీడియో రిలీజ్ సందర్భంగా హీరోయిన్‌పై డైరెక్టర్ అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అల్లు అర్జున్ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేయడంపై ఇలా రియాక్ట్ అయ్యాడు.

తనవైపుకు తిప్పుకునేలా

"జవాన్ సినిమాలో దీపిక మేడమ్‌తో కలిసి పని చేశాను. అదొక అద్భుతమైన అనుభవం. ఆమె నటనకు సంబంధించిన పరిధి, శక్తి, ప్రతి ఫ్రేమ్‌లో ఆమె అందరినీ తనవైపు తిప్పుకునేలా చేసిన గ్రేస్ గొప్పగా ఉంటాయి" అని దర్శకుడు అట్లీ తెలిపాడు.

గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్

ఇదిలా ఉంటే, అల్లు అర్జున్‌తో దీపికా పదుకొణె జోడీ కడుతుండటం, అట్లీ డైరెక్షన్, సన్ పిక్చర్స్ గ్రాండ్ విజన్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ఉన్న హద్దులను చెరిపేసి, సిల్వర్ స్క్రీన్‌పై మరచిపోలేని సరికొత్త శక్తితో, అందరి హృదయాల్లో నిలిచిపోయే లెగసీని క్రియేట్ చేస్తుందని అభిమానులు, మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks