26 ఏళ్లకే వర్జినిటీ కోల్పోయాను.. మీ ఫ్యామిలీలో ఒకరితోనే అలా చేశాను: జాన్వీ కపూర్‌కు షాకిచ్చిన డైరెక్టర్
జాన్వీ కపూర్‌కు గట్టి షాకే ఇచ్చాడు బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. తాను 26 ఏళ్ల వయసులోనే వర్జినిటీ కోల్పోయానని, అది కూడా మీ కుటుంబంలో ఒకరితో ఇంటిమేట్ అయ్యానని అతడు అనడంతో జాన్వీ బిత్తరపోయింది.
బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ కు తరచూ నోరు జారడం అలవాటే. తన కాఫీ విత్ కరణ్ షో అయినా, ఇతర టీవీ షోలలో చేయకూడని కామెంట్స్ చేస్తుంటాడు. తాజాగా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న టూ మచ్ షోలో జాన్వీ కపూర్ బిత్తరపోయేలా అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కరణ్ జోహార్ ఏమన్నాడంటే?
అమెజాన్ ప్రైమ్ వీడియోలో కాజోల్, ట్వింకిల్ ఖన్నా కలిసి టూ మచ్ అనే టాక్ షో చేస్తున్న విషయం తెలుసు కదా. దీనికి తాజాగా కరణ్ జోహార్, జాన్వీ కపూర్ గెస్టులుగా వచ్చారు. అయితే ఈ ఎపిసోడ్ లో ప్రశ్నలు, జవాబులు కాస్త హద్దు మీరినట్లుగా ఉన్నాయంటూ ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగా మీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఓ నిజం, మరొక అబద్ధం చెప్పండి.. అందులో ఏది నిజమో, ఏది కాదో మేము చెబుతాం అని జాన్వీ కపూర్ అడుగుతుంది.
దీనికి కరణ్ జోహార్ స్పందిస్తూ.. “నేను 26 ఏళ్ల వయసులోనే నా వర్జినిటీ కోల్పోయాను. మీ ఇంట్లోనే ఒకరితో చాలా ఇంటిమేట్ అయ్యాను” అని అన్నాడు. దీంతో జాన్వీ ఏమనాలో తెలియక షాక్ తిన్నట్లుగా కూర్చుంది. అది విని పక్కనే ఉన్న ట్వింకిల్ ఖన్నా స్పందిస్తూ.. అది బోనీ అయితే కాదు కదా అని అనడంతో జాన్వీ నెత్తిన చేతులు పెట్టుకుంది.
అయితే దీనిపై వెంటనే స్పందించిన కరణ్ జోహార్.. “ఆ పార్టీకి నేను ఆలస్యంగా వెళ్లాను. మీ ఫ్యామిలీలో ఎవరితోనూ అలా ఇంటిమేట్ కాలేదు. అయితే ఆ ఆలోచన మాత్రం నాకు కొన్నిసార్లు వచ్చింది” అని క్లారిటీ ఇచ్చాడు.
జాన్వీ కపూర్ ప్లాస్టిక్ సర్జరీ
ఇక ఇదే షోలో తాను అందంగా కనిపించడానికి సర్జరీలు చేసుకున్నానన్న విమర్శలపైనా జాన్వీ స్పందించింది. "నేను ఒక వీడియో చూశాను. అందులో డాక్టర్ అని చెప్పుకుంటున్న వ్యక్తి మాట్లాడుతూ.. 'ఈ వ్యక్తి తన ముఖానికి ఏమి చేశారో ఒకసారి చూద్దాం' అని అన్నారు. అతను 'బఫెలో ప్లాస్టీ' లాంటి ఒక పదాన్ని కూడా వాడాడు" అని జాన్వీ చెప్పింది.
జాన్వీ కపూర్ ఇంకా మాట్లాడుతూ.. "నేను ఏమైనా చేసి ఉంటే అది చాలా ఆలోచనాత్మకంగా, సందర్భోచితంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. స్పష్టంగా మా అమ్మ (శ్రీదేవి) నాకు మార్గనిర్దేశం చేసింది. ఈ వీడియోలను చూసి, మేము బఫెలో ప్లాస్టీ చేయించుకోవాలి అని నిర్ణయించుకునే యువతులకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ అది తప్పుగా జరిగితే, దాని కంటే దారుణమైనది మరొకటి ఉండదు. పారదర్శకత చాలా ముఖ్యం" అని జాన్వీ గట్టిగా చెప్పింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


