...
...
Next Story

బిలినియర్ వర్సెస్ బెగ్గర్.. తెలుగు, తమిళంలో ఒక నిమిషం మాత్రమే తేడా.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్

టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెలుగు, తమిళంలో ఏక కాలంలో తెరకెక్కించిన సినిమా కుబేర. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా, జిమ్ సర్బ్ ప్రధాన పాత్రలు పోషించిన కుబేర జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియా ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

Published on: Jun 19, 2025 06:13 AM IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. ఎన్నో బ్యూటిపుల్ సినిమాలు అందించిన ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కుబేర. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందించిన కుబేర మూవీలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా, జిమ్ సర్బ్ ప్రధాన పాత్రలు పోషించారు.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్

బిలినియర్ వర్సెస్ బెగ్గర్.. తెలుగు, తమిళంలో ఒక నిమిషం మాత్రమే తేడా.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్
బిలినియర్ వర్సెస్ బెగ్గర్.. తెలుగు, తమిళంలో ఒక నిమిషం మాత్రమే తేడా.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్

అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌వీసీఎల్ఎల్‌పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు కుబేరా చిత్రాన్ని హై బడ్జెట్‌తో, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా కుబేర విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

కుబేర తీయడానికి మోటివేషన్ ఏమిటి?

-మోటివేషన్ అంటూ ఏం లేదు కానీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ లైన్ అనిపించింది. ఒక సూపర్ రిచ్ ప్రపంచం, ఇంకొకటి అట్టడుగున ఉండే ప్రపంచం.. బిలినియర్ వర్సెస్ బెగ్గర్.. అది ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.

ఎమోషనల్ థ్రిల్లర్

-నిజానికి ఇది కథగా చెప్పడం చాలా కష్టం. చాలా పెద్ద పాయింట్. అది మెల్లగా ఎవాల్వ్ అయిన ఒక ఎమోషనల్ థ్రిల్లర్ తయారయింది. అక్కడ నుంచి డెవలప్ చేయడం జరిగింది. తనకి ఏమీ వద్దు అనుకునే ఒక బెగ్గర్.. తనకి ప్రపంచంలో అన్ని కావాలనుకునే ఒక బిలినియర్.. వారి మధ్య కాన్‌ఫ్లిక్ట్ ఉంటే ఎలా ఉంటుందనేది చాలా ఇంట్రెస్టింగ్.

డెఫినెట్‌గా చెప్పాలి

- ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు, కథలు వస్తున్నాయి. కానీ, ఇలాంటి ఒక కథ నేను చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కథ డెఫినెట్‌గా చెప్పబడాలి. ఈ కథ అవేర్నెస్‌ని తీసుకొస్తుంది. మంచి థ్రిల్లింగ్ పాయింట్.

రెండు భాషల్లో షూట్

-లేదండి. ఇది ఐడియాలాజికల్ బాటిల్ ఉండే సినిమా కాదు. అయితే సినిమా చూస్తున్నప్పుడు ఇలాంటి ఒక రెండు ప్రపంచాలు ఉన్నాయనే అవేర్నెస్ వస్తుంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe