SS Rajamouli: గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత్ గర్వపడేలా చేశారు. ఫ్రాన్స్‌లోని లియాన్ నగరంలో ఉన్న ప్రసిద్ధ లూమియర్ మ్యూజియం (Lumière Museum) సందర్శించిన ఆయనకు అక్కడ అత్యంత అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ల పక్కన రాజమౌళి పేరును శాశ్వతంగా చేర్చడంతో ఆ మెగా ఈవెంట్ లో ఎమోషనల్ సీన్స్ కనిపించాయి.
ఈగ, ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్

ఈ ప్రత్యేక పర్యటనలో భాగంగా లూమియర్ మ్యూజియంలో రాజమౌళి విజువల్ వండర్స్ 'ఈగ' (Eega), 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాలను స్పెషల్ గా స్క్రీనింగ్ చేశారు. హాల్ మొత్తం ప్రేక్షకులతో నిండిపోగా, విదేశీ ఆడియన్స్ మన జక్కన్న మేకింగ్‌కు పూర్తిగా ఫిదా అయిపోయారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రేమాక్స్ (Thierry Frémaux) స్వయంగా రాజమౌళిని అక్కడి ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేయడం విశేషం.
హాలీవుడ్ లెజెండ్స్ వాల్ పై జక్కన్న పేరు
సినిమాల స్క్రీనింగ్ ముగిసిన తర్వాత థియరీ ఫ్రేమాక్స్ మన డైరెక్టర్‌కు ఒక ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రపంచంలోనే సినిమా పురుడు పోసుకున్న ఆ చారిత్రాత్మక వీధిలోకి రాజమౌళిని పర్సనల్ గా తీసుకెళ్లారు. సినిమా హిస్టరీ స్టార్ట్ అయిన ఆ ప్లేస్ లో నడుస్తున్నప్పుడు జక్కన్న తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ ట్రిప్ లో అసలైన మైండ్ బ్లోయింగ్ హైలైట్ 'ముర్ డెస్ సినీయాస్టెస్' (Mur des Cinéastes) వాల్ దగ్గర జరిగింది. మార్టిన్ స్కోర్సెస్, క్లింట్ ఈస్ట్‌వుడ్, క్వెంటిన్ టరాంటినో, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా లాంటి వరల్డ్ క్లాస్ లెజెండరీ ఫిల్మ్ మేకర్ల పేర్లు ఉన్న ఆ ప్రసిద్ధ గోడపై ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి పేరును కూడా అఫీషియల్ గా చెక్కారు. హాలీవుడ్ దిగ్గజాల పక్కన తన పేరును చూసుకున్న రాజమౌళి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
"ఈ అరుదైన గౌరవం నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను. ఇంతటి గొప్ప సత్కారాన్ని అందించిన ఇన్సిట్యూట్ లూమియర్ టీమ్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అనుభూతి నన్ను మరింత వినమ్రంగా మార్చింది" అని రాజమౌళి ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు.
గ్లోబల్ బాక్సాఫీస్ పై టాలీవుడ్ జెండా
{{/usCountry}}"ఈ అరుదైన గౌరవం నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను. ఇంతటి గొప్ప సత్కారాన్ని అందించిన ఇన్సిట్యూట్ లూమియర్ టీమ్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అనుభూతి నన్ను మరింత వినమ్రంగా మార్చింది" అని రాజమౌళి ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు.
గ్లోబల్ బాక్సాఫీస్ పై టాలీవుడ్ జెండా
{{/usCountry}}బాహుబలి సిరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ రేంజ్ మార్చిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ (Oscar) స్టేజ్ వరకు వెళ్లి నాటు నాటు సాంగ్ తో హిస్టరీ క్రియేట్ చేశారు. వరల్డ్ వైడ్ గా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆర్ఆర్ఆర్ క్రేజ్ పాశ్చాత్య దేశాలలో ఇప్పటికీ తగ్గలేదు. ఈ అంతర్జాతీయ గుర్తింపుతో గ్లోబల్ లెవెల్లో మోస్ట్ సెలబ్రేటెడ్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ గా రాజమౌళి పొజిషన్ మరింత స్ట్రాంగ్ అయింది.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి మూవీ చేస్తున్న విషయం తెలుసు కదా. దీనిని గ్లోబల్ లెవెల్లో ఐమాక్స్ ఫార్మాట్ లో షూట్ చేస్తున్నారు. ఈ సినిమాతో రాజమౌళి పేరు మరింతగా మార్మోగనుంది. ఈ సినిమా మరో 80 రోజుల షూటింగ్ మిగిలి ఉందని ఈ మధ్యే రాజమౌళి వెల్లడించారు. వారణాసి మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.