Vijay: విజయ్‌ని సీఎం చేసిన ఆ నంబర్ ప్లేట్ గిఫ్ట్‌గా ఇచ్చిన డైరెక్టర్.. ఆయన రియాక్షన్ వైరల్
Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్‌ను దర్శకుడు వెంకట్ ప్రభు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 'ది గోట్' సినిమాలో చూపించిన నంబర్ ప్లేట్ నిజమవ్వడంతో, ఆ నంబర్ ప్లేట్‌ను ఒక స్పెషల్ ఫ్రేమ్‌గా తయారుచేసి విజయ్‌కు బహుమతిగా అందించి తన సంతోషాన్ని పంచుకున్నారు.
Vijay: తమిళ చిత్రసీమలో తిరుగులేని 'దళపతి'గా వెలిగిన జోసెఫ్ విజయ్.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి సరికొత్త చరిత్ర సృష్టించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సాధించిన ఈ విజయం రాత్రికి రాత్రి వచ్చింది కాదు. సినిమాల్లో పొలిటికల్ పంచ్‌లు విసరడం, సామాజిక అన్యాయాలపై పోరాటాలు చేయడం ద్వారా ఆయన ప్రజా హృదయాల్లో బలమైన స్థానం సంపాదించుకున్నారు.

ఆయన రాజకీయ విజయాన్ని 2024లో వచ్చిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (ది గోట్) సినిమా ముందే ఊహించిందని చెప్పవచ్చు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు.. ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసి ఒక అద్భుతమైన బహుమతిని అందించారు.
'ది గోట్' సినిమాలోని ఆ నంబర్ ప్లేట్ నిజమైంది
సోమవారం (మే 18) నాడు ముఖ్యమంత్రి విజయ్‌ని దర్శకుడు వెంకట్ ప్రభు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత, ‘ది గోట్’ సినిమాలో ఆయన విజయాన్ని ముందే ఊహించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది.
ఆ సినిమాలో విజయ్ పాత్ర ప్రయాణించే వాహనానికి ‘TN 07 CM 2026’ అనే నంబర్ ప్లేట్ ఉంటుంది. ఇప్పుడు అదే నిజం కావడంతో, వెంకట్ ప్రభు ఆ నంబర్ ప్లేట్‌ను ఒక ప్రత్యేకమైన ఫ్రేమ్‌గా మార్చి విజయ్‌కు బహుమతిగా ఇచ్చారు.
బ్లాక్, బ్రౌన్, కాపర్ రంగుల కలయికతో ఉన్న ఈ ఫ్రేమ్‌లో ఆ నంబర్ ప్లేట్‌ను అమర్చారు. విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ రంగులైన పసుపు, ఎరుపు బ్యాక్‌డ్రాప్‌ను దీనికి ఉపయోగించారు.
దాని కిందే విజయ్, వెంకట్ ప్రభు ఫిస్ట్ బంప్ ఇచ్చుకున్న ఫోటో ఉంది. "VP అండ్ టీమ్ చేసిన మొదటి మ్యానిఫెస్టేషన్" అని ఒక గోల్డ్ ప్లేట్‌పై రాసి ఉంది. ఈ స్పెషల్ గిఫ్ట్ అందుకున్న సమయంలో సీఎం విజయ్ ముఖంలో ఎంతో సంతోషం కనిపించింది.
వెంకట్ ప్రభు ఏమన్నాడంటే?
"ఒక ఆలోచన నుంచి.. ఒక విజన్ వైపు.. చివరికి ఈ అద్భుత క్షణం రూపంలో ఒక చరిత్ర సృష్టించారు. మన గౌరవనీయ సీఎం విజయ్ అన్నను ఈ రోజు కలిసి ‘ది గోట్’ చిత్రానికి సంబంధించిన మొదటి మ్యానిఫెస్టేషన్ గిఫ్ట్‌ను అందించడం చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే" అని వెంకట్ ప్రభు తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.
తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్‌కి భారీ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా డబ్ అయి సూపర్‌హిట్ సాధించాయి. అందువల్ల ఆయన ముఖ్యమంత్రి కావడం ఇటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
2013లోనే ఊహించారు.. బెంగాలీ నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
విజయ్ ఎప్పటికైనా సీఎం అవుతారని పరిశ్రమలోని వారు చాలా ఏళ్ల క్రితమే ఊహించారు. 2013లో వచ్చిన ‘కత్తి’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను బెంగాలీ నటుడు తోటా రాయ్ చౌదరి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఒక సీన్ పూర్తికాగానే అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారని, ఆ తర్వాత విజయ్ సెక్రటరీ తనను విజయ్ రూమ్‌కు రమ్మని పిలిచారని చెప్పారు. తాను ఏదైనా తప్పు చేశానేమో అని కంగారు పడ్డానని ఆయన అన్నారు.
"విజయ్ ఎంతో మర్యాదగా నన్ను కూర్చోమని చెప్పి కాఫీ ఆఫర్ చేశారు. నేను ఎక్కడి నుంచి వచ్చానో అడిగి తెలుసుకున్నారు. నా గురించి ఎక్కువ సమాచారం తెలియకపోవడంతో క్షమాపణలు కూడా కోరారు. ఆయన నిజమైన జెంటిల్‌మన్. నేను రూమ్ బయటకు రాగానే విజయ్ అసిస్టెంట్లు నన్ను చుట్టుముట్టారు. ఆయన మీతో అంతసేపు మాట్లాడారా? కాఫీ ఇచ్చారా? అంటూ ఆశ్చర్యపోయారు. మీరెందుకు ఆయనను అంతలా చూస్తున్నారు అని నేను అడగగా.. ఆయన మా రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పారు. విజయ్ సొంత పార్టీ పెట్టినప్పుడు నాకు ఆ అసిస్టెంట్ అన్న మాటలు గుర్తొచ్చాయి" అని తోటా రాయ్ చౌదరి గుర్తుచేసుకున్నారు.
చివరి సినిమా లీక్ వివాదం
రాజకీయాల్లో పూర్తిగా బిజీ కాకముందే విజయ్ తన చివరి సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో వస్తున్న 'జన నాయగన్' సినిమాతో ఆయన వెండితెరకు వీడ్కోలు పలకనున్నారు. నిజానికి ఈ సినిమా జనవరిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు (CBFC) నుంచి సర్టిఫికేషన్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడింది.
దురదృష్టవశాత్తూ ఏప్రిల్ నెలలో ఈ సినిమా హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఈ లీకేజ్ వ్యవహారంలో పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


