...
...
Next Story

Disha Patani Trolling: గణపతి పూజకు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తావా.. హిందువుల పండగలంటే విలువే లేదు: దిషా పటానీపై ట్రోలింగ్

Disha Patani Trolling: దిశా పటానీ గణపతి పూజకు వేసుకున్న డ్రెస్ పై వివాదం రేగుతోంది. ఫ్యాషన్ షోకి వెళ్లినట్లుగా పూజకు బోల్డ్ డ్రెస్ వేసుకొని రావడంపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.

Published on: Sep 15, 2026, 15:25:13 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Disha Patani Trolling: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ మరోసారి వార్తల్లో నిలిచారు. ముంబైలో అంబానీ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించిన గణేష్ చతుర్థి 2026 వేడుకల్లో ఆమె వేసుకున్న బోల్డ్ అవుట్‌ఫిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. వినాయక దర్శనం కోసం లో-కట్ బ్లౌజ్, రెడ్ లెహంగాలో వచ్చిన దిషాను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

అంబానీ వేడుకల్లో బోల్డ్ డ్రెస్.. ఫొటోలు వైరల్

Disha Patani Trolling: గణపతి పూజకు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తావా.. హిందువుల పండగలంటే విలువే లేదు: దిషా పటానీపై ట్రోలింగ్ (PTI)
Disha Patani Trolling: గణపతి పూజకు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తావా.. హిందువుల పండగలంటే విలువే లేదు: దిషా పటానీపై ట్రోలింగ్ (PTI)

వినాయక చవితి పండగ సందర్భంగా ముంబైలోని అంబానీ నివాసంలో జరిగిన గణపతి పూజకు బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ వేడుకకు దిశా పటానీ రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ ఘాగ్రా, డీప్-కట్ బ్లౌజ్ వేసుకొని వచ్చారు.

ఒంటిపై ఎర్రటి దుపట్టాతో పాటు హెవీ ఇయర్ రింగ్స్, గాజులతో మెరిసిపోతూ మీడియా కెమెరాలకు పోజులిచ్చారు. అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలోకి రాగానే నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దేవుడి పూజకు వచ్చేటప్పుడు పద్ధతిగా దుస్తులు వేసుకోవాలనే కనీస జ్ఞానం లేదా అంటూ ఎక్స్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

"ఫ్యాషన్ షో కాదిది!".. నెటిజన్ల ఫైర్

దిశా పటానీ లుక్‌పై సోషల్ మీడియాలో కామెంట్ల తుఫాన్ నడుస్తోంది. "గణపతి పూజకు ఇలాంటి అసభ్యకరమైన దుస్తులేంటి? పూజా వేదికలకు కచ్చితంగా డ్రెస్ కోడ్ పెట్టాలి" అని ఒక నెటిజన్ ఘాటుగా స్పందించారు.

"ఇది వినాయక దర్శనం, భక్తితో దండం పెట్టుకోవడానికి వచ్చారా లేక ర్యాంప్ వాక్ చేయడానికి వచ్చారా?" అని మరొకరు ప్రశ్నించారు. హిందువుల సంస్కృతి, పండగల పవిత్రతను బాలీవుడ్ భామలు బొత్తిగా పట్టించుకోవడం లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ఇటీవలే ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ 'గివా' (GIVA) రాఖీ అడ్వర్టైజ్‌మెంట్‌లో కృతి సనన్ వేసుకున్న బ్రాలెట్ బ్లౌజ్ కూడా పెద్ద వివాదానికి దారితీసింది. ఆ యాడ్‌పై తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడంతో కంపెనీ దాన్ని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

ఆ వివాదం ముగియక ముందే ఇప్పుడు దిశా పటానీ రూపంలో మరో వివాదం బయటకు వచ్చింది. "మొన్న కృతి సనన్, నిన్న దిశా పటానీ.. హిందూ పండగల సమయంలోనే వీళ్లకు ఇలాంటి బట్టలు వేసుకోవాలనిపిస్తుందా?" అని సోషల్ మీడియా యూజర్లు ప్రశ్నిస్తున్నారు.

సాంప్రదాయాన్ని గౌరవించండి

మహిళల దుస్తుల స్వేచ్ఛను ఎవరూ కాదనడం లేదని, అయితే సందర్భాన్ని బట్టి డ్రెస్సింగ్ ఉండాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. నైట్‌క్లబ్‌లు, పార్టీలు, డ్యాన్స్ ఫ్లోర్‌లకు వేసుకునే బట్టలను దేవుడి పూజలకు వేసుకురావడం పబ్లిసిటీ స్టంట్ కాకపోతే మరేంటని నిలదీస్తున్నారు.

కాగా దిశా పటానీ ఇటీవల ఇమ్రాన్ హష్మీ సరసన 'ఆవారాపన్ 2' సినిమాలో కనిపించారు. అలాగే కృతి సనన్ షాహిద్ కపూర్, రష్మిక మందన్నతో కలసి 'కాక్‌టెయిల్ 2' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ డ్రెస్ కోడ్ వివాదంపై దిశా పటానీ ఇంకా స్పందించాల్సి ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks