Dose OTT: ఇవాళ ఆరు ఓటీటీల్లోకి వచ్చిన మలయాళం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్-ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్ లు- ఎందుకు చూడాలంటే?
Dose OTT: మలయాళ ఇండస్ట్రీ నుంచి మరో ఇంటెన్స్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటీ? ఓటీటీలో ఈ వీకెండ్ దీనిని ఎందుకు చూడాలి? అనే కారణాలపై ఓ లుక్కేయండి.
Dose OTT: సౌత్ ఇండియన్ డిజిటల్ స్పేస్‌లో మలయాళ క్రైమ్ థ్రిల్లర్లకు తిరుగులేని క్రేజ్ ఉంది. కేవలం కథనంలో ఉండే రా అండ్ రస్టిక్ ఇంటెన్సిటీ కారణంగా మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాలను విపరీతంగా ఆదరిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి చేరడానికి ఓటీటీలోకి వచ్చేసింది మాలీవుడ్ లేటెస్ట్ సస్పెన్స్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘డోస్’.

డోస్ ఓటీటీ రిలీజ్
‘ప్రేమమ్’ ఫేమ్ సిజు విల్సన్ (Siju Wilson), వర్సటైల్ యాక్టర్ జగదీష్ (Jagadish) ప్రధాన పాత్రల్లో నటించిన ‘డోస్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు డిజిటల్ స్క్రీన్స్ పైకి వస్తుందా అని సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్ గూగుల్‌లో తెగ సెర్చ్ చేశారు. ఇవాళ (జూలై 10) ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ షురూ అయింది.
ఏకంగా ఆరు ఓటీటీల్లోకి
డోస్ మూవీ ఓటీటీ ఎంట్రీనే ఓ సెన్సేషనల్. ఎందుకంటే ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఏకంగా ఒకే రోజు ఆరు ఓటీటీల్లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళ్, సింప్లీ సౌత్, ఏపీ ఇంటర్నేషనల్, లయన్స్ గేట్ ప్లే, మనోరమా మ్యాక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది.
కేవలం రొటీన్ మర్డర్ మిస్టరీలా కాకుండా.. ఈ సినిమా కథ , విజువల్ ట్రీట్‌మెంట్ ప్రేక్షకులకు సరికొత్త ‘డోస్’ ఇవ్వబోతున్నాయి.
‘డోస్’ అసలు కథేంటంటే?
ఈ సినిమా కథ అంతా ఓ హాస్పిటల్లో జరిగే మరణాలు చుట్టూ తిరుగుతుంది. ఆ మరణాలు అన్నీ సస్పీషియస్ గా ఉంటాయి. ఈ మరణాల వెనుక ఉన్న గుట్టు ఏంటో తెలుసుకోవాలని అదే హాస్పిటల్లో పని చేసే పల్మోనాలజిస్ట్ డాక్టర్ ప్రకాష్ (సిజు విల్సన్) ట్రై చేస్తాడు. అతనికి ఓ పోలీస్ ఆఫీసర్ తోడవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే డోస్ మూవీ స్టోరీ.
ఈ సినిమాను ఓటీటీలో ఎందుకు చూడాలి?
- జగదీష్ ‘సైకో’ మేకోవర్: ఒకప్పుడు మలయాళంలో ప్యూర్ కామెడీ రోల్స్ చేసిన సీనియర్ నటుడు జగదీష్.. ఈ మధ్య కాలంలో ‘రోర్‌షాక్’ వంటి చిత్రాలలో అత్యంత భయంకరమైన డార్క్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి మెప్పించారు. ఇప్పుడు డోస్ సినిమాలో ఆయన పండించిన సైకలాజికల్ టెన్షన్ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయం.
- మైండ్ బెండింగ్ స్క్రీన్ ప్లే: కథలో ప్రతి 20 నిమిషాలకు వచ్చే ట్విస్ట్‌లు ఊహకందని విధంగా ఉంటాయి. లౌడ్ మ్యూజిక్ లేదా అనవసరమైన కమర్షియల్ హంగులు లేకుండా సీన్ల ద్వారానే భయాన్ని, సస్పెన్స్‌ను క్రియేట్ చేశారు.
- రియలిస్టిక్ అప్రోచ్: మెడికల్ క్రైమ్స్ నేపథ్యంలో వచ్చే సినిమాల్లో ఉండే సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా.. కథను చాలా ప్రాక్టికల్‌గా, రా అండ్ రస్టిక్‌గా ప్రెజెంట్ చేశారు.
- వీకెండ్ వాచ్: వీకెండ్‌లో టైమ్ పాస్ సినిమాలు చూసి బోర్ ఫీల్ అయ్యే వీక్షకులకు ఇదొక ఇంటెలిజెంట్ థ్రిల్లర్. సమాజంలో జరిగే కొన్ని చీకటి నిజాలను కళ్ళకు కట్టినట్లు చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


