నైట్ పార్టీకి రూ.35 లక్షలు-నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు-కన్నీళ్లు పెట్టుకున్న డ్రాగన్ బ్యూటీ కాయదు లోహర్
డ్రాగన్ సినిమాతో పాపులర్ అయిన హీరోయిన్ కాయదు లోహర్. అయితే ఆమె నైట్ పార్టీల కోసం రూ.35 లక్షలు తీసుకుందనే ఆరోపణలు వచ్చాయి. ఈడీ కేసు ప్రచారం సాగింది. వీటిపై తాజాగా కాయదు రియాక్టయింది.
ఈ ఏడాది మే నెలలో నటి కాయదు లోహార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దృష్టి సారించిందని, ఆమెను తమిళనాడులోని టస్మాక్ (TASMAC) కేసుతో ముడిపెట్టారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా సెప్టెంబర్‌లో కరూర్ తొక్కిసలాట తర్వాత, ఆమె పేరుతో ఒక నకిలీ ఖాతాలో విజయ్ ర్యాలీలో తన స్నేహితుడు మరణించాడనే పోస్టు వచ్చింది. ఈ పుకార్లు వ్యాప్తి చెందిన నెలల తర్వాత డ్రాగన్ హీరోయిన్ కాయదు 'బిహైండ్‌వుడ్స్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌనం వీడింది.

కాయదు కామెంట్లు
నైట్ పార్టీ కోసం రూ.35 లక్షలు తీసుకోవడం, మద్యం స్కామ్ తో సంబంధాల ఆరోపణలపై కాయదు లోహర్ స్పందించింది. ప్రజలు తన గురించి ఇలా మాట్లాడటం కష్టంగా ఉందని ఆమె అంగీకరించింది. పుకార్లను ఎదుర్కోవడం కష్టంగా ఉందని తెలిపారు. కాయదు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి 'డ్రాగన్' చిత్రంలో నటించిన తర్వాత పాపులర్ అయింది కాయదు. కానీ ఆ తర్వాత పరిణామాల గురించి మాట్లాడుతూ ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుంది.
నిద్ర పోదామంటే
“ఇది అంత సులభం కాదు. నేను దీని గురించి చాలా కాలంగా ఆలోచిస్తున్నాను. నేను ఈ నేపథ్యం నుండి రాలేదు. ఇది నాకు చాలా కొత్త. ప్రజలు నా గురించి మాట్లాడుతున్న ఏదైనా నన్ను ఇంతగా బాధపెడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను నిద్ర పోదామంటే, ప్రజలు నా గురించి ఇలా అనుకుంటున్నారనే ఆలోచన నిద్ర రాకుండా చేస్తుంది. ఎందుకంటే నేను ప్రపంచంలో ఎవరి గురించి కూడా ఇలా అనుకోను” అని కాయదు చెప్పింది.
ఎందుకు టార్గెట్?
“నేను కేవలం ప్రజలతో మంచిగా ఉండటానికి ప్రయత్నించాను. నేను నా కలను అనుసరిస్తున్నాను. నేను ఏమి తప్పు చేశానో నాకు తెలియదు. నేను ఈ కామెంట్లు చూసినప్పుడు, ప్రజలు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, చదవడం అంత సులభం కాదు. అసలు ప్రశ్న ఏమిటంటే, నన్ను ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు? కానీ ఇది నా వృత్తిలో ఒక భాగమని నేను అర్థం చేసుకున్నా. కానీ అది నన్ను ఎంతగానో ప్రభావితం చేసిందో నేను వివరించలేను. నేను దానితో సంతోషంగా లేను. నేను ప్రేమను పంచుతూనే ఉంటా. కృతజ్ఞతతో ఉంటాను. వదులుకోవడం ఒక ఎంపిక కాదు” అని కాయదు తెలిపింది.
ఏం జరిగింది?
తమిళనాడులోని TASMAC స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోకి కాయదు వచ్చిందని వార్తలు వచ్చాయి. స్కామ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు, ఈడీ దాడుల సమయంలో దొరికిన వాళ్లు ఆమె పేరును ప్రస్తావించినట్లు మిడ్‌డే నివేదిక ప్రకారం తెలిసింది. ఆ నివేదికలో కాయదు 'రాత్రి పార్టీలకు' హాజరు కావడానికి రూ.35 లక్షలు వసూలు చేశారని కూడా పేర్కొన్నారు.
కరూర్ తొక్కిసలాట
ఇక సెప్టెంబర్‌లో ఆమె పేరుతో ఫేక్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో కరూర్ తొక్కిసలాటలో విజయ్ ర్యాలీలో తన స్నేహితుడు మరణించాడనే పోస్టు పెట్టారు. ఆ ఖాతా నకిలీదని, తనకు కరూర్ లో ఎటువంటి స్నేహితులు లేరని ఆమె స్పష్టం చేయాల్సి వచ్చింది. తన పేరుతో వ్యాప్తి చెందుతున్న కథనం నకిలీదని తన అనుచరులకు తెలియజేసింది. కాయదు ఇప్పుడు తమిళం, తెలుగు, మలయాళంలో సినిమాలు చేస్తోంది. ఇధయమ్ మురళి, ఇమ్మోర్టల్, సింబుతో టైటిల్ లేని చిత్రం, పల్లిచట్టంబి, ఫంకీ తదితర సినిమాల్లో నటిస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


