Drishyam 3 collection : వీకెండ్‌లో జంప్ కొట్టిన దృశ్యం 3 కలెక్షన్లు- మోహన్‌లాల్ సినిమాకి తగ్గని క్రేజ్..
Drishyam 3 box office collection : దృశ్యం 3లో మోహన్‌లాల్ జార్జ్కుట్టీగా తిరిగొచ్చిన విషయం తెలిసిందే. సినీ అభిమానులు కూడ ఈసారి జార్డ్కుట్టిని మరింత దగ్గర చేసుకున్నారు! ఈ నేపథ్యంలో దృశ్యం 3 సినిమా బాక్సాఫీస్ కలెకన్ల వివరాలను ఇక్కడ చూసేయండి..
మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్, సస్పెన్స్ సినిమాల దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సైకలాజికల్ థ్రిల్లర్ 'దృశ్యం 3' బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది! థియేటర్లలోకి వచ్చిన పది రోజుల్లోనే ఈ సినిమా ఊహించని రీతిలో వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. అంతేకాదు రెండొవ వీకెండ్‌లో ఈ చిత్రం మరింత పుంజుకుంది. 10వ రోజు ఈ సినిమా ఇండియాలో రూ. 5.05 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. దీనితో కేవలం పది రోజుల్లోనే 'దృశ్యం 3' ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 219 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

కొత్త సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ, జార్జ్‌కుట్టి ఫ్యామిలీని థియేటర్లలో చూడటానికి ఆడియన్స్ భారీగా తరలివస్తున్నారు. కేవలం సస్పెన్స్ మాత్రమే కాకుండా ఎమోషనల్ కనెక్ట్ ఉండటంతో సినిమాకు లాంగ్ రన్ లభిస్తోంది.
'దృశ్యం 3' 10 రోజుల కలెక్షన్ల పూర్తి బ్రేక్‌డౌన్, విశ్లేషణ ఇక్కడ చూద్దాము..
1. దేశీయ, అంతర్జాతీయ వసూళ్లు…
రెండొవ వీకెండ్ ఈ సినిమాకు భారీగా కలిసి వచ్చింది. శుక్రవారం వచ్చిన రూ. 4.30 కోట్లతో పోలిస్తే, వీకెండ్ కలెక్షన్లు స్పష్టమైన వృద్ధిని కనబరిచాయి.
ఇండియా నెట్ కలెక్షన్స్: 10 రోజుల్లో కలిపి భారతదేశంలో ఈ చిత్రం రూ. 91.30 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
ఇండియా గ్రాస్ కలెక్షన్స్: దేశీయ మార్కెట్లో దీని మొత్తం గ్రాస్ వసూళ్లు రూ. 105.94 కోట్లకు చేరాయి.
ఓవర్సీస్ మార్కెట్ (విదేశాల్లో): విదేశాల్లో మోహన్‌లాల్ క్రేజ్ మరోసారి నిరూపితమైంది. కేవలం 10వ రోజే అంతర్జాతీయంగా రూ. 6 కోట్లు రాబట్టింది. దీనితో విదేశీ మొత్తం గ్రాస్ వసూళ్లు రూ. 113.75 కోట్లకు చేరాయి.
| మార్కెట్ | 10 రోజుల వసూళ్లు |
|---|---|
| భారతదేశం | రూ. 105.94 కోట్లు |
| విదేశాలు | రూ. 113.75 కోట్లు |
| ప్రపంచవ్యాప్తం | రూ. 219.69 కోట్లు |
2. కేవలం సస్పెన్స్ మాత్రమే కాదు.. అంతకుమించి!
దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ మూడొవ భాగాన్ని కేవలం ఒక మర్డర్ మిస్టరీ లానో లేదా కోర్టు రూమ్ డ్రామా లాగానో కాకుండా, సైకలాజికల్ కోణంలో అద్భుతంగా తెరకెక్కించారు.
జార్జ్‌కుట్టి మానసిక సంఘర్షణ: కుటుంబం కోసం తప్పు చేసిన జార్జ్‌కుట్టి లోపల ఉండే భయం, నేరభావన, నైతిక విలువ సంఘర్షణ ఈ సినిమాలో హృదయానికి హత్తుకునేలా చూపించారు.
నైతిక ప్రశ్నలు: కేవలం తెలివితేటలు, కుటుంబంపై ఉన్న ప్రేమ.. మనం చేసే తప్పుడు పనులను సమర్థించగలవా? అనే పాయింట్‌ను ఈ కథలో చర్చించారు. ఈ భావోద్వేగ అంశాలే సినిమాను కేవలం థ్రిల్లర్ జోనర్‌కే పరిమితం చేయకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా నచ్చేలా చేశాయి.
మాలీవుడ్ హిస్టరీలో భారీ రన్..
'దృశ్యం' ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా, ఈ థర్డ్ పార్ట్ విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లను నమోదు చేస్తోంది. మోహన్‌లాల్ నటన, జీతూ జోసెఫ్ స్క్రీన్‌ప్లే మ్యాజిక్ థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే 'దృశ్యం 3' రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వసూళ్లను సాధించి, 250 కోట్ల క్లబ్‌లో చాలా సులువుగా చేరేలా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


