Drishyam 3 Prime Video: దృశ్యం 3 హక్కులన్నీ మావే.. జాగ్రత్తగా ఉండాలంటూ పబ్లిక్ నోటీస్ జారీ చేసిన ప్రైమ్ వీడియో
Drishyam 3 Prime Video: మలయాళ థ్రిల్లర్ మూవీ 'దృశ్యం 3' డిజిటల్ హక్కులపై అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ బహిరంగ నోటీసు విడుదల చేసింది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని రకాల డిజిటల్ హక్కులు తమకే చెందుతాయని, ఇతరులెవరూ జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది.
మలయాళ సూపర్ హిట్ ఫ్రాంచైజీ 'దృశ్యం' (Drishyam) మూడో భాగం గురించి సినీ వర్గాల్లో ఎప్పటినుంచో ఆసక్తి నెలకొంది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రాబోతున్న ఈ సినిమా డిజిటల్ హక్కుల విషయంలో ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (Amazon) ఇప్పుడు రంగంలోకి దిగింది. 'దృశ్యం 3' డిజిటల్ హక్కులన్నీ తమ వద్దే ఉన్నాయని, ఈ విషయంలో మూడో పక్షం ఎవరైనా జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ అధికారికంగా ఒక పబ్లిక్ నోటీసు జారీ చేసింది.

అమెజాన్ నోటీసులో ఏముంది?
ఆశీర్వాద్ సినిమాస్ (Aashirvad Cinemas), అమెజాన్ మధ్య కుదిరిన ఒప్పందాల ప్రకారం.. "దృశ్యం 3" (మలయాళం) మూవీకి సంబంధించి అన్ని రకాల డిజిటల్ హక్కులు (SVOD, TVOD, AVOD, FVOD, EST సహా) కేవలం అమెజాన్ వద్దే ఉన్నాయని ఈ నోటీసులో స్పష్టం చేశారు. ఈ హక్కులపై అమెజాన్‌కు మాత్రమే పూర్తి, ప్రత్యేకమైన అధికారం ఉందని సంస్థ పేర్కొంది.
ప్రజలకు, ప్లాట్‌ఫామ్‌లకు హెచ్చరిక
ఈ హక్కులను విక్రయించడానికి, లైసెన్స్ ఇవ్వడానికి లేదా ఈ సినిమా డిజిటల్ హక్కులపై ఎలాంటి థర్డ్ పార్టీ ప్రయోజనాలను సృష్టించడానికి ఆశీర్వాద్ సినిమాస్‌కు గానీ, వారి ప్రతినిధులకు గానీ ఎలాంటి అధికారం లేదని అమెజాన్ హెచ్చరించింది.
ఒకవేళ అమెజాన్ హక్కులను ఉల్లంఘిస్తూ ఎవరైనా వ్యక్తులు, సంస్థలు లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఈ సినిమా విషయంలో లావాదేవీలు జరిపితే, వారు తమ సొంత రిస్క్, ఖర్చుతోనే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసులో స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా తమ హక్కులకు విఘాతం కలిగించినా లేదా ఒప్పంద సంబంధాల్లో జోక్యం చేసుకున్నా, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు నష్టపరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయిస్తామని అమెజాన్ స్పష్టం చేసింది.
ఈ నోటీసుతో 'దృశ్యం 3' డిజిటల్ హక్కులపై ఉన్న సందిగ్ధతకు తెరపడటమే కాకుండా, సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయనే విషయం కూడా వెల్లడయ్యింది. దృశ్యం 3 మూవీ మే 21న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల కిందటే ఈ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ వెల్లడించారు.
దృశ్యం సిరీస్ రికార్డులు..
మలయాళ సినిమా చరిత్రలోనే దృశ్యం సిరీస్ ఒక బిగ్గెస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ పార్ట్ దృశ్యం సినిమాలో జార్జ్‌కుట్టి అనే ఒక సామాన్యుడు, తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడని దర్శకుడు జీతు జోసెఫ్ చాలా అద్భుతంగా చూపించాడు.
వాళ్లను పోలీసులు ఎలాగైనా పట్టుకోవాలని చూస్తుంటే, అతడు వాళ్ల కళ్లుగప్పి ఎలా తప్పించుకున్నాడు అనేది జనాలకు భలే కనెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన దృశ్యం 2 కూడా అదే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ అయింది. ఎవరూ ఊహించని ట్విస్టులు, సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే గ్రిప్పింగ్ స్టోరీతో ఆ సెకండ్ పార్ట్ ఆడియన్స్‌కు చాలా బాగా నచ్చేసింది. ఇప్పుడు మూడో భాగం రాబోతోంది. మోహన్ లాల్, మీనా తిరిగి తమ పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper












