ENE Repeat Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈఎన్‌ఈ రిపీట్.. తొలి రోజే పార్ట్ 1 లైఫ్‌టైమ్ రికార్డ్ బ్రేక్!

ENE Repeat Collections: తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన కల్ట్ కామెడీ సీక్వెల్ ‘ఈఎన్‌ఈ రిపీట్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ దక్కింది. ఫస్ట్ రోజే ఈ చిత్రం.. 'ఈ నగరానికి ఏమైంది' పార్ట్ 1 లైఫ్‌టైమ్ కలెక్షన్లను దాటేసి రికార్డు క్రియేట్ చేసింది.

Published on: Nov 20, 2026, 16:49:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ENE Repeat Collections: యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న 'ఈ నగరానికి ఏమైంది' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'ఈఎన్‌ఈ రిపీట్' (ENE Repeat) థియేటర్లలో నవ్వుల తుఫాను సృష్టిస్తోంది. నవంబర్ 19న (గురువారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈఎన్‌ఈ రిపీట్.. తొలి రోజే పార్ట్ 1 లైఫ్‌టైమ్ రికార్డ్ బ్రేక్! (x/ENERepeat)
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈఎన్‌ఈ రిపీట్.. తొలి రోజే పార్ట్ 1 లైఫ్‌టైమ్ రికార్డ్ బ్రేక్! (x/ENERepeat)

పార్ట్ 1 రికార్డ్ గల్లంతు!

ప్రజల కోసం తీసిన సినిమాను ప్రజలే పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటూ చిత్ర బృందం తాజాగా అధికారిక కలెక్షన్ల పోస్టర్‌ను విడుదల చేసింది. మేకర్స్ ప్రకటించిన వివరాల ప్రకారం, 'ఈఎన్‌ఈ రిపీట్' తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.15.27 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

2018లో విడుదలైన 'ఈ నగరానికి ఏమైంది' పార్ట్ 1 తన పూర్తి థియేట్రికల్ రన్‌లో సుమారు రూ. 12 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే, ఇప్పుడు సీక్వెల్ మాత్రం కేవలం మొదటి రోజు వసూళ్లతోనే పార్ట్ 1 లైఫ్‌టైమ్ కలెక్షన్లను అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది.

విశ్వక్ సేన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కెరీర్‌లో ఈఎన్ఈ రిపీట్ చిత్రం సరికొత్త మైలురాయిగా నిలిచింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ సినిమా భారత్‌లో తొలి రోజు రూ.5.85 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో విశ్వక్ సేన్ గత చిత్రాలైన 'దాస్ కా ధమ్కీ' (రూ.5.3 కోట్లు), 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (రూ.5.2 కోట్లు), 'గామి' (రూ.4 కోట్లు) తొలి రోజు రికార్డులను 'ఈఎన్‌ఈ రిపీట్' అధిగమించింది. విష్వక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.

ఓవర్సీస్‌లోనూ గ్యాంగ్ హవా

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ తరుణ్ భాస్కర్ మార్క్ కామెడీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా యూఎస్ఏ (USA)లో ప్రీమియర్స్, డే 1 వసూళ్లు అద్భుతంగా ఉన్నాయి. తొలి రోజు ఓవర్సీస్ నుంచి సుమారు రూ.4.5 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

వీకెండ్‌లో మరింత జోరు!

విశ్వక్ సేన్, అభినవ్, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను గ్యాంగ్ మళ్లీ తెరపై చేసిన అల్లరి, నాస్టాల్జిక్ మూమెంట్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లకు యూత్ క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ఈఎన్ఈ రిపీట్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ నంబర్లను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More