ENE Repeat OTT: ఓటీటీలోకి ఈరోజు రిలీజైన ఈఎన్ఈ రిపీట్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే? భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్

ENE Repeat OTT: తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం ప్రధాన పాత్రల్లో నటించిన కల్ట్ సీక్వెల్ 'ఈఎన్ఈ రిపీట్' (ENE Repeat / ఈ నగరానికి ఏమైంది 2) నవంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది.

Published on: Nov 19, 2026, 19:46:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ENE Repeat OTT: టాలీవుడ్ కల్ట్ బడ్డీ కామెడీ మూవీ 'ఈ నగరానికి ఏమైంది'కి దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన సీక్వెల్ 'ఈఎన్ఈ రిపీట్' (ENE Repeat) గురువారం (నవంబర్ 19) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. స్టార్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను మరోసారి తమ కామెడీ టైమింగ్‌తో నవ్వుల విందు పంచుతున్నారు.

ENE Repeat OTT: ఓటీటీలోకి ఈరోజు రిలీజైన ఈఎన్ఈ రిపీట్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే? భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్
ENE Repeat OTT: ఓటీటీలోకి ఈరోజు రిలీజైన ఈఎన్ఈ రిపీట్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే? భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్

థియేటర్లలో ఈ సినిమా సందడి మొదలైన రోజే, దీనికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు, నెట్‌ఫ్లిక్స్ కుదుర్చుకున్న ఆసక్తికర ఒప్పందం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు 4 వారాల థియేట్రికల్ విండో ఒప్పందం ప్రకారం, డిసెంబర్ మూడో వారంలో ఈ కామెడీ ఎంటర్‌టైనర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

ఏ ఓటీటీలో, ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది?

'ఈఎన్ఈ రిపీట్' (ఈ నగరానికి ఏమైంది 2) పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మేకర్స్, నెట్‌ఫ్లిక్స్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలోకి రానుంది.

నవంబర్ 19న థియేట్రికల్ రిలీజ్ కావడంతో, సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే డిసెంబర్ మూడో వారంలో (డిసెంబర్ 17 లేదా 18 తేదీల్లో) 'ఈఎన్ఈ రిపీట్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బాక్సాఫీస్ రన్‌ను బట్టి నెట్‌ఫ్లిక్స్ దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది.

బాక్సాఫీస్ కలెక్షన్ల ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ క్రేజీ డీల్

ఈ సినిమాకు నెట్‌ఫ్లిక్స్ ఒక వినూత్నమైన 'పెర్ఫార్మెన్స్ లింక్డ్' ఆఫర్ ఇచ్చింది. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి రూ.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా, బ్రేక్-ఈవెన్ కోసం రూ.30 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది.

మొదట నెట్‌ఫ్లిక్స్ బేసిక్ రేట్ కింద రూ.11 కోట్లకు డిజిటల్ రైట్స్ లాక్ చేసింది. ఒకవేళ థియేటర్లలో ఈ సినిమా రూ.30 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే రూ.16 కోట్లు, రూ.40 కోట్లు దాటితే రూ.19 కోట్లు ఇవ్వనుంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల గ్రాస్ మార్కును అధిగమిస్తే, బేసిక్ రేట్‌కు రెట్టింపు అంటే ఏకంగా రూ.22 కోట్లు చెల్లించేలా నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకుంది.

ఈఎన్ఈ రిపీట్ విశేషాలు

ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ ఎర్రబోలు, సందీప్ నాగిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విశ్వక్ సేన్ గ్యాంగ్‌తో పాటు అనీషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్, కరుణ కుమార్, ప్రియదర్శిని రామ్, మహేశ్ భాస్కర్ కీలక పాత్రల్లో మెరిశారు.

మొదటి భాగానికి ప్రాణం పోసిన వివేక్ సాగర్ ఈ సీక్వెల్‌కు కూడా అద్భుతమైన సంగీతం అందించగా, ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. థియేటర్లలో యూత్‌ను ఊపేస్తున్న ఈ గ్యాంగ్, డిసెంబర్‌లో నెట్‌ఫ్లిక్స్ వేదికగానూ రికార్డు వ్యూస్ సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More