Netflix: నెట్‌ఫ్లిక్స్‌లోని ఈ ప్రభాస్ థ్రిల్లర్ మూవీని వెంటనే చూసేయండి.. ఇంకా కొన్ని రోజులే ఉండేది
Netflix: రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ 'సాహో' త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగిపోనుంది. డిసెంబర్ 7, 2026న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ కేటలాగ్ నుంచి తొలగిపోనుందని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రకటించింది.
Prabhas Saaho Leaving Netflix Soon: 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' చిత్రాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అసాధారణ రికార్డులు సృష్టించిన తర్వాత, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం 2019లో విడుదలై యాక్షన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.

అయితే ఓటీటీలో ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసే ప్రభాస్ అభిమానులకు నెట్‌ఫ్లిక్స్ ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. స్ట్రీమింగ్ హక్కుల గడువు ముగుస్తుండటంతో, డిసెంబర్ 7, 2026న 'సాహో' నెట్‌ఫ్లిక్స్ కేటలాగ్ నుంచి తొలగిపోనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండగా.. తెలుగు, తమిళ, మలయాళ భాషల వెర్షన్లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
హిందీ ఆడియన్స్‌కు చివరి ఛాన్స్.. మరి తెలుగు వెర్షన్ సంగతేంటి?
నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా చూసేందుకు అభిమానులకు ఇక కొన్ని రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే.. నెట్‌ఫ్లిక్స్ వేదికపై 'సాహో' కేవలం హిందీ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఉత్తరాది ప్రభాస్ అభిమానులకు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను చూడటానికి డిసెంబర్ 7 చివరి అవకాశం కానుంది.
తెలుగు, తమిళ, మలయాళ భాషల వెర్షన్లు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తెలుగు ప్రేక్షకులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ప్రైమ్ వీడియోలో సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.
బాక్సాఫీస్ వద్ద 'సాహో' రికార్డులు, మ్యూజిక్ విశేషాలు
'రన్ రాజా రన్' వంటి ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్‌ను నమ్మి యూవీ క్రియేషన్స్ (UV Creations) సంస్థ సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. 2019 ఆగస్టు 30న విడుదలైన ఈ చిత్రం తెలుగులో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించింది. 2019లో అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ డబ్బింగ్ చిత్రంగా 'సాహో' నిలిచింది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. ఇండియాలో రూ.359 కోట్లు రాగా.. ఓవర్సీస్ లో రూ.92 కోట్లు వచ్చాయి. తెలుగు వెర్షన్ లో రూ.152 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ గా నిలవగా.. హిందీ వెర్షన్ రూ.167 కోట్లతో హిట్ అయింది.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, అరుణ్ విజయ్, మందిరా బేడీ కీలక పాత్రలు పోషించారు. తనిష్క్ బాగ్చి, గురు రంధావా, బాద్‌షా, శంకర్-ఎహసాన్-లాయ్ పాటలు అందించగా, ఎస్. తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతంతో యాక్షన్ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లారు. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ చూడాలనుకునే వారు డిసెంబర్ 7లోగా మరోసారి ఈ విజువల్ ట్రీట్‌ను ఆస్వాదించవచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


