Faria Abdullah: ఆ పాట కోసం మా అమ్మ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఇచ్చింది.. వాళ్లు రిజెక్ట్ చేస్తే నాగ్ అశ్విన్ ఛాన్స్: ఫరియా

Faria Abdullah Lite Lelo Song: ఫరియా అబ్దుల్లా తాను నిర్మాతగా మారి తీసిన లైట్ లేలో సాంగ్ గురించి వెరైటీ ఇండియా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ పాట కోసం తన తల్లి తన ఫిక్స్‌డ్ డిపాజిట్ బ్రేక్ చేసిన విషయాన్ని వెల్లడించారు.

Published on: Aug 28, 2026, 17:56:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Faria Abdullah Lite Lelo Song: 'జాతి రత్నాలు' సినిమాతో 'చిట్టి'గా తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న ఫరియా అబ్దుల్లా రీసెంట్‌గా వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఒక నేషనల్ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ విషయాలు పంచుకున్నారు. తను సొంతంగా ప్రొడ్యూస్ చేసిన 'లైట్ లేలో' (Lite Lelo) ర్యాప్ సాంగ్ కోసం ఇన్వెస్టర్లు హ్యాండ్ ఇస్తే, వాళ్ళ అమ్మ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) క్యాన్సిల్ చేసి మరీ డబ్బులు ఇచ్చారని ఎమోషనల్ అయ్యారు.

Faria Abdullah: ఆ పాట కోసం మా అమ్మ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఇచ్చింది.. వాళ్లు రిజెక్ట్ చేస్తే నాగ్ అశ్విన్ ఛాన్స్: ఫరియా
Faria Abdullah: ఆ పాట కోసం మా అమ్మ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఇచ్చింది.. వాళ్లు రిజెక్ట్ చేస్తే నాగ్ అశ్విన్ ఛాన్స్: ఫరియా

చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన ఇన్వెస్టర్లు..

హిందీ వెబ్ సిరీస్ 'ది జెంగబూరు కర్స్' షూటింగ్ కోసం ఒడిశా వెళ్లినప్పుడు అక్కడ కొంతమంది లోకల్ ఆర్టిస్టుల టాలెంట్ చూసి ఫరియా ఒక పొలిటికల్ సెటైర్ ర్యాప్ సాంగ్ ప్లాన్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ స్లాంగ్‌తో పాట డిజైన్ చేసి షూటింగ్‌కి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

తీరా షూటింగ్ మొదలవ్వడానికి నాలుగు రోజుల ముందు ఇన్వెస్ట్ చేస్తామన్న ప్రొడ్యూసర్లు వెనక్కి తగ్గారు. దాంతో ప్రాజెక్ట్ ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ టైమ్‌లో ఫరియా తల్లి ముందుకొచ్చి, తన పేరుమీద ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ బ్రేక్ చేసి పాట పూర్తి చేయడానికి డబ్బులు ఇచ్చారట. ఆ ఒక్క నిర్ణయంతో ఫరియా ప్రొడ్యూసర్‌గా మారారు. ఈ విషయాన్ని వెరైటీ ఇండియా ఇంటర్వ్యూలో చెబుతూ ఆమె ఎమోషనల్ అయ్యారు.

'జాతి రత్నాలు' ఆఫర్ ఎలా వచ్చిందంటే?

ఫరియాకి అసలు ఇండస్ట్రీలోకి రాకముందే దాదాపు 7 ఏళ్ళ థియేటర్ ఆర్ట్స్ అనుభవం, 10 ఏళ్లకు పైగా డ్యాన్స్ ట్రైనింగ్ ఉంది. ఆమె హోమ్ స్కూలింగ్ ద్వారా 11, 12 తరగతులు పూర్తి చేసి, ఆ తర్వాత హైదరాబాద్ లయోలా కాలేజీలో చదువుకున్నారు.

లయోలా కాలేజీ ఫంక్షన్‌కి నాగ్ అశ్విన్ చీఫ్ గెస్ట్‌గా వచ్చినప్పుడు ఫరియాను చూసి ఆడిషన్స్ ఇవ్వమని అడిగారు. అయితే ఆ టైమ్‌లో పుణె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (FTII)లో ఫిల్మ్ మేకింగ్ కోర్సు కోసం అప్లై చేసిన ఫరియా ఆ ఆఫర్‌ను పక్కన పెట్టారు. అక్కడ రిజెక్ట్ చేయడంతో ఆరు నెలల తర్వాత మళ్లీ నాగ్ అశ్విన్‌ను కలవడం, కె.వి. అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టితో స్క్రీన్ టెస్ట్ ఇవ్వడం, 'జాతి రత్నాలు' ఓకే అవ్వడం వెంటవెంటనే జరిగిపోయాయి.

విజయ్ కొడుకు 'సిగ్మా'తో తమిళంలోకి.. 'జైలర్ 2' పాటంటే చాలా ఇష్టం

ప్రస్తుతం తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్షన్‌లో వస్తున్న 'సిగ్మా' (Sigma) సినిమాలో ఫరియా స్పెషల్ డ్యాన్స్ నంబర్స్ చేశారు. 'ఓలమ్మో వగలాడి' (తెలుగు), 'అయ్యయో అమ్మాడి' (తమిళ్) పాటలు రిలీజ్ కాకముందే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

ఇక రీసెంట్‌గా 'జైలర్ 2' సినిమాలో షామ్నా ఖాసిమ్ చేసిన 'అల బొలేలో' సాంగ్ తనకు చాలా ఇష్టమని, ఆమె కళ్లతోనే అద్భుతంగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారని ఫరియా కొనియాడారు. అవకాశం వస్తే అలాంటి సాంగ్ ఎగ్జిక్యూట్ చేయాలని ఉందనే కోరికను బయటపెట్టారు.

లైనప్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్.. తిరువీర్, సత్యదేవ్ కాంబోల్లో..

ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా చేతిలో చాలా క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. జి. గోపి విహారి డైరెక్షన్‌లో తిరువీర్‌తో కలిసి 'భగవంతుడు' అనే కాస్ట్ బేస్డ్ డ్రామాలో ఒక డిఫరెంట్ రోల్ చేశారు.

దీంతో పాటు యంగ్ హీరో సత్యదేవ్‌తో 'రేంజ్ రోవర్' అనే కొత్త సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. సరైన ప్రాజెక్ట్ కుదిరితే బాలీవుడ్ ఎంట్రీకి కూడా ప్లాన్ చేస్తున్నట్లు ఫరియా చెప్పారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More