Nag Ashwin: నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.. మహాభారతం చదువు.. కల్కి పార్ట్ 2 కోసం వెయిట్ చెయ్..: విమర్శలపై నాగ్ అశ్విన్

Nag Ashwin: కల్కి 2898 ఏడీ వివాదంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించాడు. తనను టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శలపై తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. ముందు మీరు మహాభారతం చదవండంటూ ఓ నెటిజన్ కు క్లాస్ పీకడం విశేషం.

Published on: Jul 13, 2026, 08:40:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Nag Ashwin: సోషల్ మీడియాకు జనరల్‌గా దూరంగా ఉండే టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఎట్టకేలకు 'కల్కి 2898 AD' చుట్టూ జరుగుతున్న ఆన్‌లైన్ వివాదాలపై తన మౌనాన్ని బ్రేక్ చేశారు. ముఖ్యంగా అఖిల్ లేటెస్ట్ యాక్షన్ బ్లాక్ బస్టర్ 'లెనిన్' రిలీజ్ తర్వాత అందులో ప్రమోద్ పంజు యాక్టింగ్‌ని చూసిన నెటిజన్లు.. నాగ్ అశ్విన్‌ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

Nag Ashwin: నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.. మహాభారతం చదువు.. కల్కి పార్ట్ 2 కోసం వెయిట్ చెయ్..: విమర్శలపై నాగ్ అశ్విన్
Nag Ashwin: నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.. మహాభారతం చదువు.. కల్కి పార్ట్ 2 కోసం వెయిట్ చెయ్..: విమర్శలపై నాగ్ అశ్విన్

అసలు వివాదం ఎక్కడ మొదలైంది?

రీసెంట్‌గా జులై 10న వరల్డ్ వైడ్‌గా రిలీజై బాక్సాఫీస్ దగ్గర రూ.37.2 కోట్ల కలెక్షన్స్‌తో దుమ్ముదులుపుతున్న అఖిల్ అక్కినేని 'లెనిన్' మూవీ ఈ మొత్తం వివాదానికి ప్రధాన కారణమైంది. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్‌లో వచ్చిన ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో వసంత్ క్యారెక్టర్‌లో కన్నడ యాక్టర్ ప్రమోద్ పంజు ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్‌ని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో తెగ పొగిడేశాడు.

"సిల్వర్ స్క్రీన్ మీద కర్ణుడి క్యారెక్టర్‌ని ఇలా ప్రెజెంట్ చేయాలి" అంటూ ఆ నెటిజన్ చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. ఇది మెల్లిగా 'కల్కి 2898 AD' సినిమాపై డైరెక్ట్ ఎటాక్‌గా మారిపోయింది. ఈ పాన్ ఇండియా సెన్సేషన్‌లో నాగ్ అశ్విన్ కర్ణుడి క్యారెక్టర్‌ని మరీ గ్లోరిఫై చేశాడని, సినిమా క్లైమాక్స్ అసలు ఒరిజినల్ కథకు పూర్తి విరుద్ధంగా దైవ దూషణ చేసేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి.

మహాభారతంతో నాగ్ అశ్విన్ కౌంటర్

ఈ చర్చ ఆన్‌లైన్‌లో హాట్ టాపిక్ అవ్వడంతో ఫ్యాన్స్, క్రిటిక్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. అయితే ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న నాగ్ అశ్విన్.. వాళ్ల ఆరోపణలను అలా వదిలేయకుండా ఈసారి మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏకంగా ఒరిజినల్ మహాభారతం నుంచే ఆధారాలు తీసుకొచ్చి విమర్శకుల నోరు మూయించారు.

ప్రముఖ రచయిత వివేక్ దేబ్‌రాయ్ (Bibek Debroy) ఇంగ్లీష్ లోకి ట్రాన్స్‌లేట్ చేసిన మహాభారతం పుస్తకంలోని ఒక పేజీని నాగ్ అశ్విన్ షేర్ చేశారు. "ద్రోణ వధ పర్వంలో అర్జునుడితో సాక్షాత్తూ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలివి. దయచేసి మహాభారతం చదవండి. అందులోనూ వివేక్ దేబ్‌రాయ్ వెర్షన్ చదవమని నా సలహా" అంటూ నాగ్ అశ్విన్ ఓపెన్ అయ్యాడు.

'కల్కి పార్ట్ 2' కోసం వెయిట్ చేయండి

అంతేకాదు.. "శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గర కర్ణుడిని ఎన్నిసార్లు పొగిడాడో ఒకసారి గూగుల్ చేసి చూడండి. మన హిస్టరీ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. నేను ఏం చేస్తున్నానో నాకు పక్కాగా తెలుసు. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి" అని నాగ్ అశ్విన్ చాలా కాన్ఫిడెంట్‌గా బదులిచ్చారు.

ఫస్ట్ పార్ట్‌లో ప్రభాస్ ఎలివేషన్ సీన్స్, దానికి సంతోష్ నారాయణన్ ఇచ్చిన బీజీఎం థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. అయితే కర్ణుడి పాత్రలో ఉన్న గ్రే షేడ్స్‌ని డైరెక్టర్ సరిగ్గా చూపించలేదని వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌కు ఈ సింగిల్ పోస్ట్‌తో చెక్ పెట్టాడు నాగ్ అశ్విన్.

ఆయన ఇచ్చిన ఈ రిప్లై ఇప్పుడు ఆన్‌లైన్‌లో మళ్లీ రచ్చ రేపుతోంది. నెటిజన్లు ఆయన వాడిన ప్రతి పదాన్ని డీకోడ్ చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఆయన లాస్ట్‌లో చెప్పిన 'వెయిట్ ఫర్ పార్ట్ 2' అనే మాట.. ఇప్పుడు 'కల్కి 2898 AD' సీక్వెల్‌పై అంచనాలను అమాంతం పెంచేసింది. కర్ణుడి స్టోరీని నెక్స్ట్ పార్ట్‌లో ఎలా డీల్ చేయబోతున్నారో చూడాలని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

లెజెండరీ డైరెక్టర్‌కు సపోర్ట్

ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ తన ఫోకస్ అంతా కేవలం కల్కి పైనే కాకుండా ఇతర ప్రాజెక్ట్స్ పై కూడా పెట్టారు. రీసెంట్‌గా ఆయన లెజెండరీ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేస్తున్న 'సింగ్ గీతం' ప్రాజెక్ట్‌కు తన పూర్తి సపోర్ట్ అందించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More