Prabhas Alia Bhatt: కల్కి 2లో అలియా భట్.. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో ప్రభాస్ కన్ఫమ్ చేసినట్లేనా? ట్రైలర్ అదుర్స్ అంటూ..

Prabhas Alia Bhatt: కల్కి 2 మూవీలో అలియా భట్ నటిస్తున్నట్లు ప్రభాస్ కన్ఫమ్ చేసినట్లేనా? తాజాగా ఆమె నటించిన ఆల్ఫా మూవీ ట్రైలర్ ను మెచ్చుకుంటూ ప్రభాస్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. దీనికి అలియా కూడా థ్యాంక్స్ చెప్పింది.

Published on: Jul 1, 2026, 13:55:54 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Prabhas Alia Bhatt: రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీ 'కల్కి 2898 ఏడీ సీక్వెల్' (Kalki 2898 AD Sequel)లోకి బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న అలియా లేటెస్ట్ మూవీ 'ఆల్ఫా' ట్రైలర్‌పై ప్రభాస్ వేసిన ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఈ రూమర్లకు మరింత బలాన్నిచ్చింది.

Prabhas Alia Bhatt: కల్కి 2లో అలియా భట్.. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో ప్రభాస్ కన్ఫమ్ చేసినట్లేనా? ట్రైలర్ అదుర్స్ అంటూ..
Prabhas Alia Bhatt: కల్కి 2లో అలియా భట్.. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో ప్రభాస్ కన్ఫమ్ చేసినట్లేనా? ట్రైలర్ అదుర్స్ అంటూ..

ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ.. అలియా భట్ సూర్యుడి ట్విస్ట్

అలియా భట్, శర్వరీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న 'ఆల్ఫా' మూవీ జులై 3న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ చూసిన ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మేకర్స్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. "ఆల్ఫా ట్రైలర్ చాలా అమేజింగ్‌గా, ప్రామిసింగ్‌గా ఉంది. జులై 3న రాబోతున్న ఈ సినిమా కోసం అలియా, వైఆర్ఎఫ్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్" అంటూ ప్రభాస్ రాసుకొచ్చాడు.

ఈ స్టోరీని అలియా భట్ రీ-షేర్ చేస్తూ "థ్యాంక్స్.. థ్యాంక్యూ సో మచ్" అని పెట్టి పక్కన ఒక సూర్యుడి ఎమోజీని యాడ్ చేసింది. ఈ సూర్యుడి ఎమోజీని చూసిన కల్కి ఫ్యాన్స్ ఇదంతా కల్కి 2 లోని 'కర్ణుడి' పాత్రకు హింట్ అంటూ క్రేజీగా డీకోడ్ చేయడం స్టార్ట్ చేశారు.

గతంలోనే అలియాపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నిజానికి ప్రభాస్‌కు అలియా భట్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. గతంలో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నప్పుడు దీపికా పదుకోన్ కంటే అలియా భట్ మంచి నటి అంటూ ప్రభాస్ ఓపెన్‌గా చెప్పాడు.

అంతేకాదు తన లైఫ్‌లో ఎప్పటికైనా దీపికా, అలియా ఇద్దరితో కలిసి పని చేయాలని ఉందని తన కోరికను బయటపెట్టాడు. ఇప్పటికే కల్కి ఫస్ట్ పార్ట్‌లో దీపికాతో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రభాస్.. ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం అలియాను లైన్లో పెట్టాడనే టాక్ బాలీవుడ్ మీడియాలో బలంగా వినిపిస్తోంది.

సాయి పల్లవి వర్సెస్ అలియా భట్.. అసలు మేకర్స్ ప్లాన్ ఏంటి?

కల్కి ఫస్ట్ పార్ట్ ఎండింగ్‌లో దీపికా పదుకోన్ క్యారెక్టర్ ఎగ్జిట్ అయిన సంగతి తెలిసిందే. దాంతో కల్కి 2లో ఆమె పాత్ర స్థానంలో వచ్చే 'SUM-80' రోల్ కోసం మేకర్స్ కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు.

కొద్దిరోజుల క్రితం నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పేరు ఈ క్యారెక్టర్ కోసం గట్టిగా వినిపించింది. నాగ్ అశ్విన్ ఆమెను సంప్రదించాడని, షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతుందని వార్తలు వచ్చాయి. కానీ ప్రొడక్షన్ టీమ్ మాత్రం ఇప్పటివరకు ఎవరినీ ఫైనలైజ్ చేయలేదని, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాలని స్పష్టం చేసింది.

మరోవైపు జూన్ నెల మధ్యలో అలియా భట్ కల్కి 2 కోసం కొన్ని సీన్స్ షూట్ చేసిందనే టాక్ నడిచింది. దీనిపై ప్రొడక్షన్ హౌస్ క్లారిటీ ఇస్తూ, ఎలాంటి షూటింగ్ జరగలేదని రూమర్లకు చెక్ పెట్టింది. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్ట్‌ను అందరూ కాపీ పేస్ట్ చేసి న్యూస్ లాగా ప్రెజెంట్ చేశారని, అలియా కాస్టింగ్‌పై ఇప్పటికైతే ఎలాంటి అఫీషియల్ క్లారిటీ లేదని టీమ్ తేల్చి చెప్పింది.

అలియా భట్ 'ఆల్ఫా' స్పై థ్రిల్లర్ విశేషాలు

ప్రస్తుతం అలియా భట్ ఫోకస్ అంతా జులై 3న రాబోతున్న 'ఆల్ఫా' సినిమాపైనే ఉంది. శివ్ రావల్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను ఆదిత్య చోప్రా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.

ఏక్ థా టైగర్, వార్, పఠాన్ లాంటి బ్లాక్‌బస్టర్ల సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ సినిమాలో అలియాతో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒకవేళ 'ఆల్ఫా' ప్రమోషన్స్ పూర్తయ్యాక నాగ్ అశ్విన్ అలియాను కల్కి 2898 ఏడీ సీక్వెల్ ప్రాజెక్ట్‌లోకి తీసుకుంటే మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే అది బిగ్గెస్ట్ కాస్టింగ్ క్రేజ్ కావడం ఖాయం.

ఆల్ఫా ట్రైలర్ ను మెచ్చుకుంటూ ప్రభాస్ చేసిన పోస్టుకు అలియా థ్యాంక్స్
ఆల్ఫా ట్రైలర్ ను మెచ్చుకుంటూ ప్రభాస్ చేసిన పోస్టుకు అలియా థ్యాంక్స్
  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More