Puri Jagannadh: బ్యాంకాక్ హాస్పిటల్‌లో పూరి జగన్నాథ్‌కు వీఐపీ ట్రీట్‌మెంట్.. ఆ ఒక్క ఫొటోతో.. ప్రభాస్ రేంజ్ ఇదీ..
Puri Jagannadh: ప్రభాస్ క్రేజ్ దేశాలు దాటి ఎలా విస్తరించిందో తాజాగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ చెప్పిన ఈ ఒక్క ఘటనతో తేలిపోయింది. ప్రభాస్ తో తాను దిగిన ఒక్క ఫొటో చూపించడంతో బ్యాంకాక్ హాస్పిటల్లో తనకు వీఐపీ ట్రీట్మెంట్ జరిగినట్లు అతడు వెల్లడించాడు.
Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్ బ్యాంకాక్ హాస్పిటల్‌లో కేవలం ప్రభాస్ ఫ్రెండ్ అని చెప్పుకుని వీఐపీ ట్రీట్‌మెంట్ పొందడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నెట్‌ఫ్లిక్స్ రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ డాక్యుమెంటరీలో రెబల్ స్టార్ ప్రభాస్ స్వయంగా ఈ క్రేజీ ఇన్సిడెంట్‌ను బయటపెట్టాడు.

మన టాలీవుడ్ సినిమా రేంజ్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఏ రేంజ్‌కు రీచ్ అయిందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
థాయ్ నర్సును షాక్‌కు గురిచేసిన పూరి జగన్నాథ్ ఫొటో
బాహుబలి ఫస్ట్ పార్ట్ థియేటర్లలో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి గ్లోబల్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ టైంలో రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి 2 షూటింగ్ చాలా సైలెంట్‌గా జరుగుతోంది. సరిగ్గా అదే సమయంలో పూరి జగన్నాథ్ ఒక చిన్న ఇన్ఫెక్షన్ ట్రీట్‌మెంట్ కోసం బ్యాంకాక్‌లోని ఒక ఫేమస్ హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడ వెయిటింగ్ రూమ్‌లో కూర్చుని చికిత్స కోసం వెయిట్ చేస్తున్న పూరిని చూసి అక్కడి నర్స్ "మీరు ఇండియా నుంచా?" అని అడిగింది. పూరి అవునని చెప్పగానే ఆమె ఒక్కసారిగా ఎగ్జైట్ అయిపోయి "బాహుబలి?" అని అడిగింది.
పూరి జగన్నాథ్ ఒక్కసారిగా షాక్ అయి.. "నువ్వు ఆ సినిమా చూశావా?" అని అడిగాడు. దానికి ఆ నర్స్ రెస్పాండ్ అవుతూ తామే కాదు అక్కడి డాక్టర్లతో సహా ప్రతి ఒక్కరూ ఆ సినిమా చూసేశారని, అందరికీ విపరీతంగా నచ్చేసిందని చెప్పింది. దాంతో పూరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ఫోన్‌లో ప్రభాస్‌తో కలిసి దిగిన ఒక పర్సనల్ ఫోటోను ఆ నర్స్‌కు చూపించాడు. తాను ప్రభాస్‌కు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాడు.
డాక్టర్ల వీఐపీ ట్రీట్‌మెంట్
ఆ ఫోటో చూడగానే ఆ థాయ్ నర్స్ ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. వెంటనే ఆ ఫోటోను చీఫ్ డాక్టర్ రూమ్‌కి తీసుకెళ్లి "ఇతను మన బాహుబలికి చాలా క్లోజ్ ఫ్రెండ్" అని చెప్పింది.
ఇంకేముంది.. హాస్పిటల్ స్టాఫ్ అంతా అలర్ట్ అయిపోయి పూరి జగన్నాథ్ వెయిటింగ్ టైమ్‌ను పూర్తిగా క్యాన్సిల్ చేశారు. క్యూ లైన్‌తో సంబంధం లేకుండా అతడిని డైరెక్ట్‌గా స్పెషల్ రూమ్‌కి తీసుకెళ్లి వెంటనే బెస్ట్ వీఐపీ ట్రీట్‌మెంట్ అందించారు.
పూరి వాయిస్ మెసేజ్ విని షాక్ అయిన రాజమౌళి, ప్రభాస్
హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పూర్తవగానే పూరి జగన్నాథ్ ఈ క్రేజీ అనుభవాన్ని ఒక వాయిస్ నోట్ రూపంలో ప్రభాస్‌కు పంపించాడు. ఆ టైంలో ప్రభాస్ మన జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి, ప్రొడ్యూసర్ రమతో కలిసి షూటింగ్ స్పాట్‌లో ఉన్నాడు.
జపాన్ దేశంలో బాహుబలికి విపరీతమైన క్రేజ్ ఉందనే విషయం వాళ్లకు ముందే తెలుసు కానీ.. బ్యాంకాక్ లాంటి సిటీలోని ఒక నార్మల్ హాస్పిటల్ స్టాఫ్‌కు కూడా ఈ సినిమా అంతలా కనెక్ట్ అయిందని తెలిసి ఎంటైర్ టీమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.
బాహుబలి 3 కి హింట్.. ప్రభాస్ నెక్స్ట్ లైన్ అప్ ఇదే
ఈ సరికొత్త నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి ముగ్గురూ ‘బాహుబలి 3’ వచ్చే ఛాన్స్ ఉందంటూ హింట్ ఇవ్వడం ఇప్పుడు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. 2015లో స్టార్ట్ అయిన ఈ ఫ్రాంచైజీ పార్ట్ 2 వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.1788 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
హను రాఘవపూడి డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న హిస్టారికల్ లవ్ స్టోరీ ‘ఫౌజీ’ షూటింగ్‌లో ప్రభాస్ రీసెంట్‌గా జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, ఇమాన్వి లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. దీనితో పాటు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ కూడా లైన్ లో ఉన్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


