Puri Jagannadh: వాళ్లకు తెలివితేటలు తక్కువ.. కానీ మనకంటే ఆనందంగా ఉంటారు.. మనకు ‘నేను’ అనే భావం ఎక్కువైంది: పూరి జగన్నాథ్
Puri Jagannadh: పూరి జగన్నాథ్ తన లేటెస్ట్ పాడ్‌కాస్ట్ లో ట్రైబల్ కల్చర్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వాళ్లకు మనకంటే తెలివి తేటలు తక్కువైనా.. మనకంటే ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పాడు. ఆధునిక సమాజంలో మనం కంటే నేను అనే భావన ఎక్కువైందని విమర్శించాడు.
Puri Jagannadh: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో ఓ పాడ్‌కాస్ట్ మొదలు పెట్టిన విషయం తెలుసు కదా. తాజాగా అందులో గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలపై మాట్లాడుతూ.. దారి తప్పిన ఆధునిక సమాజాన్ని నిలదీసేలా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పూరి మ్యూజింగ్స్: అడవి బిడ్డల అద్భుతమైన జీవితం
డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎప్పుడూ తన మాటలతో సమాజాన్ని ఒక కొత్త కోణంలో చూపిస్తుంటారు. ఈ తాజా వీడియోలో ఆయన గిరిజన సంస్కృతులు (Tribal Cultures), ప్రస్తుతం మనం జీవిస్తున్న ఆధునిక జీవనశైలి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విశ్లేషించారు. ఆయన చెప్పిన విషయాలను బట్టి చూస్తే, మనం నాగరికులం అని చెప్పుకుంటూనే ఎంత అనాగరికంగా బతుకుతున్నామో అర్థమవుతుంది.
ప్రకృతితో అనుబంధం
“వాళ్లకు మనకంటే తెలివి తేటలు, టెక్నాలజీ లేకపోవచ్చు. కానీ వాళ్లు మనకంటే ఎంతో ఆనందంగా ఉంటారు. గిరిజన ప్రజలకు ప్రకృతితో ఒక విడదీయలేని బంధం ఉంటుంది. అడవులు, జంతువులు, మారుతున్న కాలాలను వాళ్ళు చాలా లోతుగా అర్థం చేసుకుంటారు. వాళ్లది పూర్తిగా సస్టైనబుల్ లైఫ్ స్టైల్. అంటే ప్రకృతికి ఏ హానీ చేయకుండా, ప్రకృతి ఇచ్చే దాంతోనే వాళ్ళు సంతృప్తిగా బతుకుతారు. కానీ మనం మాత్రం అడవులను నరికి పాడు చేస్తున్నాం” అని పూరి అన్నారు.
నేను కాదు.. మనం
“ఆధునిక సమాజంలో 'నేను', 'నాది' అనే స్వార్థం పెరిగిపోయింది. దీనివల్ల మనమందరం ఒకరికొకరు సంబంధం లేకుండా ఒంటరి అయిపోతున్నాం. కానీ ట్రైబల్ కల్చర్‌లో 'మనం', 'మన తండా' అనే భావం బలంగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా అందరూ కలిసి ఎదురు నిలబడతారు. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చలాయించాలని వాళ్ళు అస్సలు అనుకోరు" అని పూరి చెప్పారు.
అద్భుతమైన నాలెడ్జ్ సిస్టమ్స్
“మనకు తెలివితేటలు, టెక్నాలజీ ఉండొచ్చు కానీ, అడవిలో దొరికే ఆకులు, ఆయుర్వేదం, వ్యవసాయం మీద వాళ్లకు ఉన్న పట్టు మనకు లేదు. తరతరాలుగా ఈ జ్ఞానం వాళ్లకు మాటల ద్వారా అందుతోంది. వాళ్ళు పండగలు, పాటలు, డ్యాన్సులతో తమ సంస్కృతిని నిజంగా అనుభవిస్తూ బతుకుతారు. మనం మాత్రం మన సంస్కృతి గురించి కేవలం మాట్లాడుకోవడం లేదా గుర్తు తెచ్చుకోవడానికే పరిమితం అవుతున్నాం” అని పూరి అభిప్రాయపడ్డారు.
సంతోషం అంటే ఏంటి?
“మనకు కోరికలు ఎక్కువ.. అందుకే అసంతృప్తి కూడా ఎక్కువే. కానీ గిరిజనులకు కోరికలు చాలా తక్కువ. బతకడానికి కావాల్సిన కనీస అవసరాలు ఉంటే చాలు.. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారు. వాళ్ళు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతారు, మనలాగా రోజంతా అనవసరంగా వాగరు” అని పూరి చెప్పారు.
నిజమైన నాగరికత ఎవరిది?
ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 దేశాల్లో 500 మిలియన్ల మంది గిరిజనులు ఉన్నారని, వీరందరికీ తమదైన భాష, సంస్కృతి ఉన్నాయని పూరి తెలిపారు. ముఖ్యంగా గిరిజన సంస్కృతుల్లో ఆడవాళ్లకు ఎంతో గౌరవం ఉంటుందని, ఆడవాళ్లను తక్కువగా చూసే అలవాటు మనకే ఉంది కానీ వాళ్లకు కాదని తెలిపారు. చదువు, తెలివితేటలు పెరిగిన మనకే క్రిమినల్ ఆలోచనలు వస్తున్నాయి.. కానీ వాళ్ళు ఒకరిని ఒకరు మోసం చేసుకోరు అని కూడా పూరి స్పష్టం చేశారు.
చివరగా పూరి జగన్నాథ్ ఒక గొప్ప సామెతను గుర్తు చేశారు. "మనం ఈ భూమిని మన పూర్వీకుల నుండి వారసత్వంగా పొందలేదు. మన పిల్లల దగ్గర నుండి అప్పుగా తీసుకున్నాం". మన వేర్లు చాలా లోతైనవి, ఈ ఆధునిక రోడ్ల కంటే అవే మనల్ని కాపాడతాయని ఆయన తనదైన శైలిలో ముగించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


