Comedian Ali: పూరి జగన్నాథ్ దగ్గర పని చేసిన మార్క్ కనిపిస్తోంది.. కమెడియన్ అలీ కామెంట్స్
Comedian Speech At Harudu Trailer Launch Event: టాలీవుడ్ హీరో వెంకట్ వెండితెరపై కమ్‌బ్యాక్ ఇస్తోన్న లేటెస్ట్ మూవీ హరుడు. ఇటీవల హరుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన హరుడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కమెడియన్ అలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Comedian Ali Comments On Raj Thalluri: టాలీవుడ్‌లోకి మళ్లీ కమ్‌బ్యాక్ ఇస్తున్న హీరో వెంకట్. శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు వంటి సూపర్ హిట్ సినిమాలతో ఆకట్టుకున్న హీరో వెంకట్ మరోసారి వెండితెరపై అలరించేందుకు రెడీ అయ్యాడు.

హరుడు నటీనటులు
విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో వెంకట్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా హరుడు. మాస్ కమర్శియల్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న హరుడు సినిమాకు పూరి జగన్నాథ్ శిష్యుడు రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వెంకట్‌తోపాటు, శ్రీహరి పైలా,హెబ్బపటేల్, సలోని, నటాషా, అలీ, సుమన్, రవి వర్మ, సుభాశ్రీ , వేద్విక, చాందిని రావు, రవి, షాని, ఆదిత్య, సమేట గాంధీ, దిల్ రమేష్, దొరబాబు కీలక పాత్రలు పోషించారు.
అయితే, ఇప్పటికే విడుదలైన హరుడు గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హరుడు సినిమా మే 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హరుడు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన హరుడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కమెడియన్ అలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
అప్పటి నుంచే మా జర్నీ
అలీ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. వెంకట్‌తో ‘సీతారామ కళ్యాణం’ సినిమా నుంచి పరిచయం ఉంది. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అప్పటి నుంచి మా జర్నీ కొనసాగుతోంది. ఆయన నిర్మించిన ఒక సినిమాలో కూడా నేను నటించాను" అని అన్నారు.
"అన్ని భాషల్లో సినిమాలు చేసిన వెంకట్ ఇప్పుడు ‘హరుడు’తో వస్తున్నారు. ఆయన యాక్షన్ చాలా బాగుంటుంది. రాజ్ తాళ్లూరి గారు పూరి జగన్నాథ్ గారి దగ్గర పని చేశారు. ఆ మార్క్ కనిపిస్తోంది. మే 8న ఈ సినిమా వస్తోంది.టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్" అని కమెడియన్ అలీ చెప్పుకొచ్చాడు.
లవర్ బాయ్‌గా చూశాం
ఇదే ఈవెంట్‌లో నటుడు ప్రవీణ్ మాట్లాడుతూ.. "హరుడు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. వెంకట్ గారిని లవర్ బాయ్‌గా చూశాం. కానీ ఇందులో చాలా డైనమిక్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.
చంద్ర మహేష్ మాట్లాడుతూ.. "ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. రాజ్ గారు పూరి జగన్నాథ్ గారి దగ్గర పని చేసిన మార్క్ కనిపిస్తోంది. వెంకట్ గారు అప్పటికీ ఇప్పటికీ అదే ఎనర్జీతో ఉన్నారు. సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. మే 8న విడుదల అవుతోంది. అందరూ తప్పకుండా థియేటర్లలో చూడాలి" అని ఆకాంక్షించారు.
అద్భుతమైన విజన్‌తో
మ్యూజిక్ డైరెక్టర్ మణి జిన్న మాట్లాడుతూ.. "రాజ్ గారు అద్భుతమైన విజన్‌తో ఈ సినిమా తీశారు. మంచి పాటలు రూపొందించాం. వెంకట్ గారు చాలా సపోర్ట్ చేశారు. మా మ్యూజిక్ టీమ్ అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది" అని పేర్కొన్నారు.
డీఓపీ ఆనంద్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. సినిమా అద్భుతంగా వచ్చింది. రాజు గారు విజువల్‌గా చాలా బాగా తీశారు. సాంగ్స్, యాక్షన్ రెండూ అద్భుతంగా ఉంటాయి. వెంకట్ గారు చాలా డిఫరెంట్‌గా కనిపించబోతున్నారు" అని వెల్లడించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


