Getup Srinu: నాగబాబు కాంబినేషన్లో గెటప్ శ్రీను సిరీస్- మనం కాపులం టైటిల్- నచ్చలేదన్న జాఫర్-చెయిర్ నెట్టేసి రచ్చ- వీడియో
Getup Srinu: బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్లి, తన కామెడీతో నవ్విస్తున్న నటుడు గెటప్ శ్రీను. రీసెంట్ గా రాకాసతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తాజాగా జాఫర్ తో ఇంటర్వ్యూలో గెటప్ శ్రీను రచ్చ వైరల్ గా మారింది.
Getup Srinu: కష్టపడి ఎదిగిన నటుల్లో గెటప్ శ్రీను ఒకడు. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన అతను.. తన కామెడీతో నవ్విస్తున్నాడు. మంచి సక్సెస్ తో సాగిపోతున్నాడు. అయితే తాజాగా జాఫర్ తో ఇంటర్వ్యూలో గెటప్ శ్రీను రచ్చ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాగబాబుతో వెబ్ సిరీస్
గెటప్ శ్రీనును జాఫర్ ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. లాస్ట్ ప్రాజెక్ట్ కూడా మీది బాగా సక్సెస్ అయినట్లు ఉందని శ్రీనును జాఫర్ అడుగుతాడు. ‘‘అవును అన్న, దేవుడి దయ వల్ల లాస్ట్ మూవీ మంచి సక్సెస్ అయింది. నెక్ట్స్ ఏంటీ అంటే? కొత్తగా ఉంటుందని మన నాగబాబుతో వెబ్ సిరీస్ చేస్తున్నాం’’ అని శ్రీను వెల్లడిస్తాడు.
టైటిల్ ఇదే
‘‘నాకు టైటిల్ చెప్పినప్పుడు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. అరె.. భలే డిఫరెంట్ గా ఉంది. భలే క్యాచీగా ఉంది. అదే ‘మేము కాపులం’. టైటిల్ మేము కాపులం’’ అని గెటప్ శ్రీను అనౌన్స్ చేస్తాడు. వెంటనే టైటిల్ పై జాఫర్ అభ్యంతరం వ్యక్తం చేస్తాడు.
చెయిర్ నెట్టేసి
‘‘నాకు నచ్చలేదు శ్రీను. ఈ టైటిల్ వద్దమ్మా’’ అని జాఫర్ అంటాడు. ‘‘కథ చాలా నచ్చింది. క్యారెక్టరైజేషన్ నచ్చింది. టైటిల్ ఇంకా బాగా నచ్చింది’’ అని శ్రీను చెప్తాడు. ‘‘మన సినిమా కోసం కులాన్ని వాడుకోవడం నాకైతే నచ్చలేదు శ్రీను. రామ్ గోపాల్ వర్మ లాంటివాళ్లే అమ్మ రాజ్యం సినిమాలో టైటిల్ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు. కాంట్రవర్సీ కోసం టైటిల్ ఉంచారా’’ అని జాఫర్ అడుగుతాడు.
శ్రీను ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నా జాఫర్ వరుసగా ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. విసుగెత్తిన శ్రీను కోపంతో చెయిర్ నెట్టేసి ‘తొక్కలో ఇంటర్వ్యూ’ అని వెళ్లిపోతాడు.
స్క్రిప్టేనా?
అయితే గెటప్ శ్రీను, జాఫర్ వీడియో క్లిప్ పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా స్క్రిప్ట్ అని, వెబ్ సిరీస్ టైటిల్ రివీల్ చేయడం కోసమే చేశారని కొంతమంది అంటున్నారు. ఇదంతా కామెడీ అని మరికొంతమంది అంటున్నారు. ఈ వీడియో వెనుకాల ఉన్న నిజం తెలియాలంటే గెటప్ శ్రీను లేదా జాఫర్ లో ఎవరో ఒకరు వివరణ ఇవ్వాల్సిందే.
గెటప్ శ్రీను గురించి..
యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన గెటప్ శ్రీను కెరీర్ ను ‘జబర్దస్త్’ షో పుష్ చేసింది. ఈ షోలో డిఫరెంట్ గెటప్స్ తో అతను కామెడీ పండించాడు. దీంతో సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ఖైదీ నంబర్ 150, టచ్ చేసి చూడు, రంగస్థలం, శైలజా రెడ్డి అల్లుడు, మహర్షి, ఇష్మార్ట్ శంకర్, అల్లుడు అదుర్స్, జాంబీరెడ్డి, ఆచార్య, ఎఫ్ 3, లైగర్, వాల్తేరు వీరయ్య, హనుమాన్, డబుల్ ఇష్మార్ట్, మిరాయ్, దేవర, రాకాస తదితర సినిమాలు చేశాడు. హీరోగా రాజు యాదవ్ మూవీలో నటించాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


