OTT: ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన కాంట్రవర్సీ మూవీ.. రెండు నెలల తర్వాత ది కేరళ స్టోరీ 2 స్ట్రీమింగ్ షురూ
OTT: థియేటర్లో రిలీజ్ కు ముందు కాంట్రవర్సీ క్రియేట్ చేసిన ది కేరళ స్టోరీ 2 మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో రిలీజైన ఈ మూవీపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కొంతమంది థియేటర్ల దగ్గరకు వెళ్లి మరీ షోలు అడ్డుకున్నారు.
OTT: ఇటీవల కాలంలో వివాదాలతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సినిమా ‘ది కేరళ స్టోరీ 2’. ఈ మూవీ రిలీజ్ కు ముందే కాంట్రవర్సీ తలెత్తింది. ఇక విడుదల తర్వాత మరింత వివాదాస్పదంగా మారింది. థియేటర్లలో ఈ మూవీ షోలను అడ్డుకున్నారు. హైకోర్టులో కేసు కూడా నడిచింది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

ది కేరళ స్టోరీ 2 ఓటీటీ
సూపర్ హిట్ గా నిలిచిన ‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమానే ‘ది కేరళ స్టోరీ 2’. ఈ కాంట్రవర్శియల్ సినిమా శుక్రవారం (మే 1) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. నేడే ఓటీటీలో అడుగుపెట్టింది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగులోనూ
ఒరిజినల్ గా హిందీలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ 2’ మూవీ తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు తో పాటు మరో మూడు భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. తమిళ్, మలయాళం, కన్నడ భాషల ఆడియన్స్ కూడా ఓటీటీలో ఈ మూవీని చూడొచ్చు.
సీక్వెల్ గా
2023లో వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రం ఫిబ్రవరి 27, 2026న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ డైరెక్టర్. ఈ సినిమాలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా, సుమిత్ తదితరులు నటించారు. థియేట్రికల్ రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం.
పెను వివాదం
‘ది కేరళ స్టోరీ 2’ మూవీపై పెను వివాదం చెలరేగింది. లవ్ జిహాద్, బలవంతపు మత మార్పిడి ప్రధానాంశాలుగా సాగే ఈ సినిమాపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కేరళం రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బ తీసేలా ఈ సినిమా ఉందని అన్నారు. ఎన్నికలకు ముందు కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఈ సినిమాపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
‘ది కేరళ స్టోరీ 2’ మూవీ టీజర్ లో ఓ వ్యక్తితో బలవంతంగా బీఫ్ తినిపించడం చూపించారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా దీనిపై కౌంటర్ వేశాడు. ఈ సినిమా రిలీజ్ పై కేరళం హై కోర్టు ముందు స్టే విధించింది. వెంటనే మేకర్స్ అప్పీల్ చేసుకోగా రిలీజ్ కు ద్విసభ్య ధర్మాసనం అనుమతినిచ్చింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


