Batchmates OTT: కాలేజీ లైఫ్‌లోకి తీసుకెళ్లే ఓటీటీ సిరీస్‌.. ఫుల్ టైమ్‌పాస్‌.. నేటి నుంచే స్ట్రీమింగ్‌.. ఓ లుక్కేయండి

Batchmates OTT: ఓటీటీలోకి ఇవాళ ఓ వెబ్ సిరీస్ వచ్చేసింది. తిరిగి కాలేజీ లైఫ్ లోకి తీసుకెళ్లేలా, ఫుల్ టైమ్ పాస్ చేసేలా ఈ సిరీస్ రిలీజ్ అయింది. ఫన్ అండ్ ఎంటర్ టైన్ కోసం ఈ సిరీస్ పై ఓ లుక్కేయండి. 

Published on: Apr 30, 2026, 09:57:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Batchmates OTT: తెలుగు ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓ క్రేజీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. కాలేజీ లైఫ్ చుట్టూ సాగే స్టోరీ లైన్ తో తెరకెక్కిన ‘బ్యాచ్ మేట్స్’ సిరీస్ ఇవాళ ఓటీటీలో రిలీజైంది. ఈ సిరీస్ తో ఫుల్ టైమ్ పాస్ గ్యారెంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఓటీటీలోకి వెబ్ సిరీస్ (x/JioHotstarTel_)
ఓటీటీలోకి వెబ్ సిరీస్ (x/JioHotstarTel_)

బ్యాచ్ మేట్స్ ఓటీటీ

వారం వారం సిరీస్ లు, సినిమాలు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే గురువారం (ఏప్రిల్ 30) వెబ్ సిరీస్ ‘బ్యాచ్ మేట్స్’ ఓటీటీలో రిలీజైంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఏకంగా అయిదు భాషల్లో ఈ సిరీస్ ను ఓటీటీలోకి తీసుకొచ్చారు.

అయిదు భాషల్లో

బ్యాచ్ మేట్స్ వెబ్ సిరీస్ ఏకంగా అయిదు భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ జియోహాట్‌స్టార్‌ స్పెషల్ మూవీ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజైంది. ప్రస్తుతం నాలుగు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రతి గురువారం ఒక కొత్త ఎపిసోడ్ రిలీజ్ కానుంది.

బ్యాచ్ మేట్స్ స్టోరీ

ఇంజినీరింగ్ చదివే స్టూడెంట్స్ గ్యాంగ్ స్టోరీతో సాగే సిరీస్ బ్యాచ్ మేట్స్. ఇదో కాలేజీ బ్యాక్ డ్రాప్ ఫన్ అండ్ ఎంటర్ టైనింగ్ డ్రామా. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కాలేజీ లైఫ్, సరదాలు, బాధలను ఇందులో చూపించారు. కాలేజీ బంక్ కొట్టి ఫ్రెండ్స్ తో తిరగడం, ప్రొఫెసర్లకు దొరికిపోవడం లాంటివి మనల్ని తిరిగి కాలేజీ లైఫ్ లోకి తీసుకెళ్తాయి.

బ్యాచ్ మేట్స్ వెబ్ సిరీస్ లో బిందు మాధవి, సాయి శ్రీరామ్, సింధు రెడ్డి, ఆంటోనీ కార్తీక్, గీర్వాణి రెడ్డి, శ్రావంతి ఆనంద్, సంతోష్ చింతలపూడి, నిసార్, రవి వర్మ, సాయి కిరణ్ తదితరులు నటించారు. ఈ సిరీస్ కు శ్రీహర్ష శెట్టి డైరెక్టర్.

ట్రెండింగ్

డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలు, సిరీస్ లు, షోలతో జియోహాట్‌స్టార్‌ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో తెలుగులో రియాలిటీ షోలు ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. ట్రెండింగ్ నంబర్ వన్ గా ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’, నంబర్ టూ గా ‘కూకు విత్ జాతిరత్నాలు’ షోలు ఉన్నాయి.

సినిమాల విషయానికి వస్తే ‘తాయ్ కిళవి’, ‘సంభవం అధ్యాయం ఒన్ను’ వరుసగా టాప్ 2లో కొనసాగుతున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More