OTT Telugu: ఓటీటీ లవర్స్‌కు పండగే.. ఒకే రోజు స్ట్రీమింగ్‌కు మూడు తెలుగు సినిమాలు.. హారర్ థ్రిల్లర్ టు కామెడీ
OTT Telugu: తెలుగు ఓటీటీ లవర్స్ గెట్ రెడీ. మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు మూడు తెలుగు సినిమాలు ఒకే రోజు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. ఈ మూడు కూడా దేని కదే డిఫరెంట్ జోనర్లో తెరకెక్కింది.
OTT Telugu: తెలుగు ఓటీటీ ఆడియన్స్ కు డిఫరెంట్ థ్రిల్ అందించేందుకు తెలుగు మూవీస్ వచ్చేస్తున్నాయి. ఒకే రోజు మూడు డిఫరెంట్ జోనర్లలోని తెలుగు చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవే.. రాకాస, బైకర్, సోదరా. ఈ మూడు సినిమాలు మే 1న డిజిటల్ డెబ్యూ చేయబోతున్నాయి. ఇందులో రెండు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో, ఒకటేమో ఆహాలో రిలీజ్ అవుతున్నాయి.

రాకాస ఓటీటీ
రీసెంట్ బ్లాక్ బస్టర్ తెలుగు మూవీ రాకాస. హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన రాకాస ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో సంగీత్ శోభన్, నయన సారిక హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించింది.
బ్రహ్మ రాక్షసుడు
మానస వారణాసి దర్శకత్వంలో వచ్చిన రాకాస మూవీ ఓ బ్రహ్మ రాక్షసుడి కోరే బలి చుట్టూ సాగుతోంది. తన ఫ్రెండ్ స్థానంలో బలిగా కోటలోకి వెళ్లే హీరో ఏం చేశాడన్నది థ్రిల్ అందిస్తుంది. ఈ హారర్ థ్రిల్లర్ లో గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్ తమ కామెడీతో ఎంటర్ టైన్ చేశారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
బైకర్ ఓటీటీ
యంగ్ హీరో శర్వానంద్ రీసెంట్ గా బైకర్ మూవీతో హిట్ అందుకున్నాడు. ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ మూవీగా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా బాగానే ఆడింది. ఇందులో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. సీనియర్ హీరో రాజశేఖర్ ఈ బైకర్ మూవీలో శర్వానంద్ తండ్రిగా కనిపించడం విశేషం.
ఒకప్పుడు రేసరైన తండ్రి తన కొడుకును రేసింగ్ ఛాంపియన్ గా చూడాలనుకుంటాడు. ఆ హీరో ఫస్ట్ రేసింగ్ లో అదరగొడతాడు. కానీ అనుకోకుండా రేసింగ్ వదిలేసి వెళ్లిపోతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నదే బైకర్ స్టోరీ. ఈ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే రిలీజ్ కానుంది.
సోదరా ఓటీటీ
తెలుగు కామెడీ సోదరా కూడా మే 1నే ఓటీటీలోకి రానుంది. సంపూర్ణేశ్ బాబు హీరోగా నటించిన ఈ ఫిల్మ్ ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆహా వీడియో ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
సోదరా సినిమా ఇద్దరు బ్రదర్స్ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కింది. ఈ అన్నదమ్ములు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. ఈ బ్రదర్స్ మధ్య గొడవలు వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందన్నది సోదరా మూవీలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


