Raakaasa: రాకాస 2లో హీరో మార్పు? డైరెక్టర్ మానస శర్మ షాకింగ్ కామెంట్స్.. పక్కనే ఉన్న సంగీత్ శోభన్ రియాక్షన్ వైరల్!
Raakaasa: హారర్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన రాకాస మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను తెగ ఎంటర్ టైన్ చేస్తున్న ఈ ఫిల్మ్ కు సీక్వెల్ కూడా ఉంది. అయితే రాకాస 2లో హీరో విషయంపై డైరెక్టర్ మానస శర్మ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
Raakaasa: చిన్న సినిమాగా వచ్చిన రాకాస.. బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ గా నిలిచింది. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ ఆడియన్స్ ను తెగ ఎంటర్ టైన్ చేస్తోంది. రాకాస సూపర్ హిట్ కావడంతో దీని సీక్వెల్ పై చర్చలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని డైరెక్టర్ మానస శర్మను అడిగితే ఆమె చెప్పిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాకాస 2
రీసెంట్ గా రాకాస మూవీ డిస్ట్రిబ్యూటర్లు సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల, హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ పాల్గొన్నారు. ఈ క్రమంలో రాకాస 2 గురించి మానస శర్మకు విలేకర్ల నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె స్పందిస్తూ.. ‘‘రాకాస 2 కచ్చితంగా ఉంటుంది. స్టోరీ స్ట్రక్చర్ అయితే ఉంది. ఇంకొంచెం దాన్ని డిఫైన్ చేయాలి’’ అని మానస శర్మ తెలిపింది.
హీరో మారతాడా?
రాకాస సినిమాలో సంగీత్ శోభన్ హీరోగా నటించాడు. మరి రాకాస 2లో హీరో మారతాడా? అనే ప్రశ్నకు మానస శర్మ తెలివిగా సమాధానం చెప్పింది. కాలమే నిర్ణయిస్తుందని తెలిపింది. దీంతో పక్కనే ఉన్న సంగీత్ శోభన్, నిహారిక ఆశ్చర్యపోయారు. ఇప్పుడీ వీడియో తెగ వైరల్ గా మారింది. హీరోను కంటిన్యూ చేస్తామని లేదా మారుస్తామని డైరెక్ట్ గా చెప్పకుండా మానస శర్మ షాకింగ్ కామెంట్స్ చేసిందని అంటున్నారు.
రాకాస గురించి
చందమామ కథలాంటి సినిమాను నేటి జనరేషన్ కు తగ్గట్లుగా కామెడీ, హారర్ ఎలిమెంట్స్ యాడ్ చేసి మానస శర్మ తీసిన సినిమానే రాకాస. ఇందులో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నిహారిక కొణిదెల, ఉమేశ్ కుమార్ ఈ రాకాస మూవీని నిర్మించారు.
బ్లాక్ బస్టర్
హారర్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన రాకాస బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏప్రిల్ 3న గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.19 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలిసింది. ఈ సినిమాను రూ.15 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు సమాచారం. రాకాస మూవీలో గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్ తో కలిసి సంగీత్ శోభన్ చేసిన కామెడీ అదిరిపోయింది.
రాకాస స్టోరీ
ఓ ఊరిలోని కోటలో బ్రహ్మ రాక్షసుడు ఉంటాడు. అతను బలి కోరినప్పుడల్లా గ్రామం నుంచి ఒక మనిషిని పంపించాలి. ఓ సారి తన ఫ్రెండ్ కు బదులుగా హీరో ఆ కోటలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఏం జరిగింది? ఆ రాక్షసుడి కథ ఏంటీ? అన్నది రాకాస సినిమాలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


