Sangeeth Shobhan: ఆయన సినిమాల్ని ఢీ కొట్టలేం గానీ ప్రమోషన్స్‌ను ఢీ కొట్టాలనుకున్నాం.. హీరో సంగీత్ శోభన్ కామెంట్స్

Sangeeth Shobhan Speech Raakaasa Success Meet: సంగీత్ శోభన్ సోలో హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రాకాస ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రాకాస సమ్లర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సంగీత్ శోభన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: Apr 8, 2026, 09:13:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్‌లో యంగ్ హీరోగా ఇప్పుడిప్పుడే మంచి సక్సెస్ అందుకుంటున్నాడు సంగీత్ శోభన్. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో అలరించిన సంగీత్ శోభన్ సోలో హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ రాకాస. హారర్ ఫాంటసీ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించారు.

ఆయన సినిమాల్ని ఢీ కొట్టలేం గానీ ప్రమోషన్స్‌ను ఢీ కొట్టాలనుకున్నాం.. హీరో సంగీత్ శోభన్ కామెంట్స్
ఆయన సినిమాల్ని ఢీ కొట్టలేం గానీ ప్రమోషన్స్‌ను ఢీ కొట్టాలనుకున్నాం.. హీరో సంగీత్ శోభన్ కామెంట్స్

రాకాస సమ్మర్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్

నిహారిక కొణిదెల నిర్మించిన రాకాసలో హీరోయిన్‌గా నయన్ సారిక అలరించింది. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైన రాకాస సినిమా మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రాకాస సమ్మర్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మానస శర్మ, హీరో సంగీత్ శోభన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మొదటి ఫీచర్ ఫిల్మ్

మానస శర్మ మాట్లాడుతూ .. "‘రాకాస’ నాకు మొదటి ఫీచర్ ఫిల్మ్. థియేటర్‌లో ఆడియెన్స్‌తో కలిసి ఈ మూవీని చూశాను. నేను ఏదైతే రాసుకున్నానో.. ఏదైతో అనుకున్నానో.. ఆ సీన్లను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. నా నిర్మాతలు నిహారిక, జీ స్టూడియో, డిస్ట్రిబ్యూటర్లు సినిమా పట్ల, రిజల్ట్ పట్ల సంతృప్తిగా ఉన్నారు" అని తెలిపారు.

సర్‌ప్రైజింగ్‌గా ఉంచాలనుకున్నాం

"వెన్నెల కిషోర్ గారి పాత్రను సర్‌ప్రైజింగ్‌గా ఉంచాలని అనుకున్నాం. ఆ పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరూ అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. గెటప్ శ్రీను గారు మాకెంతో సపోర్ట్ చేశారు. ఈ జర్నీలో నాకు సపోర్ట్ ఇచ్చిన అన్వర్ గారు, అనుదీప్ గారు, విష్ణు గారు, మురళీ గారు, రాజు గార్లకు థాంక్స్. మా చిత్రానికి సపోర్ట్ ఇచ్చిన మీడియాకి థాంక్స్" అని డైరెక్టర్ మానస శర్మ చెప్పారు.

సంగీత్ శోభన్ కామెంట్స్

హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ .. "అనిల్ రావిపూడి గారి సినిమాల్ని ఢీ కొట్టలేం గానీ.. ఆయన ప్రమోషన్స్‌ని ఢీ కొట్టాలని మేం అనుకున్నాం. మూవీని వీలైనంత వరకు ఆడియెన్స్ వరకు రీచ్ చేయగలగాలి. వెన్నెల కిషోర్ గారి పాత్రను సర్‌ప్రైజ్‌గా ఇంట్రడ్యూస్ చేయాలని ముందు నుంచీ అనుకున్నాం. ఆయన ఎంట్రీకి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది" అని అన్నాడు.

మహిళలు తరలి వచ్చి

"ఈ జర్నీలో సపోర్ట్‌గా నిలిచిన నిహారిక గారు, మానస శర్మ గారికి థాంక్స్. మా చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఈ ఈవెంట్‌ను పెట్టాం. మహిళలు తరలి వచ్చి మా సినిమాని చూస్తున్నారంటే మా కంటెంట్ వారికి నచ్చిందని భావిస్తున్నాం. మా మూవీని ఇంతలా సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్" అని చెప్పుకొచ్చాడు సంగీత్ శోభన్.

సంక్రాంతి సీజన్ వచ్చినట్లు

ఇదే ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ మాట్లాడుతూ .. "‘రాకాస’కి ఏడాది పాటు కష్టపడ్డాం. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకి వస్తుంటే మళ్లీ సంక్రాంతి సీజన్ వచ్చినట్టు అనిపించింది" అని అభివర్ణించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More