Gunde Ninda Gudi Gantalu Balu Meena 80's Look: స్టార్ మా ప్రైమ్ టైమ్ బ్యాండ్‌ను షేక్ చేస్తున్న పాపులర్ సీరియల్ 'గుండె నిండా గుడి గంటలు' బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతిరోజూ సరికొత్త ట్విస్టులు, ఎమోషనల్ డ్రామాతో సాగే ఈ సీరియల్‌లో ప్రధాన పాత్రలైన బాలు, మీనా జోడీకి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా ఈ క్రేజీ కపుల్ 80ల నాటి క్లాసిక్ రెట్రో అవతారంలో మెరిసి అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు.

మేకర్స్ రీసెంట్‌గా రిలీజ్ చేసిన ప్రత్యేక ఫొటోలో బాలు, మీనా డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించారు. 80ల కాలం నాటి వింటేజ్ ఫ్యాషన్, హెయిర్ స్టైల్, క్లాసిక్ అవుట్‌ఫిట్స్‌లో వీరిద్దరి లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
80ల నాటి క్లాసిక్ వైబ్స్.. బాలు, మీనా మేక్‌ఓవర్
ప్రస్తుతం చాట్‌జీపీటీ 80's లుక్ ప్రాంప్ట్ వైరల్ అవుతున్న విషయం తెలుసు కదా. సెలబ్రిటీల నుంచి కామన్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరూ తమను తాము 1980లలోకి తీసుకెళ్లి తాము ఎలా ఉంటామో చూసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు స్టార్ మా ఛానెల్ కూడా తమ సూపర్ హిట్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు నుంచి బాలు, మీనా జోడీకి ఈ స్పెషల్ రెట్రో లుక్ సెట్ చేసి తమ ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది.
‘మన బాలు, మీనాల 80ల నాటి లుక్ మీకు నచ్చిందా.. గుండె నిండా గుడి గంటలు సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ రాత్రి 9 గంటలకు’ అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ 80ల నాటి లుక్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. బెల్ బాటమ్ ప్యాంట్స్, రెడ్ షర్ట్, దానిపై డెనిమ్ జాకెట్, రెట్రో హెయిర్‌స్టైల్‌తో బాలు మాస్ అండ్ క్లాసిక్ కాంబినేషన్‌లా కనిపిస్తుంటే, మీనా తన సహజసిద్ధమైన రెడ్ పోల్కా డాట్స్ ఉన్న చీర కట్టులో, పాతకాలపు హెయిర్ డూతో పర్‌ఫెక్ట్ 80స్ హీరోయిన్‌ను తలపిస్తోంది.
టీఆర్‌పీ చార్ట్స్‌లో టాప్ గేర్.. రికార్డు రేటింగ్స్
రాత్రి 9 గంటల స్లాట్‌లో ప్రసారమయ్యే 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ వరుసగా బెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్ సాధిస్తూ దూసుకుపోతోంది. ముగ్గురు అన్నదమ్ములు, పెద్ద కొడుకును మాత్రమే ఇష్టపడే తల్లి, ఇంటిని మోసం చేసే పెద్ద కోడలు, వాళ్ల మధ్య వచ్చే గొడవలు, పంతాలు, పట్టింపుల చుట్టూ సాగే సీరియల్ ఇది. దీనికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా బాలు, మీనా పాత్రలు తెలుగు ఇళ్లలోకి బాగా చేరాయి. ఈ హిట్ పెయిర్ సీరియల్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
{{/usCountry}}రాత్రి 9 గంటల స్లాట్‌లో ప్రసారమయ్యే 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ వరుసగా బెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్ సాధిస్తూ దూసుకుపోతోంది. ముగ్గురు అన్నదమ్ములు, పెద్ద కొడుకును మాత్రమే ఇష్టపడే తల్లి, ఇంటిని మోసం చేసే పెద్ద కోడలు, వాళ్ల మధ్య వచ్చే గొడవలు, పంతాలు, పట్టింపుల చుట్టూ సాగే సీరియల్ ఇది. దీనికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా బాలు, మీనా పాత్రలు తెలుగు ఇళ్లలోకి బాగా చేరాయి. ఈ హిట్ పెయిర్ సీరియల్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
{{/usCountry}}