Gunde Ninda Gudi Gantalu Promo: రోహిణి దొంగతనం మీనా మెడకు.. ఇంట్లో ప్రభావతి రచ్చ.. కట్టలు తెంచుకున్న సత్యం ఆవేశం

Gunde Ninda Gudi Gantalu Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 8 ఎపిసోడ్ ప్రోమోలో మీనాపై ప్రభావతి దొంగతనం ముద్ర వేస్తుంది. రోహిణి చేసిన దొంగతనం మీనాకు చుట్టుకుంటుంది. అది విని సత్యం ఆవేశం కట్టలు తెంచుకుంటుంది.

Published on: Apr 8, 2026, 18:42:43 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ప్రోమోలో మీనాను వేధించడానికి ప్రభావతికి మరో అవకాశం దొరుకుతుంది. రోహిణి చేసిన దొంగతనం కాస్తా అనుకోకుండా మీనా మెడకు చుట్టుకుంటుంది. కామాక్షి ఇంటికి వెళ్లి అక్కడ కిచెన్ లో కాఫీ పెట్టడమే మీనా చేసిన నేరమవుతుంది.

Gunde Ninda Gudi Gantalu Promo: రోహిణి దొంగతనం మీనా మెడకు.. ఇంట్లో ప్రభావతి రచ్చ.. కట్టలు తెంచుకున్న సత్యం ఆవేశం
Gunde Ninda Gudi Gantalu Promo: రోహిణి దొంగతనం మీనా మెడకు.. ఇంట్లో ప్రభావతి రచ్చ.. కట్టలు తెంచుకున్న సత్యం ఆవేశం

కామాక్షి ఇంటికి మీనా

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో కామాక్షి ఇంటికి మీనా పూలు తీసుకొస్తుంది. అప్పటికే ప్రభావతి అక్కడ ఉంటుంది. దీంతో ఇద్దరికీ తాను కాఫీ పెడతానని ఆమె చెప్పి కిచెన్ లోకి వెళ్తుంది.

ప్రభావతి.. రూ.45 వేల విలువైన చీర

అప్పుడే ప్రభావతి దగ్గరికి ఆమె స్టూడెంట్ తల్లి తాను చీరల వ్యాపారం చేస్తానంటూ వస్తుంది. కామాక్షి, ప్రభావతికి కొన్ని చీరలు చూపిస్తుంది. అందులో ఒక చీర ఆమెకు బాగా నచ్చుతుంది. దాని ధర రూ.45 వేలు అని చెప్పడంతో ప్రభావతి షాక్ తింటుంది. రేటు చెప్పగానే మాట రావడం లేదని ఆమె దెప్పి పొడవడంతో కిచెన్ లో రూ.45 వేలు తీసుకురావాలని కామాక్షికి ప్రభావతి చెబుతుంది.

కామాక్షి షాక్.. కనిపించని డబ్బు

కిచెన్ లోకి వెళ్లి తాను పెట్టిన డబ్బాలో డబ్బు కోసం వెతికిన కామాక్షికి షాక్ తగులుతుంది. అందులో డబ్బు కనిపించదు. అంతకుముందే విద్య ద్వారా ఆ రూ.2 లక్షలను రోహిణి దొంగతనం చేయించిన విషయం తెలిసిందే. ఆ డబ్బు కనిపించకపోవడంతో ప్రభావతి కూడా కంగారు పడుతుంది.

మీనాపై దొంగతనం ముద్ర

దీంతో అంతకుముందు కిచెన్ లోకి వెళ్లిన మీనానే ఆ డబ్బు దొంగతనం చేసిందని ప్రభావతి నమ్ముతుంది. ఇంటికి వెళ్లిన తర్వాత రచ్చ చేస్తుంది. ఆ రూ.2 లక్షలు ఏం చేశావ్.. నీ తమ్ముడికి ఇచ్చావా.. ఎక్కడ పెట్టావ్ అంటూ నిలదీస్తుంది. ఆమెను కొట్టడానికి ప్రయత్నించగా సత్యం అడ్డుకుంటాడు. కోడలిపై చేయి పడితే మన ఇద్దరి మధ్య ఈ రోజు పెద్ద యుద్ధమే జరుగుతుంది అని ప్రభావతితో సత్యం అంటాడు. ఆ దొంగతనం ఎవరు చేశారో బాలు వచ్చిన తర్వాత తెలుస్తుందని సత్యం చెబుతాడు. అక్కడితో ప్రోమో ముగుస్తుంది.

మొత్తానికి రోహిణి చేసిన దొంగతనం అలా మీనా మెడకు చుట్టుకుంటుంది. తనకు అస్సలు నచ్చని కోడలిని సాధించడానికి ప్రభావతికి మరో అవకాశం దొరుకుతుంది. మరి దీన్నుంచి మీనా ఎలా బయటపడుతుంది? రోహిణి చేసిన పని బయటపడుతుందా? అన్నది చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More