Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు మీనాను చంపేస్తానన్న శ్రీముఖి.. బాలు తనకు కావాలంటూ సత్యం కాళ్లపై పడి..

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు సీరియల్ బాలుపై మనసు పారేసుకుంది శ్రీముఖి. అతని కోసం మీనాను చంపడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా వచ్చిన ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోమోలో శ్రీముఖి.. చంద్రముఖిలా మారిపోవడం చూడొచ్చు.

Published on: Apr 18, 2026, 08:09:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు సీరియల్ తో ప్రతి తెలుగు ఇంటికి బాలు, మీనా పేర్లతో దగ్గరైన జోడీ విష్ణుకాంత్, అమూల్య గౌడ. అయితే ఈ సీరియల్లో బాలు పాత్రపై యాంకర్ శ్రీముఖి మనసు పారేసుకుంది. ఈ మధ్య బాలు ఎక్కడ కనిపించినా తన ప్రేమను పబ్లిగ్గానే కురిపించేస్తోంది. అంతేకాదు అతని తండ్రి పాత్ర అయిన సత్యం కాళ్లపై కూడా పడింది.

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు మీనాను చంపేస్తానన్న శ్రీముఖి.. బాలు తనకు కావాలంటూ సత్యం కాళ్లపై పడి..
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు మీనాను చంపేస్తానన్న శ్రీముఖి.. బాలు తనకు కావాలంటూ సత్యం కాళ్లపై పడి..

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోమో

స్టార్ మా ఛానెల్లో ప్రతి సండే వచ్చే ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోగ్రామ్ తెలుసు కదా. తాజాగా కొత్త ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. ఇందులో గుండె నిండా గుడి గంటలు సీరియల్లో సత్యం పాత్ర పోషిస్తున్న శ్రీకాంత్ హెబ్లిగర్ స్టైల్ గా సూటు, బూటు వేసుకొని వచ్చాడు. తన డ్యాన్స్ తో ఇరగదీశాడు. కమెడియన్ అవినాష్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశాడు.

మామయ్య అంటూ శ్రీముఖి

అతన్ని చూడగానే మామయ్య అంటూ శ్రీముఖి మెలికలు తిరిగిపోయింది. వెంటనే అతనికి ఓ పువ్వు ఇచ్చి కాళ్లపై పడుతుంది. అతడు దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదిస్తాడు. బాలు సుమంగళీ భవ అని ఆశీర్వదించమని శ్రీముఖి అడుగుతుంది. తనకు బాలు కావాలని అడుగుతుంది. మరి మీనా అక్కడే ఉంది కదా అని అంటే.. మీనాను చంపేస్తానని అంటుంది.

తనకు ఏ అభ్యంతరం లేదని సత్యం అనడంతో ఐలవ్యూ మామయ్య అని శ్రీముఖి అంటుంది. అప్పటికే ఈ సీరియల్లో అత్త ప్రభావతి పాత్ర పోషిస్తున్న అనిలా శ్రీకుమార్ కూడా అక్కడే ఉంటుంది. వాళ్లిద్దరితో కలిసి శ్రీముఖి ఫ్యామిలీ ఫొటో అంటూ కెమెరాకు పోజులిస్తుంది. ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

బాలుపై మనసు పారేసుకున్న శ్రీముఖి

ప్రస్తుతం ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో సక్సెస్ పార్టీ జరుగుతోంది. కొన్నాళ్ల కిందట స్టార్ మాలో బెస్ట్ షోస్, సీరియల్స్ కు అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీమ్ కు కూడా చాలానే అవార్డులు వచ్చాయి.

ఇప్పటికే బాలు కూడా తన అవార్డుతో ఈ షోకి వచ్చాడు. అతడు వచ్చినప్పుడు కూడా శ్రీముఖి ఇలాగే సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది. అతనితో కలిసి సెల్ఫీలు దిగింది. తాజాగా సత్యం, ప్రభావతితో కలిసి చేసిన సందడి కూడా మామూలుగా లేదు. ఈ తాజా ఎపిసోడ్ ఈ ఆదివారం (ఏప్రిల్ 19) ఉదయం 11 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More