Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనాను కిడ్నాప్ చేయించిన రోహిణి.. ఆడదానివేనా అంటూ తల్లిపై బాలు వీరంగం..

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 10 ఎపిసోడ్ లో మీనాను దినేష్ కిడ్నాప్ చేస్తాడు. ఇటు ఇంట్లో తల్లి ప్రభావతిపై నువ్వు ఆడదానివేనా అంటూ బాలు ఊగిపోతాడు. మనోజ్, రోహిణిలకూ క్లాస్ పీకుతాడు.

Published on: Apr 10, 2026, 17:59:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రోహిణికి సాయం చేయడంతోపాటు తమ పగ తీర్చుకోవడానికి మీనాను దినేష్, గుణ కిడ్నాప్ చేస్తారు. ఇటు మీనాపై దొంగతనం ముద్ర వేసిన తల్లి ప్రభావతిపై బాలు విరుచుకుపడతాడు.

Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనాను కిడ్నాప్ చేయించిన రోహిణి.. ఆడదానివేనా అంటూ తల్లిపై బాలు వీరంగం..
Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనాను కిడ్నాప్ చేయించిన రోహిణి.. ఆడదానివేనా అంటూ తల్లిపై బాలు వీరంగం..

దినేష్‌తో కలిసి గుణ ప్లాన్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (ఏప్రిల్ 10) ఎపిసోడ్ గుణని రోహిణి సాయం అడిగే సీన్ తో మొదలవుతుంది. దీంతో దినేష్ తో కలిసి గుణ ప్లాన్ చేస్తాడు. తనపై అనుమానం రాకుండా మీనాను కిడ్నాప్ చేయాలని దినేష్ కు చెబుతాడు. గుణ ప్లాన్ చెప్పడంతో దినేష్ దానిని అమలు చేయడానికి రెడీ అవుతాడు.

మీనాను కిడ్నాప్ చేసిన దినేష్

ఇంట్లోనే ఫోన్ వదిలేసి పూలు ఇవ్వడానికి మీనా బయలుదేరుతుంది. దారిలో ముసుగు వేసుకున్న దినేష్, మరో ఇద్దరితో కలిసి కారులో వచ్చి మీనాను కిడ్నాప్ చేస్తాడు. ఒకప్పుడు మీనా, బాలు ద్వారా సాయం పొందిన అవ్వ, తాత అది చూసి వాళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్లు మాత్రం మీనాను తీసుకెళ్లిపోతారు.

మీనా కోసం మనోజ్, రవి గొడవ.. సత్యం ఆవేశం

ఇటు ఇంట్లో మీనా కనిపించకపోవడంతో రవి, శృతి కంగారు పడుతుంటే.. ఏ ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్లిందంటూ మనోజ్ ఎగతాళి చేస్తాడు. దీంతో మనోజ్ పై రవి విరుచుకుపడతాడు. నోరు జాగ్రత్త అంటూ శృతి కూడా అతనికి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే సత్యం కూడా వచ్చి మనోజ్ కాలర్ పట్టుకొని అతన్ని తిడతాడు. అటు ప్రభావతికి కూడా క్లాస్ పీకుతాడు.

తల్లిపై బాలు వీరంగం.. ఆడదానివేనా అంటూ..

వాళ్ల గొడవ జరుగుతుండగానే బాలు ఇంటికి వస్తాడు. మీనా కనిపించకపోవడంతో ఎక్కడికైనా వెళ్లిందా లేక ఈమెనే పంపించిందా అని తల్లిని ఉద్దేశించి అంటాడు. దీంతో కామాక్షి ఇంట్లో మీనా దొంగతనం చేసిందని ప్రభావతి అంటుంది. అది విని బాలు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది.

నోర్ముయ్.. నా భార్యను ఏమైనా అంటే కన్నతల్లివి అని కూడా చూడను.. నువ్వు అసలు ఆడదానివేనా.. మనిషివేనా.. మీనాలాంటి మనిషిపై దొంగతనం నేరం మోపుతావా అని బాలు అంటాడు. ఆమె రక్తంలోనే అది ఉంది అని ప్రభావతి అంటే.. మరి నీ రక్తంలో ఏముంది.. నీ పెద్ద కొడుకు రక్తంలో ఏముంది అంటూ వాళ్ల దొంగతనాల చిట్టా విప్పుతాడు బాలు. ప్రస్తుతానికైతే మీనాను వెతకడానికి వెళ్తున్నాను.. ఆమె వచ్చిన తర్వాత మీ పని చెబుతానంటూ బాలు వెళ్లిపోతాడు.

మీనా కోసం బాలు వేట

మీనా కోసం బాలు వేట మొదలుపెడతాడు. తెలిసిన చోట్లు వెతుకుతాడు. ఆమె ఫొటో చూయించి ఎవరెవరినో అడుగుతాడు. సుమతికి కూడా ఫోన్ చేస్తాడు. అక్కడికి కూడా రాలేదని తెలుసుకొని మరింత కంగారు పడతాడు. రాజేష్ కు ఫోన్ చేయడంతో అతడు కూడా వచ్చి మీనా కోసం వెతుకుతాడు.

గుణనే కిడ్నాప్ చేయించాడన్న మీనా

ఇటు మీనాను ఓ చోటికి తీసుకెళ్లి కట్టేస్తారు. తనను వదలకపోతే మీ అంతు చూస్తాను.. నా భర్తకు తెలిస్తే మిమ్మల్ని వదిలిపెట్టడు అని వార్నింగ్ ఇస్తుంది. దినేష్ ముసుగు వేసుకొని రావడంతో అతన్ని గుర్తు పట్టదు. అయితే గుణనే మీతో ఈ పని చేస్తున్నాడా అని అనుమానిస్తుంది. వాడెవడో తనకు తెలియదని దినేష్ అంటాడు. తాను ఎక్కడున్నానో మీనాకు తెలియదు. అయితే పక్కనే గుడి ఉన్నట్లుగా గంటల చప్పుడుతో గుర్తు పడుతుంది.

రోహిణిని తిట్టిన విద్య

మరోవైపు రోహిణి .. విద్య దగ్గరికి వెళ్తుంది. గుణకు ఫోన్ చేస్తుంది. మీనా తన దగ్గరే ఉందని, నీకే ప్రమాదం లేదని అతడు చెప్పడంతో ఆమె ఊపిరి పీల్చుకుంటుంది. దీంతో విద్య తన ఫ్రెండ్ ను తిడుతుంది. తోటి కోడలు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నవ్వుతావా అని నిలదీస్తుంది. పాపం మీనా అని అంటుంది. తానేమీ మీనాకు ఫ్రెండ్ కాదు కదా.. తన వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాను.. ఆమె పడితే తప్పేమీ లేదులే అని రోహిణి అంటుంది.

బాలుకు ఫోన్ చేసిన ఆడుకున్న గుణ

మీనా కోసం వెతుకుతున్న బాలుతో ఆడుకోవాలని గుణ అనుకుంటాడు. తన దగ్గర ఉన్న దొంగ ఫోన్ నంబర్ నుంచి బాలుకి ఫోన్ చేస్తాడు. మీనాను ఎవరో కిడ్నాప్ చేశారని చెబుతాడు. అయితే కావాలని బాలుకి తప్పుడు అడ్రెస్ ఇచ్చి ఊరంతా తిప్పుతాడు. చివరికి దినేష్ కూడా బాలుతో మాట్లాడి.. మీనా తన దగ్గరే ఉందని అంటాడు. బాలుకి మాత్రం గుణపై అనుమానం వచ్చి అతడు ఉన్న చోటికి వెళ్లి చూస్తాడు. కానీ మీనా అక్కడా కనిపించదు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More