Gunde Ninda Gudi Gantalu Today Episode: ప్రభావతికి ప్రాణగండం.. విరిగి పడిన ఫ్యాన్.. కరెంట్ షాక్.. మనోజ్‌ వేపాకుల పరిహారం

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 20 ఎపిసోడ్ లో ప్రభావతికి ప్రాణగండం, మనోజ్ రోడ్డున పడే ప్రమాదం ఉన్నట్లు తేలుతుంది. అయితే దీనికి స్వామీజీ చెప్పిన పరిహారంతో ఇంటికి వస్తాడు మనోజ్.

Published on: Apr 20, 2026, 08:11:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ప్రభావతి రెండుసార్లు ప్రాణగండం నుంచి బయటపడుతుంది. ఒకసారి మీనా ఆమెను కాపాడుతుంది. మొదట మనోజ్ చెప్పిన పరిహారానికి అంగీకరించని ఆమె.. తర్వాత సరే అనే పరిస్థితి కలుగుతుంది.

Gunde Ninda Gudi Gantalu Today Episode: ప్రభావతికి ప్రాణగండం.. విరిగి పడిన ఫ్యాన్.. కరెంట్ షాక్.. మనోజ్‌ వేపాకుల పరిహారం
Gunde Ninda Gudi Gantalu Today Episode: ప్రభావతికి ప్రాణగండం.. విరిగి పడిన ఫ్యాన్.. కరెంట్ షాక్.. మనోజ్‌ వేపాకుల పరిహారం

తల్లికి అపాయం, బాలుకి లాభాలంటూ స్వామీజీ వార్నింగ్

గుండె నిండా గుడి గంటలు సోమవారం (ఏప్రిల్ 20) ఎపిసోడ్ మనోజ్, రోహిణిలకు స్వామీజీ ఇచ్చే వార్నింగ్ తో మొదలవుతుంది. ఈ గుడ్డు వల్ల నీకు ఎన్నో సమస్యలు రాబోతున్నాయి.. రోడ్డుపై పడతావని మనోజ్ ను హెచ్చరిస్తాడు. దీంతో అతడు భయపడిపోతాడు.

నీకు ఇష్టమైన వాళ్లు ఎవరు అని అడిగితే తల్లి పేరు చెబుతాడు. అయితే నీతోపాటు ఆమెకూ గండం ఉందని అంటాడు. ఇక ఇష్టం లేని వాళ్ల గురించి అడిగినప్పుడు బాలు పేరు చెబుతాడు. అతనికి ఇక నుంచి అన్నీ లాభాలే అని అంటాడు.

మనోజ్‌కు పరిహారం చెప్పిన స్వామీజీ

మనోజ్ కు అది మరింత కోపం తెప్పిస్తుంది. తనకు, తన తల్లికి కష్టాలు, బాలుకి లాభాలు అనడంతో మనోజ్ ఉడుక్కుంటాడు. దీనికి పరిహారం ఏంటి అని అడుగుతాడు. ఒక రోజంతా ఉపవాసం ఉండాలి.. ఒంటికి కేవలం వేపాకులు చుట్టుకొని, చేతిలో దీపం పట్టుకొని గుడి చుట్టూ మూడుసార్లు తిరగాలి అని స్వామీజీ చెబుతాడు.

నీతోపాటు మీ అమ్మగారు కూడా చేయాలంటాడు. ఆమె మాత్రం పసుపు చీర కట్టుకొని తిరగొచ్చని అంటాడు. రోజంతా ఉపవాసం అంటే భయపడినా.. తప్పక సరే అంటాడు మనోజ్.

తల్లికి పరిహారం ఏంటో చెప్పిన మనోజ్.. మండిపడ్డ ప్రభావతి

ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతిని గదిలోకి తీసుకెళ్లి జరిగింది చెబుతాడు. షాపు ముందు ఎవరో గుడ్డు పెట్టారని, దాని గురించి స్వామీజీని అడిగితే ఇలా చెప్పాడని అంటాడు. అంతవరకూ మనోజ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన ప్రభావతి.. తర్వాత అతన్ని అసహ్యించుకుంటుంది.

నువ్వంటే అస్సలు ఇష్టం లేదని, ఇలాంటి పరిహారాలు తన వల్ల కాదని, నీకు ఎవరు ఇష్టమంటే నీ భార్య పేరు చెప్పి ఉండొచ్చు కదా అని ప్రభావతి అంటుంది. చివరికి మనోజ్ కాళ్లు పట్టుకున్నా సరే ఆమె కనికరించదు. ప్రసక్తే లేదని వెళ్లిపోతుంది.

ఫ్యాన్ విరిగి పడినా వెనక్కి తగ్గని ప్రభావతి

అలా అని ప్రభావతి కిందికి రాగానే హాల్లో ఫ్యాన్ విరిగి పడుతుంది. తృటిలో ప్రభావతి తప్పించుకుంటుంది. అది చూసి ఆమె కళ్లు తిరిగి పడిపోతుంది. మనోజ్, రోహిణి వచ్చి లేపుతారు. తాను చెప్పినా వినలేదు కదా.. ఇప్పుడు చూడు నీకు గండాలు నిజమే అని మనోజ్ అంటాడు. అయినా సరే తాను మాత్రం పరిహారం చేయడానికి సిద్ధంగా లేనని తేల్చి చెబుతుంది.

పని చేయని మోటర్.. బిందెలు ఇచ్చిన మీనా

మరోవైపు ఇంట్లో నీళ్లు రావడం లేదని బాలుకి మీనా చెబుతుంది. ఆ తర్వాత మనోజ్, రోహిణి, రవి, శృతి కూడా అదే చెబుతారు. బాలు వెళ్లి చూసొచ్చి మోటర్ పని చేయడం లేదంటాడు. మెకానిక్ కు ఫోన్ చేస్తే టైమ్ పడుతుందంటాడు. మరి ఇప్పుడెలా అని మనోజ్ అంటే ఎవరి నీళ్లు వాళ్లే తెచ్చుకోవాలని బాలు చెబుతాడు. అందరి చేతులకు మీనా బిందెలు ఇస్తుంది. వీధిలోకి అప్పుడే వాటర్ ట్యాంకర్ రావడంతో అందరూ వెళ్లి నీళ్లు తెచ్చుకుంటారు. శృతికి నీళ్లు మోయడానికి రాక బిందెను మనోజ్ కాళ్లపై పడేస్తుంది. దీంతో అతడు లబోదిబోమంటాడు.

ఇంట్లో వాళ్లందరికీ కరెంట్ షాక్

ఆ తర్వాత మెకానిక్ వస్తాడు. మోటర్ లో కాయిల్ మార్చుకోమని గతంలోనే చెప్పానని, ఇప్పుడు మార్చాల్సిందే అని అంటాడు. దానికి గంట టైమ్ పడుతుందని, అయితే అంత వరకూ మెయిన్ ఆన్ చేయొద్దని చెప్పి వెళ్లిపోతాడు. బాలు సరే అంటాడు. కానీ ఆ తర్వాత మనోజ్ చూసి ఈ మెకానిక్ మెయిన్ ఆన్ చేయడం మరచిపోయినట్లున్నాడని ఆన్ చేస్తాడు.

లోపల ప్రభావతి వెంటనే ఫ్యాన్ వేయడానికి వెళ్తుంది. దీంతో ఆమెకు కరెంట్ షాక్ కొడుతుంది. అప్పుడే ఇంటికి వచ్చిన కామాక్షికి, ఆ తర్వాత రోహిణి, మనోజ్, శృతి, రవి ఇలా అందరికీ షాక్ తగులుతుంది. వాళ్లను చూసిన మీనా జరిగింది ఊహించి.. వెంటనే ప్రభావతిని కర్రతో కొడుతుంది. దీంతో అందరూ కిందపడిపోతారు.

మనోజ్‌ను చితకబాది..

ఆ తర్వాత జరిగింది ఏంటో అందరూ గుర్తిస్తారు. మెయిన్ ఆన్ చేయొద్దని చెప్పాను కదా అని బాలు అంటే.. ఆ పని చేసింది మనోజే అని అర్థమవుతుంది. దీంతో రోహిణి సహా ఇంట్లో వాళ్లందరూ అతన్ని చితకబాదుతారు. తనకు వరుస ప్రాణగండాలతో ప్రభావతి వణికిపోతుంది. దీంతో మనోజ్ చెప్పిన పరిహారానికి అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More