Gunde Ninda Gudi Gantalu Today Episode: నిండా మునిగిన మనోజ్.. మోసం ఖరీదు రూ.50 లక్షలు.. బాలు వద్దంటున్నా తాగి సంతకం
Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 19 ఎపిసోడ్ లో మనోజ్ నిండా మునుగుతాడు. బాలు తాగి చెప్పిన నిజం, తాను తాగి చేసిన సంతకంతో రూ.50 లక్షలు నెత్తిన పడే ప్రమాదం వస్తుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ముగ్గురు అన్నదమ్ములు తాగి నానా హంగామా చేస్తారు. అయితే ఆ తాగుడే మనోజ్ ను నిండా మునిగేలా చేస్తుంది. బాలు వద్దంటున్నా సంతకం చేసి మనోజ్ మోసపోతాడు. అయితే దీనికి కారణం మాత్రం బాలునే అవుతాడు.

బాలు వద్దంటున్నా తాగి సంతకం చేసిన మనోజ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (మార్చి 19) ఎపిసోడ్ ముకేష్ మొహమాటానికి మనోజ్ కూడా తాగే సీన్ తో మొదలవుతుంది. మనోజ్ నే కాకుండా రవి, బాలుని కూడా తాగాలని ముకేష్ బలవంతపెడతాడు.
అదే సమయంలో డీలర్‌షిప్ ఇస్తున్నట్లు కాగితాలపై సంతకం పెట్టమంటాడు. అప్పటికే మనోజ్ తాగేసి ఉంటాడు. ఇంకా మొదలుపెట్టని బాలు మాత్రం ఇప్పుడు వద్దు.. రేపు చదివి సంతకం పెట్టాలని అంటాడు. కానీ మనోజ్ మాత్రం వినకుండా సంతకం పెట్టేస్తాడు.
బాటిల్ ఎత్తేసిన బాలు.. తాగి చిందేసిన అన్నదమ్ములు
ఇక ముకేష్ బలవంతం చేయడంతో మొదట నాన్న ఫీలవుతాడని అన్న బాలు.. తర్వాత ఏకంగా బాటిలే ఎత్తేస్తాడు. అటు మీనా, శృతి వాళ్లు ఎక్కడ తాగుతారో అని టెన్షన్ పడుతుంటారు. ఇక్కడ బాలు, రవి మాత్రం పీకలదాకా తాగేస్తారు. తర్వాత బాలు.. ముకేష్ ను పొగుడుతూ పాట పాడతాడు. ఆ తర్వాత ముగ్గురు అన్నదమ్ములు కలిసి అతనితో చిందేస్తారు. డ్రమ్ముపైకి ఎక్కి బాలు నానా హంగామా చేస్తాడు.
బాలు ఫోన్ కొట్టేసే ప్లాన్ ఫెయిల్
బాలు ఫోన్ కొట్టేయడానికి ఇదే సరైన సమయం అని భావించిన రోహిణి.. విద్యను పంపిస్తుంది. మీ డ్యాన్స్ వీడియో తీస్తానంటూ బాలు ఫోన్ తీసుకుంటుంది విద్య. కాసేపు వీడియో తీసినట్లు నటించి తర్వాత పక్కకు వెళ్లి బాలు ఫోన్ వీడియో కోసం రోహిణి వెతుకుతుంటుంది. అప్పుడే బాలు అక్కడికి వచ్చి తన ఫోన్ లాక్కుంటాడు. అది చూసి విద్య ఇక ఈ ప్లాన్ ఆపెయ్.. అది అయ్యేలా లేదని రోహిణితో అంటుంది.
ముకేష్‌కు నిజం చెప్పేసిన బాలు
అందరూ పీకలదాకా తాగుతారు. ముగ్గురు అన్నదమ్ములను, తండ్రి సత్యంను ముకేష్ తెగ పొగిడేస్తాడు. అది విని బాలు ఫీలవుతాడు. మీరు మా నాన్నను పొగిడారు కాబట్టి మీకు నిజం చెబుతాను.. మేము చెప్పిందంతా అబద్ధం.. నాకు 40 కార్లు లేవు.. రెండే ఉన్నాయి.. వాటికి కూడా ఈఎంఐ కడుతున్నాను.. వీడు రెస్టారెంట్లో చెఫ్.. నా భార్య పూలు డోర్ డెలివరీ చేస్తుంది అని మొత్తం చెప్పేస్తాడు. ఇది నిజమేనా మనోజ్ అని ముకేష్ అడుగుతాడు. తాగిన మత్తులో ఉన్న అతడు బాలు ఏం చెబితే అది నిజం అని అంటాడు. దీంతో ముకేష్ వెళ్లిపోతాడు.
బాలు ఫోన్ కొట్టేసిన రోహిణి
ఆ తర్వాత తమ భర్తలను చూసి మీనా, రోహిని, శృతి షాక్ తింటారు. ముగ్గురూ కనీసం నడవలేని స్థితిలో ఉంటారు. దీంతో వాళ్లకు క్లాస్ పీకుతారు. తాగొద్దని చెప్పాను కదా అని మీనా.. గెస్టుకు పోయకుండా మీరు తాగడమేంటని రోహిణి అంటారు. ముగ్గురినీ బలవంతంగా తీసుకెళ్తారు. అదే అదునుగా బాలు కోటు జేబులో ఉన్న అతని ఫోన్ ను రోహిణి కొట్టేస్తుంది.
ఇంటి ముందుకు వెళ్లిన తర్వాత కూడా అన్నదమ్ముల హంగామా మామూలుగా ఉండదు. సత్యాన్ని చూసి రవి అంకుల్ అనడం, బాలు మామయ్య అనడం, మనోజ్ బాబాయి అని అంటారు. వాళ్లను చూసి సత్యం, ప్రభావతి షాక్ తింటారు.
నిండా మునిగిన మనోజ్
మరుసటి రోజు ఉదయం మత్తు దిగిన తర్వాత మనోజ్ కు అసలు విషయం తెలుస్తుంది. తన డీల్ క్యాన్సిల్ అయిందని తెలుసుకుంటాడు. ముకేష్ కు ఏం చెప్పావని బాలుని నిలదీస్తాడు. మొత్తం నిజం చెప్పేశానని అంటే.. అసలు ఏం జరిగిందని సత్యం అడుగుతాడు. మనోజ్ చేసిన డ్రామా గురించి చెబితే.. అందరినీ మోసగాళ్లను చేశావా అంటూ మనోజ్ పై సత్యం మండిపడతాడు. అయితే మోసం వల్ల డీల్ రద్దయితే నేను రూ.50 లక్షలు ఇవ్వాలని ఇందులో రాసి ఉందని, తాను మునిగానని మనోజ్ తల పట్టుకుంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


