Gunde Ninda Gudi Gantalu Today Episode: కళ్లు తిరిగి పడిపోయిన బాలు.. మనోజ్, రోహిణి ఫ్యామిలీ డ్రామా.. బాలు, మీనా సూపర్
Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 16 ఎపిసోడ్ లో కొత్త ఫ్యామిలీ డ్రామాకు తెరతీస్తారు మనోజ్, రోహిణి. మరోవైపు బాలు కళ్లు తిరిగి పడిపోతాడు. అయితే చివర్లో బాలు, మీనా కొత్త లుక్ అదుర్స్ అనేలా ఉంటుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో సత్యం ఫ్యామిలీ లుక్ ను పూర్తిగా మార్చేస్తారు మనోజ్, రోహిణి. తన బిజినెస్ ప్లాన్ కోసం మనోజ్ పెద్ద నటకానికే తెర తీస్తాడు. ఈ క్రమంలో సత్యం అండ్ ఫ్యామిలీని ఇప్పటి వరకూ ఎప్పుడూ చూడని లుక్ లో ఆడియెన్స్ చూడబోతున్నారు. ముఖ్యంగా బాలు, మీనా సూపర్ లుక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.

కళ్లు తిరిగి పడిపోయిన బాలు
గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (మార్చి 16) ఎపిసోడ్ సుమతి పెళ్లి గురించి బాలు చెప్పే సీన్ తో మొదలవుతుంది. అది వినగానే ప్రభావతి తప్ప అందరూ సంతోషిస్తారు. మరోవైపు మనోజ్ మాత్రం ఆమె పెళ్లిని మనమే దగ్గరుండి ఘనంగా జరిపిద్దామంటాడు. అది విని బాలు కళ్లు తిరిగి పడిపోతాడు.
అందరూ కంగారు పడతారు. ముఖాన నీళ్లు కొట్టి మీనా అతన్ని లేపుతుంది. ఆ మాటన్నది వీడేనా.. వీడి నోటి నుంచి ఇంత మంచి మాటలా అంటూ బాలు అంటాడు. అటు రోహిణి కూడా అదే మాట అంటుంది. అందరం కలిసి ఆమె పెళ్లి ఘనంగా చేద్దామంటుంది.
గుడ్ న్యూస్ చెప్పిన మనోజ్.. ముగ్గురూ కలిసి ఈవెంట్ ప్లాన్
ఆ తర్వాత మనోజ్ కూడా గుడ్ న్యూస్ చెప్పాలంటే. వచ్చే శనివారం అని అనగానే ఆ రోజు నీ షాపు మొదలు పెట్టి 100 రోజులైందని బాలు అంటే.. ఆ రోజే వాళ్ల పెళ్లి రోజు అని మీనా చెబుతుంది. ఆ రెండూ నిజమే అని, ఈ సందర్భంగా హోటల్లో గ్రాండ్ గా పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు మనోజ్ చెబుతాడు.
ఎందుకు అంత ఖర్చు అని సత్యం అంటే.. ఓ పెద్ద బిజినెస్‌మ్యాన్ వస్తున్నాడని, అతన్ని ఇంప్రెస్ చేయడానికి ఇదంతా తప్పదని, అదే జరిగితే తన బిజినెస్ మరో లెవెల్ కు వెళ్తుందని మనోజ్ అంటాడు. ఈ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేయడానికి తమకు సహకరించాలని మనోజ్, రోహిణి కోరతారు.
బాలు, రవిలను ఒప్పించిన మనోజ్
బాలు, రవిలను తీసుకొని మనోజ్ పైకి వెళ్తాడు. టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతుంటాడు. ఏం జరిగిందని అడిగితే జరిగింది చెబుతాడు మనోజ్. అయితే ఆ బిజినెస్‌మ్యాన్ ను ప్రసన్నం చేసుకోవాలంటే తనతోపాటు ఇంట్లో వాళ్లందరూ గొప్పగా కనిపించాలని అంటాడు. అందుకే నువ్వు 50 కార్లు ఉన్న ట్రావెల్స్ ఓనర్ అని చెప్పానని బాలుతో, రెస్టారెంట్ కు ఓనర్ వని చెప్పానని రవితో మనోజ్ అంటాడు. మీరు కూడా అలాగే కనిపించాలని అనడంతో బాలు, రవి తిడతారు.
దీనికోసమేనా అప్పటి నుంచి తమతో చాలా బాగా మాట్లాడుతున్నావ్.. సుమతి పెళ్లి దగ్గరుండి చేద్దామన్నావ్ అని బాలు అంటాడు. ఇది జరిగితే మన ఫ్యామిలీ అంతా బాగుంటుందని, సక్సెస్ అయితే తాను తీసుకున్న డబ్బుకు డబుల్ ఇస్తానని మనోజ్ చెబుతాడు. అంతేకాదు తనను పొగుడుతూ మాట్లాడితే.. ప్రతి పొగడ్తకు వెయ్యి ఇస్తానని కూడా బాలుకు ఆఫర్ ఇస్తాడు. ఇక వాళ్లు వేసుకునే బట్టలతోపాటు మొత్తం ఖర్చు తానే చూసుకుంటాననీ చెబుతాడు. దీంతో మొత్తానికి ఇష్టం లేకపోయినా సరే అని బాలు, రవి అంటారు.
శృతి, మీనాలతో రోహిణి ప్లాన్
ఇటు శృతి, మీనాలతో రోహిణి కూడా అదే చెబుతుంది. వాళ్ల ముందు రిచ్ గా కనిపించాలని, ఈవెంట్ రోజు మొత్తం మేకప్, మిగిలినవన్నీ తానే చూసుకుంటానని అంటుంది. మీనా కూడా బాలులాగే అలా చేయడం వల్ల ఏం లాభం.. వచ్చిన వాడు ఫ్యామిలీ వేసుకునే బట్టలు ఎందుకు చూస్తాడని అడుగుతుంది.
అప్పుడు శృతి జోక్యం చేసుకుంటూ.. ఇప్పుడు సొసైటీ అలాగే ఉందని, వేసుకునే బట్టలను బట్టే విలువ ఇస్తున్నారని అంటుంది. అప్పుడే మనోజ్ రోహిణికి ఫోన్ చేసి బాలు, రవి ఒప్పుకున్నారని అంటాడు. అదే విషయం రోహిణి చెప్పగానే మీనా, శృతి కూడా సరే అంటారు.
ఫ్యామిలీ డ్రామా స్టార్ట్
ఈవెంట్ రోజు సత్యం ఫ్యామిలీ మొత్తం ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా రెడీ అవుతుంది. అందరూ కాస్ట్ లీ బట్టలు వేసుకుంటారు. సూటుబూట్లు, పట్టుచీరలు, నగలు.. ఇలా ఫ్యామిలీ మెరిసిపోతూ ఉంటుంది. అయితే అందరి కన్నా బాలు, మీనా చివర్లో అదిరిపోయే డ్రెస్సుల్లో ఇచ్చే ఎంట్రీ మరో లెవెల్లో ఉంటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


