Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా ఉగ్రరూపం.. మనోజ్‌ను బెల్టుతో ఎడాపెడా బాది.. భయంతో టేబుల్ కింద ప్రభావతి

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ లో మీనా ఉగ్రరూపం చూపించింది. మనోజ్ ను బెల్టు తీసుకొని ఎడాపెడా బాదేస్తుంది. దీంతో ప్రభావతి భయంతో టేబుల్ కింద దాక్కొంటుంది.

Mar 10, 2026, 08:05:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ప్రభావతి, మనోజ్ తిక్క కుదుర్చుతుంది మీనా. తన ఇంటికి వచ్చిన తన బంధువులను కనీసం తినకుండా వెళ్లిపోయేలా చేసిన అత్తకు మీనా గట్టిగానే సమాధానం ఇస్తుంది. నోటికొచ్చినట్లు మాట్లాడిన మనోజ్ ను ఎడాపెడా బాదుతుంది.

Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా ఉగ్రరూపం.. మనోజ్‌ను బెల్టుతో ఎడాపెడా బాది.. భయంతో టేబుల్ కింద ప్రభావతి
Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా ఉగ్రరూపం.. మనోజ్‌ను బెల్టుతో ఎడాపెడా బాది.. భయంతో టేబుల్ కింద ప్రభావతి

రవితో శృతి మళ్లీ గొడవ

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (మార్చి 10) ఎపిసోడ్ తండ్రికి బాలు సారీ చెప్పే సీన్ తో మొదలవుతుంది. ఆ తర్వాత రవి ఉదయాన్ని రెడీ అవుతుంటాడు. తనకు జ్వరం వచ్చిందని, తాను లీవ్ పెట్టానని, నువ్వు కూడా పెట్టాలని శృతి అడుగుతుంది. అప్పుడే నీతూ ఫోన్ చేస్తుంది. అదే విషయం రవి చెబితే.. తాను వచ్చిన తర్వాత తొలి పెద్ద ఆర్డర్ వచ్చింది.. కచ్చితంగా రావాల్సిందే అని ఆర్డర్ వేస్తుంది. దీంతో శృతిని వదిలేసి రవి వెళ్లిపోతాడు.

పుట్టింటికి వెళ్లిపోయిన శృతి..

తాను అంత చెప్పినా వినకపోవడంతో శృతి అలుగుతుంది. తన లగేజీ సర్దుకొని పుట్టింటికి వెళ్లడానికి రెడీ అవుతుంది. మీనా అడ్డుకొని ఏం జరిగిందని అడుగుతుంది. తాను చెప్పినా వినకుండా రవి వెళ్లిపోయాడని, నీకు ఏమైనా అయితే బాలు ఇలాగే చేస్తాడా అని అడుగుతుంది.

తర్వాత ప్రభావతి కూడా వచ్చి ఏం జరిగిందని అడగడంతో తన ఇంటికి వెళ్లిపోతున్నానని చెబుతుంది. మీనా, ప్రభావతి ఎంత చెప్పినా వినదు. కోపంతో వెళ్లిపోతుంది. బయట ఉన్న బాలు పిలుస్తున్నా కూడా వినదు.

రవికి ప్రభావతి ఫోన్.. రెచ్చగొట్టేలా మాట్లాడి..

వెంటనే రవికి ప్రభావతి ఫోన్ చేస్తుంది. శృతి వెళ్లిపోయిన విషయం చెబుతుంది. తాను వచ్చేటప్పుడు ఇంటికి వెళ్లి శృతిని తీసుకొస్తానని రవి అంటాడు. కానీ ప్రభావతి మాత్రం కొడుకు, కోడలిని కలపాల్సింది పోయి రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.

అవసరం లేదు.. మొగుడు అన్నాక కాస్త బెట్టు చేయాలి.. నువ్వు అక్కడికి వెళ్లకు.. నేరుగా ఇంటికి వచ్చెయ్.. నీ పెళ్లాం పద్ధతి అస్సలు బాలేదు అని చెబుతుంది. అది విని బాలు, మీనా కూడా షాక్ తింటారు. ఎవరైనా కలపాలని చూస్తారు కానీ ఇలా విడగొట్టడానికి ప్రయత్నిస్తుందేంటని అనుకుంటారు.

ఆ వెంటనే మీనా కూడా రవికి ఫోన్ చేస్తుంది. అత్తయ్య చెప్పింది తాను విన్నానని, ఆమె చెప్పింది వినొద్దని, వెంటనే వెళ్లి శృతికి నచ్చజెప్పి తీసుకురావాలని అని అంటుంది. మీనా మాటలు విన్న తర్వాత రవి కాస్త కుదుటపడి అలాగే చేస్తానని అంటాడు.

ఇంటికి మీనా బంధువులు.. పెళ్లికి ఆహ్వానం

ఇటు మీనా ఇంటికి ఆమె బంధువులు వస్తారు. తన బాబాయి కూతురి పెళ్లి ఉండటంతో పత్రిక తీసుకొని వస్తారు. ఆమె బాలుకి ఫోన్ చేసి చెప్పడంతో తాను దూరంగా ఉన్నానని, వాళ్లకు భోజనాలు పెట్టి పంపించమని చెబుతాడు. మీనా సరే అంటుంది. తొలిసారి తమ ఇంటికి వచ్చారు.. తినేసి వెళ్లాలని వాళ్లను బలవంతం చేయడంతో సరే అంటారు. వాళ్లందరూ భోజనం చేస్తుండగా ప్రభావతి వస్తుంది.

ప్రభావతి రచ్చ.. అత్తకు మీనా క్లాస్

మీనాను పైకి తీసుకెళ్తుంది. ఎవరికి పడితే వాళ్లకు తిండి పెడతావా.. పూలు అమ్ముకునే వాళ్లో, పాలు అమ్ముకునే వాళ్లో అని ప్రభావతి నానా మాటలు అంటుంది. వాళ్లు తన బంధువులు అని, వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఏదైనా అనండని అంటున్నా ప్రభావతి మాత్రం వినదు.

నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. అదంతా వాళ్లు వింటారు. తినడం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోతారు. అది చూసి అత్తకు మీనా క్లాస్ పీకుతుంది. అతిథులను దేవుళ్లు అంటారు.. అలాంటి వారిని కనీసం తినకుండా వెళ్లిపోయేలా చేశారంటూ ప్రభావతిని తిడుతుంది. సగంలో వదిలేసిన ప్లేట్లను కూడా తీయకుండా వెళ్లిపోతుంది.

అత్తకు ఎదురు తిరగమని మీనాకు చెప్పిన ఫ్రెండ్స్

పూలు అల్లడానికి వెళ్లిన మీనా డల్లుగా ఉండటం చూసి ఏమైందని ఫ్రెండ్స్ అడుగుతారు. ఇంట్లో జరిగిన విషయం చెబుతుంది. తమ ఇళ్లలోనూ అత్తలు ఇలాగే ఉండేవారని, కానీ తమదైన స్టైల్లో వాళ్లకు బుద్ధి చెప్పడంతో దారికి వచ్చారని వాళ్లు అంటారు. చురకలు పెట్టడం, కాళ్లపై రోకలి బండలు పడేయడంలాంటివి కూడా చేశామని చెబుతారు. దీంతో మీనా కూడా ఆలోచనలో పడుతుంది.

మనోజ్‌ను ఎడాపెడా బాదేసిన మీనా

ఇంటికి రాగానే మనోజ్ జలుబుతో బాధపడుతుంటాడు. దీంతో మీనాను వెళ్లి చికెన్ తీసుకొచ్చి సూప్ చేయమని ప్రభావతి ఆర్డర్ వేస్తుంది. నీ పెళ్లాన్ని వెళ్లి తెచ్చుకోమను అని మనోజ్ కు కాస్త గట్టిగానే చెబుతుంది మీనా. ఆఫ్టరాల్ పూలు అమ్ముకునేదానివి.. నీ లెవెల్ ఎంత.. ఓ బిజినెస్‌మ్యాన్ తో ఇలాగే మాట్లాడతావా అంటూ మనోజ్ నోటికొచ్చినట్లు వాగుతాడు.

మీనా సైలెంట్ గా వెళ్లిపోతుంది. పైకి వెళ్లి చేతిలో బెల్టు తీసుకొని వస్తుంది. తమ్ముడి భార్యతో ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ మనోజ్ ను బెల్టుతో ఎడాపెడా బాదుతుంది. అతడు బాధతో విలవిలలాడిపోతున్నా మీనా కొడుతూనే ఉంటుంది. భయంతో ప్రభావతి వెళ్లి టేబుల్ కింద దాక్కొంటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More