Gunde Ninda Gudi Gantalu Today Episode: ప్రభావతి ఐడియా, మేక మామ ఎస్కేప్- శివ బ్యాగులో మందు బాటిల్- కాలేజ్ నుంచి సస్పెండ్
Gunde Ninda Gudi Gantalu Serial March 5th Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 5 ఎపిసోడ్‌లో గుడిలో ప్రభావతి, సత్యంకు మాణిక్యం కనిపిస్తాడు. దాంతో అంతా మాణిక్యంను చుట్టుముడతారు. ప్రభావతి ఇచ్చిన ఐడియాతో మేక మామ ఎస్కేప్ అవుతాడు. శివను ఎగ్జామ్ రాయనివ్వకుండా బ్యాగులో మందు బాటిల్ పెట్టిస్తాడు గుణ.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విద్య ఇంటి డోర్ బెల్ కొడతాడు బాలు. నేను వెళ్లి తీస్తానని చింటూ వెళ్తాడు. ఇంతలో రోహిణికి విద్య కాల్ చేసి బాలు గురించి చెబుతుంది. దాంతో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి చింటును డోర్ తీయకుండా తీసుకెళ్తుంది రోహిణి. కిటికీ లోనుంచి బాలు చూస్తాడు. కానీ, అంతలోనే రోహిణి లోపలికి వెళ్తుంది.

రాజేష్ గాడు ఎందుకలా చెప్పాడు
ఎవరు డోర్ తీయకపోవడంతో నేనే ఎక్కువగా అనుమానించానా, రాజేష్ గాడు ఎందుకలా చెప్పాడనుకుని తిరిగి బయలుదేరుతాడు. రవి, శ్రుతి మాట్లాడుకుంటుండగా రవి రెస్టారెంట్ మేనేజర్ కనిపిస్తాడు. వాళ్లు కూడా ముడుపులు కట్టేందుకు వచ్చామని చెబుతారు. యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు పిల్లలు కావాలంటే నొప్పులు పడలేక వద్దంది, ఇప్పుడు నలుగురిని చూసి నాకు పిల్లలు కావాలంటుంది అని మేనేజర్ చెబుతాడు.
ఇప్పటికైనా కళ్లు తెరిచారు అని శ్రుతి అంటుంది. తర్వాత మేనేజర్ వెళ్లిపోతారు. నీలాగే ఆవిడ కూడా పిల్లలు వద్దందని రవి అంటాడు. మనకెందుకు అలా అవుతుంది, నా ప్లాన్‌లో నేనున్నాను అని శ్రుతి అంటుంది. మరోవైపు సత్యం, ప్రభావతి వస్తుంటే.. దారిలో మేక మామ, మటన్ కొట్టు మాణిక్యం పొర్లు దండాలు పెడతాడు. అతన్ని తాకడంతో ప్రభావతి కింద పడుతుంది.
సత్యం, ప్రభావతి ఇద్దరు మాణిక్యంను చూసి షాక్ అవుతారు. మరోవైపు గండం గట్టెక్కిందనుకున్న రోహిణి నేను ఏ పాపం చేశానని నా బతుకు ఇలా దిన దిన గండంగా మారిందని తల్లితో అంటుంది. చేసిన దానికి చేసుకున్నంత అంటారని సుగుణ అంటుంది. ఇంతలో విద్య వచ్చి తలుపు కొడుతుంది. దాంతో రోహిణి వణికిపోతుంది. ఒసేయ్ నేనేనే డోర్ ఓపెన్ చేయమంటుంది విద్య.
ప్రభావతి ఐడియా
బాలు వచ్చాడు. భయంతో గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో చూడు. బాలు విషయంలో జాగ్రత్త పడుతూనే ఉండాలి అని రోహిణి అంటుంది. ఇంతలో రోహిణికి ప్రభావతి కాల్ చేసి నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు. మీ మావయ్య కనిపించాడు. రా అని ప్రభావతి అంటుంది. దాంతో మరింత వణికిపోతుంది రోహిణి. గుడికి బయలుదేరుతుంది.
మాణిక్యంను సత్యం ఫ్యామిలీ అంతా చుట్టుముడతారు. ఓరి నాయనో ఈరోజు నేను నిజం తప్పా ఏం చెప్పను కదా అని మాణిక్యం అనుకుంటాడు. సత్యం వాళ్లంతా ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. ఇప్పుడు నిజం చెబితే రోహిణి ఫ్యామిలీ కూలిపోతుందని భయపడతాడు మాణిక్యం. ఇంతలో బాలు వచ్చి మేక మామ నువ్వా అని షాక్ ఇస్తాడు. దాంతో మాణిక్యం మరింత భయపడతాడు.
బాలు ఏం అడిగిన ఏం చెప్పడు మాణిక్యం. ఇలా మాట్లాడట్లేదంటే మౌన వ్రతం ఏమో అని ప్రభావతి అంటుంది. అబ్బా మంచి ఐడియా ఇచ్చిందని మాణిక్యం అనుకుంటాడు. గుడికి ఎందుకు వచ్చానో సైగలతో చెబుతాడు మాణిక్యం. బాలు చక్కిలిగింతలు పెడతాడు. హారతి పళ్లెం తీసుకొచ్చి ఇప్పుడు నిజం చెప్పు మేక మామ. రోహిణి మావవు కాదు కదా. మటన్ కొట్టు నడుపుతున్నావ్ కదా, హారతి ఆపి నిజం చెప్పమంటాడు బాలు.
అబద్ధం ఆడలేక చచ్చిపోయాను
ఇక్కడ ఇంకో గండం మొదలైందా అని రోహిణి అనుకుంటుంది. వచ్చింది అబద్ధాలమ్మా అని రోహిణిని అనుకుంటాడు మాణిక్యం. మీ మావయ్య వచ్చి నీకెందుకు కాల్ చేయలేదు, ఇక్కడే ఉంటాడా, అసలు ఏంటిది అని ప్రభావతి ప్రశ్నిస్తుంది. మౌనవ్రతం చేస్తున్నాడటమ్మా అని సత్యం తెలియకుండా హింట్ ఇస్తాడు. దాంతో అయితే నిజం చెప్పలేదన్నమాట అని నాకు కాల్ చేశాడు. వారం రోజులు మౌనవ్రతం పాటిస్తూ ఇండియాలో తీర్థయాత్రలు చేస్తారని రోహిణి చెబుతుంది.
తర్వాత మాణిక్యంను తీసుకెళ్తుంది రోహిణి. నేను ఒక్క అబద్ధం ఆడలేక చచ్చిపోయాను, ఇన్నిరోజులు ఎలా ఆడావమ్మా. నిజం బయటపడ్డ రోజు నీ బతుకు ఏమైపోతుందో ఆలోచించుకో అని చెప్పేసి వెళ్లిపోతాడు మాణిక్యం. ఇంతలో బాలు వచ్చి ఎక్కడికి వెళ్లావ్ అని బాలు అడిగితే విద్య దగ్గరికి అని చెబుతుంది రోహిణి. విద్య దగ్గరికి వడ్డీ డబ్బుల కోసం వెళ్లాను, విద్య ఇంట్లో వాళ్ల అమ్మ ఉంటుందని రోహిణి చెబుతుంది.
ఇంతలో మనోజ్ వస్తే తనే డబ్బులు 3 రూపాయల వడ్డీకి ఇచ్చాడని రోహిణి అంటుంది. అమ్మా లక్షలు మింగినోడా అనుకుంటూ బాలు వెళ్లిపోతాడు. ఈ బాలు నన్ను ఇరికించడానికి ముందే నేను ఇరికించాలని రోహిణి అనుకుంటుంది. తర్వాత పుట్టింటికి బాలుతో పాటు మీనా వెళ్తుంది. ఏమైందని సుమతి అడిగితే.. సుగుణ అన్న మాటల గురించి చెబుతుంది.
గడ్డిపెట్టిన సుమతి
మీకేమైనా వయసు అయిపోయిందా, పిల్లలు పుట్టరని చెప్పారా అని తిడుతుంది సుమతి. బాగానే గడ్డి పెట్టావ్, వన్ బై టు షేర్ చేసుకొందామని బాలు అంటాడు. ఇంతలో శివ వస్తాడు. ఇప్పుడే కదా కాలేజ్‌కు వెళ్లావ్, అప్పుడే వచ్చావేంటని సుమతి అంటుంది. నన్ను ఎగ్జామ్స్ రాయనివ్వనన్నారు ప్రిన్సిపాల్ సర్ అని జరిగింది చెబుతాడు శివ.
శివ బ్యాగులో మందు బాటిల్ ఉందని ప్రిన్సిపాల్‌తో టీచర్ చెబుతాడు. సర్ అది నేను తీసుకురాలేదని శివ అంటాడు. నోర్మూయ్ అని ప్రిన్సిపాల్ కొడతాడు. మా అమ్మ మీద ఒట్టు సర్, ఆ బాటిల్ నా బ్యాగులోకి ఎలా వచ్చిందో తెలియదంటాడు శివ. టీచర్, ప్రిన్సిపాల్ ఇద్దరు శివను తిట్టి ఇక కాలేజ్‌కి రావొద్దని, సస్పెండ్ చేస్తున్నాను అని అంటారు.
దాంతో శివ వచ్చింది చెబుతాడు. నా తప్పు లేకున్నా నింద పడిందక్క అని శివ అంటాడు. నువ్వు తాగేది గుణ గాడితోనే కదా. ఇంకా వాడితోనే స్నేహం చేస్తున్నావా అని సుమతి అంటుంది. లేదు, అక్కకు దెబ్బ తగలగానే వాడి దగ్గర ఉద్యోగం మానేశాను. కానీ తన దగ్గరికి రమ్మని వెంటపడుతున్నాడు, ఎక్కువ డబ్బు ఇస్తానంటున్నాడని శివ అంటాడు.
శివ బ్యాగులో మందు బాటిల్
అది విషయం నిన్ను కాలేజీకి వెళ్లకుండా చేస్తే మళ్లీ వాడి దగ్గరికి వెళ్తావని వాడే చేసి ఉంటాడు. అందుకే కాలేజీ బ్యాగ్‌లో బాటిల్ పెట్టాడని బాలు అంటాడు. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు బావ అని సుమతి అడుగుతుంది. ఇంకా ఎగ్జామ్‌కు టైమ్ ఉందా అని బాలు అడిగితే.. ఉందని శివ అంటాడు. అయితే, గుణ గాడితో నిజం రాబట్టి ప్రిన్సిపాల్‌కు చెప్పి ఎగ్జామ్ రాయిస్తానని బాలు అంటాడు.
గుణ దగ్గరికి బాలు వెళ్తాడు. శివకు పరీక్షలు ఉండవు, అగ్నీ పరీక్షలే ఉంటాయని గుణతో రౌడీ అంటాడు. ఇక వాడు నా దగ్గర కుక్కలా ఉంటాడని గుణ అంటాడు. ఇంతలో బాలు రావడం రౌడీ చూసి వచ్చి చెబుతాడు. దాంతో గుణ వెనుక డోర్ నుంచి పారిపోతాడు. రౌడీలను కొడతాడు బాలు. గుణ ఇక్కడ ఉండట్లేదని అబద్ధం చెబుతారు. వాడు ఎక్కడ ఉంటాడో తెలుసు అని బాలు వెళ్లిపోతాడు.
శ్రుతికి పార్సల్
మరోవైపు శ్రుతికి పార్సల్ వస్తే మీనా తీసుకుందామని వెళ్తుంది. అది ఆపి ప్రభావతి తీసుకుంటుంది. శ్రుతికి వచ్చిన పార్సల్ ప్రభావతి ఓపెన్ చేస్తే.. మీనా వద్దంటుంది. కానీ, ప్రభావతి వినదు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












