గుండె నిండా గుడి గంటలు ప్రోమో: గుడిలో ప్రభావతికి దొరికిపోయిన మేక మామ.. రోహిణి గుట్టు రట్టు.. అందరి ముందూ దొంగలా..
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో ప్రభావతి పెద్ద కోడలు రోహిణి గుట్టు రట్టయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆమె తీసుకొచ్చిన మలేషియా మామ గుడిలో ప్రభావతికి అడ్డంగా దొరికిపోతాడు. దీంతో రోహిణి అందరి ముందు దోషిలా నిలబడాల్సి వస్తుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రోమో వచ్చే ఎపిసోడ్ లో రోహిణి పని ఇక అయిపోయినట్లే అనేలా ఉంది. స్టార్ మా ఈ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేసింది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. గుడిలో అందరి ముందు రోహిణి దొరికిపోయే పరిస్థితి ఏర్పడటం ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం.

ప్రోమోలో ఏమున్నదంటే?
గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ ప్రోమో గుడిలో ప్రభావతికి రోహిణి తీసుకొచ్చిన మలేషియా మామ దొరికిపోతాడు. అతడు పొర్లు దండాలు పెడుతుండగా.. ప్రభావతి కాళ్లకు తగులుతాడు. దీంతో ఆమె కింద పడిపోతుంది. పక్కనే ఉన్న సత్యం అతన్ని చూసి నువ్వు రోహిణి మేన మామవు కదూ అని అడుగుతాడు. వెంటనే ప్రభావతి.. రోహిణికి ఫోన్ చేస్తుంది. మీ మలేషియా మామ కనిపించాడు.. ఇక్కడే ఉన్నాడు.. వెంటనే రా అని చెబుతుంది.
దొరికిపోయిన రోహిణి
అది విని రోహిణి కంగారుగా బయలుదేరుతుంది. అప్పటికే మటన్ కొట్టు మాణిక్యాన్ని ఇంట్లో వాళ్లందరూ నిలదీస్తుంటారు. నువ్వు మలేషియాలో ఉండాలి కదా.. మా ఊరి గుడిలో ఏం చేస్తున్నావని ప్రభావతి అడుగుతుంది. వెంటనే బాలు కూడా హారతి తీసుకొచ్చి.. దీనిని ఆర్పి నీ అసలు నిజం చెప్పు.. నువ్వు మలేషియా మామవు కాదు కదా.. ఏ మటన్ కొట్టులోనో పని చేస్తావు కదా అని అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి అది విని షాక్ తింటుంది. ఈ ప్రోమో చూస్తుంటే.. ఇక రోహిణి నాటకానికి తెరపడినట్లేనా అన్న అనుమానం కలుగుతోంది.
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్
నిజానికి గుండె నిండా గుడి గంటలు ఈరోజు (మార్చి 4) ఎపిసోడ్ లోనూ విద్య ఇంట్లో బాలుకి చింటు, సుగుణలతో రోహిణి దొరికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ముందుగానే ఆమెకు విద్య సమాచారం ఇవ్వడంతో ఏదో మాయ చేసిన తప్పించుకున్నట్లు తాజాగా ప్రోమోతో తేలిపోయింది.
విద్య ఇంట్లో తప్పించుకున్నా.. గుడిలో మాత్రం రోహిణికి గండం పొంచి ఉన్నట్లు స్పష్టమవుతోంది. మరి దీని నుంచి ఆమె బయటపడుతుందా? లేదంటే మరో నాటకానికి తెర తీస్తుందా? బాలు ఆమెను మరింత ఇరికించి నిజం రాబడతాడా లేదా అన్నది వచ్చే ఎపిసోడ్ లో తేలనుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


