గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: విద్య ఇంట్లో చింటుతో బాలుకి దొరికిపోయిన రోహిణి.. ఇరికించిన మనోజ్ వడ్డీ కక్కుర్తి
గుండె నిండా గుడి గంటలు సీరియల్ (gunde ninda gudi gantalu today episode) ఈరోజు ఎపిసోడ్ లో రోహిణికి మరోసారి బాలు గండం ఎదురవుతుంది. విద్య ఇంట్లో చింటు, సుగుణలతో ఆమె దొరికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో మౌనిక కోసం సత్యం ఫ్యామిలీ మొత్తం గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయిస్తుంది. అయితే అదే సమయంలో మనోజ్ వడ్డీ కక్కుర్తి రోహిణిని ప్రమాదంలో పడేస్తుంది. బాలుకి ఆమె దొరికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

గుడిలో పూజకు మీనా అన్ని ఏర్పాట్లు.. ప్రభావతికి క్లాస్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (మార్చి 4) ఎపిసోడ్ మౌనిక కోసం సత్యం ఫ్యామిలీ గుడిలో పూజల కోసం వెళ్లే సీన్ తో మొదలవుతుంది. మీనా రాకపోవడంతో ఆమెపై ప్రభావతి ఆడిపోసుకుంటుంది. అయితే తాను రాకపోయినా గుడిలో అన్ని ఏర్పాట్లు చేసి పెడుతుంది మీనా.
పూలతోపాటు గుడిలో ప్రత్యేక పూజల కోసం టికెట్, అమ్మవారికి సారె, పంతులుగారికి ముందే చెప్పి పూజకు ఏ లోటూ రాకుండా చూస్తుంది. చివరికి అన్నదానం కోసం కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఆమెకు గుడిలో ఉన్న ఫాలోయింగ్ చూసి బాలు, సత్యం, రవి, శృతి, మౌనిక ఆనందించగా.. ప్రభావతి, మనోజ్, రోహిణి మాత్రం ఏడుస్తుంటారు. ప్రభావతి నోటికొచ్చినట్లు మాట్లాడుతూనే ఉంటుంది. దీంతో ఆమె ఇక మారదని బాలు, సత్యం అనుకుంటారు.
వడ్డీ కోసం విద్య దగ్గరికి మనోజ్.. అడ్డుకున్న రోహిణి
ఇటు అన్నదానానికి ఇంకా సమయం ఉండటంతో తనకు ఒక ముఖ్యమైన పని ఉందని చెప్పి మనోజ్ బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే రోహిణి ఎక్కడికని అడుగుతుంది. మీ విద్య డబ్బు తీసుకొని వడ్డీ ఇవ్వడం లేదు.. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. పక్కనే ఆమె ఇల్లు కదా వెళ్లొస్తాను అని మనోజ్ అంటాడు.
అక్కడే చింటు, సుగుణ ఉండటంతో ఎక్కడ విషయం బయటపడి పోతుందో అని కంగారు పడుతూ తానే వెళ్తానని రోహిణి అంటుంది. నువ్వు వెళ్తే సమాధానం వస్తుంది.. నేను వెళ్తేనే వడ్డీ వస్తుందని చెప్పి మనోజ్ ను ఆపి తాను వెళ్తుంది.
మౌనిక విషయంలో బాలు, ప్రభావతి గొడవ
మౌనిక పక్కన కూర్చొన్న బాలు ఆమె భర్త గురించి అడుగుతాడు. బావగారు కూడా వచ్చి ఉంటే బాగుండేది.. ఇంకా కోపం తగ్గలేదా అని అంటాడు. దీనికి ప్రభావతి స్పందిస్తూ ఇంటి అల్లుడు అని చూడకుండా ఎన్నిసార్లు చేయి చేసుకున్నావని నిలదీస్తుంది. ఈ విషయంలో బాలు, ప్రభావతి గొడవ పడతారు.
బాలుకి రాజేష్ ఫోన్.. సుగుణ వెంట రోహిణి వెళ్లిందని చెప్పి..
మరోవైపు చింటు, సుగుణ రోడ్డుపై నడుస్తూ వెళ్లడం రాజేష్ చూస్తాడు. వాళ్ల వెనుకే రోహిణి ఆటోలో వెళ్లడం కూడా కనిపిస్తుంది. దీంతో వెంటనే బాలుకి ఫోన్ చేసి విషయం చెబుతాడు. చింటు, సుగుణ ఇక్కడే ఉన్నారని, వాళ్ల వెంటే మీ వదని వెళ్లిందని చెప్పడంతో బాలులో అనుమానం మొదలవుతుంది. అదేంటో తేల్చుకోవాలని బాలు గుడి నుంచి బయలేదురుతాడు.
మౌనికను నిలదీసిన సత్యం.. ఏడ్చేసిన మౌనిక
గుడిలో మౌనిక ఒంటరిగా కూర్చోవడం చూసి ఆమె దగ్గరికి వెళ్తాడు సత్యం. ఆమె కష్టసుఖాల గురించి ఆరా తీస్తాడు. అల్లుడు గారిలో తండ్రి అవుతున్నానన్న సంతోషం ఎందుకు లేదు.. నీకు అత్తగారింట్లో అంతా బాగానే ఉందా.. బాలు గాడు కారణం లేకుండా అల్లుడిపై ద్వేషం పెంచుకోడు.. అసలు ఏం జరుగుతోంది.. ఏం జరిగినా అక్కడే ఉండమని చెప్పేంత మూర్ఖుడిని కాదు నేను.. పెళ్లి సమయంలో తండ్రిగా ఏం చేయలేదు.. ఇప్పుడైనా చేస్తానని సత్యం అంటాడు.
అది విని మౌనిక మనసులోనే తన బాధలను తలచుకుంటుంది. సత్యాన్ని పట్టుకొని ఏడుస్తుంది. కానీ ఇంట్లో తాను అనుభవిస్తున్న బాధలను చెప్పదు. ఇప్పుడే పిల్లలు వద్దనుకున్నా అత్త, మామలు కావాలన్నారని, అందుకే ఆయన అలా ఉన్నారని కవర్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత ఇలా మీతో కూర్చొని కష్టసుఖాలు మాట్లాడటంతో ఏడుపొచ్చేసిందని చెబుతుంది.
రోహిణికి క్లాస్ పీకిన తల్లి సుగుణ
మరోవైపు విద్య ఇంట్లో కొడుకు చింటుతో రోహిణి ఆడుకుంటుంది. ఆమెను చూసిన సుగుణ క్లాస్ పీకుతుంది. చుట్టపు చూపుగా వచ్చిపోవడం కాదు.. నువ్వు అతనికి తల్లి అనే విషయం బయట చెప్పు అని నిలదీస్తుంది. లేదంటే అదే బయటపడి చివరికి నీ కొడుకు, నేను కూడా నీకు దూరమవుతాం అని అంటుంది. అటు చింటు కూడా బాలు అంకుల్, మీనా ఆంటీ దత్తత తీసుకుంటే బాగుంటుంది.. అప్పుడు నిన్ను కూడా అమ్మ అని పిలుస్తూ అక్కడే ఉండొచ్చు కదా అని అంటాడు. అది విని రోహిణి మరింత ఏడుస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్లొద్దని చింటుకి సుగుణ చెబుతుంది.
విద్యతో బాలు గొడవ.. చింటు గురించి ఆరా
రోడ్డుపై వెళ్తున్న విద్యకు బాలు ఎదురుగా వస్తాడు. కారు పైకి రావడంతో విద్య అతనితో గొడవ పడుతుంది. రోడ్డుపైనే ఇద్దరూ మాటామాటా అనుకుంటారు. ఆ తర్వాత చింటు ఈ వీధిలో ఏమైనా కనిపించాడా అని బాలు అడగడంతో విద్య కంగారు పడుతుంది. వాళ్లు ఇక్కడ ఎందుకుంటారు.. వాళ్లది ఏదో పల్లెటూరు కదా అని కంగారుగా చెబుతూ వెళ్లిపోతుంది.
ఆమెను చూసి బాలులో అనుమానం మరింత ఎక్కువవుతుంది. నేరుగా విద్య ఇంటికే బాలు వెళ్తాడు. ఇంట్లో చింటు, సుగుణలతో రోహిణి ఉంటుంది. బాలు డోరు కొట్టడంతో తీయడానికి చింటు వెళ్తాడు. అప్పుడే రోహిణికి విద్య ఫోన్ చేసి బాలు గురించి చెబుతుంది. దీంతో ఆమె ఆందోళన చెందుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


