Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్‌పైకి బాడీగార్డ్‌ల దండయాత్ర.. మరింత ఇరికించిన బాలు.. రోహిణి ప్లాన్ ఫెయిల్

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో మనోజ్ పైకి బాడీగార్డ్ లు అందరూ కలిసి దండయాత్ర చేస్తారు. దీనికి బాలుయే కారణమని ఇంటికెళ్లి గొడవ పెట్టుకున్న అతనికి మరింత షాక్ తగులుతుంది. అటు రోహిణి ప్లాన్ అట్టర్ ఫ్లాపవుతుంది.

Mar 12, 2026, 08:00:31 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో మనోజ్, రోహిణి ప్లాన్ ఎదురు తిరుగుతుంది. బాలు పేరు చెప్పి ఈ నెల డబ్బులు ఎగ్గొట్టాలని చూసిన మనోజ్ కు.. బాలు దగ్గర ఉన్న వీడియో తీసుకోవాలని చూసిన రోహిణికి షాక్ తగులుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్‌పైకి బాడీగార్డ్‌ల దండయాత్ర.. మరింత ఇరికించిన బాలు.. రోహిణి ప్లాన్ ఫెయిల్
Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్‌పైకి బాడీగార్డ్‌ల దండయాత్ర.. మరింత ఇరికించిన బాలు.. రోహిణి ప్లాన్ ఫెయిల్

రవిని ఇరికించిన శృతి.. క్లాస్ పీకిన ప్రభావతి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (మార్చి 12) ఎపిసోడ్ రవిని శృతి ఇరికించే సీన్ తో మొదలవుతుంది. రవి తన ఇంటికి వచ్చి ఏడ్చాడని, అంతేకాదు గిఫ్ట్ కూడా ఇచ్చాడని తన వేలికి ఉన్న డైమండ్ రింగ్ చూపిస్తుంది శృతి. అది చూసి ఇంట్లో వాళ్లందరూ షాక్ తింటారు. రవిని అదోలా చూస్తారు. ఆ తర్వాత ప్రభావతి రవిని పక్కకు తీసుకెళ్లి క్లాస్ పీకుతుంది.

ఇలా అలవాటు చేస్తే ప్రతిసారీ పుట్టింటికి వెళ్లి తనకు కావాల్సినవన్నీ సాధించుకుంటుంది అని చెబుతుంది. తనకు ఎప్పుడైనా ఇలా రింగు ఇచ్చావా అని కూడా రవిని అడుగుతుంది. అయినా తాను వద్దన్నా ఎందుకు వెళ్లావని అడిగితే.. మీనా వదిన చెప్పినందుకే వెళ్లానని అంటాడు.

మీనాపై ప్రభావతి ఫైర్.. బాలు, సత్యం సపోర్ట్

దీంతో మీనాను పిలిచి ప్రభావతి క్లాస్ పీకుతుంది. తాను వద్దంటే నువ్వెవరు రవికి చెప్పడానికి అని నిలదీస్తుంది. అత్తింటి గౌరవం నిలబెట్టడానికే ఈ పని చేశానని మీనా అంటుంది. ఆమెకు బాలు, సత్యం సపోర్ట్ చేస్తారు. నువ్వు చేయాల్సిన పని మీనా చేసినందుకు సంతోషించు అని సత్యం అంటాడు. బాలు ఎగతాళి చేస్తుంటే ప్రభావతి మండిపడుతుంది. నువ్వు వాడి పెళ్లాన్ని అంటే వాడు ఊరుకోడు కదా అంటూ సత్యం కూడా బాలుకి సపోర్ట్ చేస్తాడు.

రోహిణి కొత్త ప్లాన్.. బాలు తాగే పాలలో నిద్ర మాత్రలు

ఇటు బాలు దగ్గర ఉన్న వీడియోను తీసుకోవడానికి రోహిణి మరో ప్లాన్ చేస్తుంది. బాలు కోసం మీనా పాలు వేడి చేస్తుండగా.. పైన ఉన్న బట్టలు తీసుకురావాలని చెప్పి పంపిస్తుంది. తర్వాత పాలలో నిద్రమాత్రలు కలుపుతుంది. అవి తాగి బాలు పడుకుంటే ఫోన్ లో వీడియో కొట్టేయొచ్చని ప్లాన్ చేస్తుంది. మీనా వచ్చేలోపు పాలలో మాత్రలు కలిపి ఏమీ తెలియనట్లు వెళ్లిపోతుంది.

రోహిణి ప్లాన్ ఫెయిల్.. అడ్డుపడిన ప్రభావతి, మనోజ్

ఆ పాలను బాలుకి ఇస్తుంది మీనా. వాటిని బాలు తాగేస్తాడు. దీంతో తన ప్లాన్ వర్కౌట్ అవుతుందని రోహిణి సంతోషిస్తుంది. బాలు, మీనా పడుకోగానే అతని ఫోన్ తీసుకోవడానికి రోహిణి వస్తుంది. అప్పుడే వెనుక నుంచి ప్రభావతి వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతుంది.

తిన్నది అరగలేదని, అందుకే వాకింగ్ కు వచ్చానని చెబుతుంది. ఆమె వెళ్లిపోగానే ఫోన్ తీసుకోవడానికి వెళ్తుండగా ఈసారి మనోజ్ వచ్చి రోహిణిని ఎత్తుకొని వెళ్లి బెడ్ రూమ్ లో పడేస్తాడు. రొమాంటిక్ మూడ్ లోకి వెళ్తాడు. రోహిణి తన ప్లాన్ ఫెయిలైనందుకు ఫీలవుతుంది.

మీనా నవ్వుపై కామాక్షి ఆరా

మరోవైపు మీనా తనను చూసి ఎందుకు నవ్విందో అర్థం కాక ప్రభావతి ఉడుక్కుంటుంది. అదే విషయం కామాక్షికి చెప్పి నువ్వు ఆరా తీయాలంటూ మీనాకు ఫోన్ చేయిస్తుంది. అదే విషయం మీనాకు కామాక్షి అడుగుతుంది. ఆమె ఎందుకు నవ్వానో చెప్పడానికి వెళ్లి.. ఇప్పుడు వద్దులెండి అంటూ చెప్పకుండానే ఫోన్ పెట్టేస్తుంది. దీంతో ప్రభావతి మరింత ఉడుక్కుంటుంది.

మనోజ్‌ పైకి బాడీగార్డుల దండయాత్ర

ఇటు మనోజ్ బాడీగార్డ్ మళ్లీ షాప్‌కి వస్తాడు. అతని వెంట మరికొంత మంది బాడీగార్డులు వస్తారు. నువ్వు మళ్లీ ఎందుకు వచ్చావని మనోజ్ అతన్ని నిలదీస్తాడు. నువ్వు మావాడిని కొట్టావంట.. హాస్పిటల్లో చేరిస్తే రూ.50 వేలు ఖర్చయింది.. ఆ డబ్బు ఇవ్వు అని అందరూ మనోజ్ ను నిలదీస్తారు. కొట్టింది తాను కాదు.. తన తమ్ముడు అని మనోజ్ చెప్పినా వాళ్లు వినరు. దౌర్జన్యం చేస్తారు. డబ్బుల్లేవని అంటే షాపులో ఉన్న ఫర్నీచరు పట్టుకొని వెళ్తారు.

బాలుకి రూ.50 వేలు ఇవ్వనన్న మనోజ్

దీంతో మనోజ్ ఆవేశంతో ఊగిపోతూ ఇంటికి వస్తాడు. బాలు వల్ల తనకు ఈ నెల నష్టం జరిగిందని, అందుకే రూ.50 వేలు ఇవ్వనని అంటాడు. ఏం జరిగిందని అడిగితే.. షాపులో జరిగిన విషయం చెబుతాడు. అందులో తనకు సంబంధం ఏంటని బాలు వాదిస్తాడు. నిజంగానే అది బాలు వల్ల జరిగిన నష్టమే కదా అని ప్రభావతి, సత్యం కూడా అంటారు. తన దగ్గర డబ్బుల్లేవని మనోజ్ అంటాడు.

వడ్డీకి డబ్బులిచ్చిన విషయం చెప్పిన మనోజ్

డబ్బుల్లేకుండా విద్యకు రూ.3 వడ్డీకి రూ.లక్ష అప్పు ఇచ్చావా అని మనోజ్ ను బాలు ఇరికిస్తాడు. అది విని సత్యం, ప్రభావతి షాక్ తింటారు. నిజమేనా అని అడిగితే.. విద్య తల్లి పరిస్థితి చూసి ఆ పని చేసినట్లు మనోజ్ చెబుతాడు. సరే ఈ నెల రూ.50 వేలు ఇవ్వకపోతే వచ్చే నెల కలిపి రూ.లక్ష ఇవ్వాలని బాలు అంటాడు.

అదీ న్యాయమే అని సత్యం కూడా అంటాడు. అదే విషయాన్ని పేపర్ పై రాసి మనోజ్ సంతకం తీసుకుంటాడు బాలు. ప్రభావతి, సత్యం, మీనా సాక్షి సంతకాలు పెడతారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More