Gunde Ninda Gudi Gantalu Today Episode: విల్లాలో ప్రభావతి రాజసం.. మనోజ్ పరువు తీసిన న్యూమరాలజిస్ట్.. ఓనర్‌తో బాలు గొడవ

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 1 ఎపిసోడ్ లో విల్లాను చూసి ప్రభావతి నోరెళ్లబెడుతుంది. మరోవైపు నకిలీ ఓనర్ తో బాలు గొడవ పడగా.. ఇంటికి పేరు పెట్టడానికి వచ్చిన న్యూమరాలజిస్ట్ మనోజ్ పరువు తీస్తాడు.

Published on: May 1, 2026, 07:43:50 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మనోజ్ అండ్ ఫ్యామిలీ కొత్త విల్లాలో అడుగుపెడతారు. రెండు రోజులు ఉండి చూడటానికి వెళ్లి.. నకిలీ ఓనర్ కు రూ.30 లక్షల అడ్వాన్స్ ఇస్తాడు మనోజ్. అదే ఓనర్ తో బాలు గొడవ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Gunde Ninda Gudi Gantalu Today Episode: విల్లాలో ప్రభావతి రాజసం.. మనోజ్ పరువు తీసిన న్యూమరాలజిస్ట్.. ఓనర్‌తో బాలు గొడవ
Gunde Ninda Gudi Gantalu Today Episode: విల్లాలో ప్రభావతి రాజసం.. మనోజ్ పరువు తీసిన న్యూమరాలజిస్ట్.. ఓనర్‌తో బాలు గొడవ

మీనా ఆర్డర్ దక్కించుకున్న చింతామణి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (మే 1) ఎపిసోడ్ మీనాకు చింతామణి షాకిచ్చే సీన్ తో మొదలవుతుంది. మీనాకు రావాల్సిన ఆర్డర్ ను తక్కువకే కోట్ చేసి తాను దక్కించుకుంటుంది. చింతామణితో జాగ్రత్త అని, ఆమె ఈ ఏరియాలో ఏ కొత్త వాళ్లు వచ్చినా ఏ ఆర్డర్ దక్కకుండా చేస్తుందని ఓ వ్యక్తి మీనాకు చెబుతుంది. అది విని మీనా బాధపడుతుంది.

విల్లా చూడటానికి రెడీ అయిన ప్రభావతి అండ్ ఫ్యామిలీ

మరోవైపు కొత్త విల్లా చూడటానికి ప్రభావతి అండ్ ఫ్యామిలీ రెడీ అవుతుంది. రెండు రోజులు అక్కడ ఉండటానికి బట్టలు సర్దుకుంటారు. ప్రభావతి కాళ్లు నేలపై ఉండవు. తాను ఏ చీర కట్టుకోవాలో రోహిణితో సెలెక్ట్ చేయించుకుంటుంది. అటు రోహిణి, మనోజ్ కూడా బట్టలు సర్దుకుంటారు. మీనా దగ్గరకు వచ్చిన ప్రభావతి కిచెన్ క్లీన్ చేసి పెట్టాలని, రెండు రోజులు లేకపోతే పాడవుతుందని ఆర్డర్ వేస్తుంది.

చింతామణి గురించి బాలుకి చెప్పిన మీనా

అదే సమయంలో బాలు ఇంటికి వస్తాడు. అందరూ బట్టలు సర్దుకుంటుంటే నువ్వు మాత్రం పూలు కుడుతున్నావేంటి అని మీనాను అడుగుతాడు. అప్పుడే చింతామణి గురించి మీనా చెబుతుంది. వ్యాపారంలో ఇలాంటివి సహజమే.. ఏం కాదులే అని అతడు ధైర్యం చెబుతాడు.

విల్లా చూసి నోరెళ్లబెట్టిన ప్రభావతి.. అడ్వాన్స్ ఇచ్చిన మనోజ్

మరుసటి రోజు ఉదయం అందరూ కలిసి విల్లా చూడటానికి వెళ్తారు. దానిని చూడగానే ప్రభావతి నోరెళ్లబెడుతుంది. ఎంత పెద్ద విల్లానో అని అంటుంది. ఓనర్ వచ్చి వాళ్లను ఇంట్లోకి తీసుకెళ్తాడు. లోపల కూడా చూసి ప్రభావతి మరింత ఆశ్చర్యపోతుంది.

మరోవైపు అడ్వాన్స్ ఇచ్చిన డాక్యుమెంట్లపై సంతకాలు పెట్టాలని ఓనర్ అడుగుతాడు. మనోజ్ తాను తెచ్చిన మిగిలిన రూ.25 లక్షలు ఇస్తాడు. వాటిని కనీసం లెక్కపెట్టుకోకుండా ఓనర్ తీసుకుంటాడు. అది చూసి రవి, శృతిలో అనుమానం కలుగుతుంది. అసలు వీళ్లు నిజంగా ఓనర్లేనా అని అనుకుంటారు.

ఆ నకిలీ డాక్యుమెంట్లు, తాళాలు మనోజ్ కు ఇచ్చి ఆ నకిలీ ఓనర్లు బయటకు వస్తారు. అందరూ మేకల మందలా ఉన్నారు.. ఒక్కరికి కూడా అనుమానం రాలేదు అని వాళ్లు సంబరపడిపోతారు.

నకిలీ ఓనర్లతో బాలు, మీనా ఫైట్

కారు తీసుకొని పారిపోతుండగా.. అప్పుడే బాలు, మీనా కారులో వస్తారు. తమ కారును గుద్దడానికి రావడంతో బాలు ఆవేశంగా కిందికి దిగి డ్రైవర్ తో గొడవ పడతాడు. ఆ తర్వాత ఆ నకిలీ ఓనర్ దంపతులు కూడా దిగుతారు. వాళ్లతోనూ బాలు గొడవ పడతాడు. మీనా కూడా అతనికి తోడవుతుంది.

అది చూసిన మనోజ్, రవి వెంటనే వెళ్లి బాలుని తీసుకొస్తాడు. ఓనర్ తో గొడవ పడతావేంటి అని మనోజ్ అంటే.. వాడు ఓనర్ ఏంటి? ఇంత పెద్ది విల్లా ఓనర్ ట్యాక్సీలో ఎందుకు వెళ్తాడు.. నాకు ఏదో డౌట్ కొడుతోంది అని బాలు అంటాడు. మనోజ్ పట్టించుకోకుండా వెళ్లిపోతాడు.

విల్లాలో ప్రభావతి రాజసం

అటు విల్లాలో ప్రభావతి రాణిలా ఫీలవుతూ అంతా తిరిగి చూస్తుంది. సోఫాపై కాలు మీద కాలు వేసుకొని కూర్చొంటుంది. కాఫీ తీసుకురావాలని మీనాకు ఆర్డర్ వేస్తుంది. ఆమె వచ్చి పాలు విరిగిపోయాయని చెబుతుంది.

మరోవైపు విల్లాకు పేరు పెట్టడానికి తాను న్యూమరాలజిస్ట్ ను పిలిచానని మనోజ్ అంటాడు. సంఖ్యా శాస్త్రం ప్రకారం అతడు మంచి పేరు పెడతాడని మనోజ్ అంటాడు. బాలు తనదైన స్టైల్లో అతనికి పంచ్ లు వేస్తాడు.

మనోజ్, రోహిణి పరువు తీసిన న్యూమరాలజిస్ట్

మొత్తానికి ఆర్ముగం అనే ఆ న్యూమరాలజిస్ట్ అక్కడికి వస్తాడు. ఇంటి ఓనర్ ఎవరు అని అడిగితే.. నేనే, నా పేరు మనోజ్ అని అంటాడు. నువ్వో సున్నా కదా అని పరువు తీస్తాడు. నీ భార్య ఎవరు అని అడిగితే రోహిణి పేరు చెబుతాడు. ఆమె అరసున్నా.. సున్నా పక్కన అరసున్నా ఏం లాభం అని ఇద్దరి పరువు తీస్తాడు.

చివరికి ప్రభావతి పేరు చెబితే.. ఏవో లెక్కలేసి బాగుంది అని చెబుతాడు. చివరికి మనోజ్, రోహిణి, ప్రభావతి పేర్లు కలిసి వచ్చేలా రోమతి అని పేరు పెడతాడు. అది విని అందరూ ఆశ్చర్యపోతారు. మనోజ్, రోహిణి మాత్రం సరే అంటారు. ఆ పేరు పెట్టినందుకు రూ.20 వేలు ఇవ్వాలనడంతో షాక్ తింటారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More