గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మనోజ్ గాడి కక్కుర్తి.. మళ్లీ తప్పించుకున్న విల్లా విజయ్.. చేపలు అమ్ముతూ దొరికి..
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 21 ఎపిసోడ్ లో మనోజ్ కక్కుర్తి వల్ల విల్లా విజయ్ దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. దీంతో బాలు, మీనా పడిన శ్రమ వృథా అవుతుంది.
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో బాలు, మీనా కలిసి మనోజ్ ను ముంచిన ఆ విల్లా విజయ్ ను పట్టుకుంటారు. కానీ అదే మనోజ్ రూ.30 కోసం పడే కక్కుర్తి వల్ల అతడు మళ్లీ తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

మళ్లీ మాటలతో మనోజ్‌ను బోల్తా కొట్టించిన రోహిణి
గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (మే 21) ఎపిసోడ్ రోహిణిని ఆమె తండ్రి గురించి మనోజ్ నిలదీసే సీన్ తో మొదలవుతుంది. అసలు మీ నాన్న మలేషియాలో పెద్ది బిజినెస్ మ్యానా.. చాలా వ్యాపారాలు ఉన్నాయా అని అడుగుతాడు. ఇది నీ సందేహం కాదు ఎవరో అడిగిస్తున్నారు అని రోహిణి అనడంతో అవును బాలు గాడు అడిగాడు అని అంటాడు. అంతేకాదు నువ్వు గుణ అనే వ్యక్తి దగ్గర అప్పు చేస్తున్నావా అని కూడా నిలదీస్తాడు.
దీంతో మొదట నీళ్లు నమిలిన రోహిణి.. తర్వాత తనదైన స్టైల్లో మనోజ్ పై విరుచుకుపడుతుంది. పెళ్లికి ముందు అసలు అప్పులే చేయలేదు.. నిన్ను చేసుకున్నాకే నీకు ఉద్యోగం లేక చేయాల్సి వచ్చింది.. అయినా ఎవరో చెప్పిన మాటలు నమ్మి నన్నే అనుమానిస్తావా.. ఆ గుణ మీరు అనుకున్నంత పెద్ద రౌడీ కాదు.. అంటూ మాయ మాటలు చెప్పి, కాస్త కన్నీళ్లు కార్చి మనోజ్ ను బుట్టలో వేసుకుంటుంది.
విల్లా విజయ్ గురించి తెలుసుకోమని బాలుని అడిగిన సత్యం
అటు పోయిన డబ్బుల గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టకపోవడంతో బాలు దగ్గరికి వస్తాడు సత్యం. ఆ మనోజ్ గాడికి పోగొట్టుకోవడమే తప్ప తిరిగి సంపాదించడం చేతకాదని, నువ్వే ఆ విల్లా విజయ్ ను పట్టుకోవాలని బాలుతో అంటాడు. తానూ అదే పనిలో ఉన్నానని బాలు చెబుతాడు. ఆ తర్వాత మీనాతో ఆ టీవీ ఆర్టిస్టు ఇంటికి వెళ్దామని అంటాడు. ఆమె సరే అంటుంది.
టీవీ ఆర్టిస్టును కలిసి విల్లా విజయ్ గురించి అడిగిన బాలు, మీనా
మరుసటి రోజు బాలు, మీనా కలిసి ఆ టీవీ ఆర్టిస్టు ఇంటికి వెళ్తారు. అతనితో మొదట సెల్ఫీ దిగుతారు. బాలుని పరిచయం చేసిన మీనా.. తర్వాత విల్లా విజయ్ గురించి ఆరా తీస్తుంది. వాడు మోసగాడిలో ఉన్నాడనే తాను విల్లా కొనలేదని, అతన్ని ధవళేశ్వరం షూటింగ్ కు వెళ్లినప్పుడు కలిశానని, తనతో ఫొటో కూడా దిగాడని అతడు చెబుతాడు. వాడు తన అన్నని రూ.30 లక్షలు ముంచాడని, వాడిని పట్టుకుంటానని బాలు అంటాడు.
చింతామణికి షాకిచ్చిన టీవీ ఆర్టిస్ట్
అప్పుడే చింతామణి అక్కడికి వస్తుంది. పెళ్లి మండపం డెకరేషన్ మీరు చూసుకోండి.. మిగతావన్నీ మీనా చూసుకుంటుందని అతడు చింతామణికి చెబుతాడు. కానీ ఆమె చాలా అహంకారంగా మాట్లాడుతుంది. మీనాను తీసిపారేస్తుంది. మరొకరితో పంచుకోనని అంటుంది. అలా అయితే మొత్తం కాంట్రాక్ట్ మీనాకే ఇస్తానని అనడంతో దిగి వచ్చి అంగీకరిస్తుంది.
తర్వాత బాలు, మీనా బయటకు వస్తుండగా.. అతని ముందే చింతామణి మరోసారి రెచ్చిపోతుంది. మీనా కూడా ఏమాత్రం తగ్గకుండా ఆమెకు గట్టిగా గడ్డి పెడుతుంది. దీంతో చింతామణి నోరు మూతపడుతుంది.
విల్లా విజయ్‌ను వెతుక్కుంటూ వెళ్లిన బాలు, మీనా
విల్లా విజయ్ అడ్రెస్ తెలిసింది కాబట్టి వెళ్లి వెతుకుదామని, అలాగే ఓ లాంగ్ డ్రైవ్ కూడా చేసినట్లు ఉంటుందని మీనాతో అంటాడు బాలు. మొదట వద్దన్నా తర్వాత మీనా కూడా వెళ్తుంది. ఇద్దరూ కలిసి ధవళేశ్వరం వెళ్తారు. అతని ఫొటోగానీ, ఇతర వివరాలు తెలియకపోవడంతో అక్కడ కనిపించిన వాళ్లందరినీ విల్లా విజయ్ అంటూ అడుగుతారు. కానీ ఎవరూ తెలియదని అంటారు.
చేపలు అమ్ముతూ దొరికిపోయిన విల్లా విజయ్
చివరికి అతడు చేపలు అమ్ముతూ ఉంటాడు. మనోజ్ దగ్గర కొట్టేసిన డబ్బుతో అతని భార్య ఒంటి నిండా బంగారంతో మెరిసిపోతూ ఉంటుంది. అప్పుడే మీనా అతన్ని చూస్తుంది. బాలుకి చెబుతుంది. మీరు వెతుకుతున్నది వీడినా.. వాడు విల్లా విజయ్ ఏంటి.. చేపలమ్మే చలపతి అని అక్కడి వాళ్లు చెబుతారు. అప్పుడే బాలు వాడి దగ్గరికి వెళ్లి అతన్ని చితకబాదుతాడు. ఆ రూ.30 లక్షలు ఎక్కడ అని నిలదీస్తాడు. ఏం జరిగిందని అక్కడి వాళ్లు అడిగితే.. వాళ్లు చేసిన మోసం గురించి చెబుతాడు.
మనోజ్ కక్కుర్తి.. తప్పించుకున్న విజయ్
అప్పుడే బాలుకి మనోజ్ ఫోన్ చేస్తాడు. మొదట తీయకపోతే మరోసారి చేస్తాడు. దీంతో బాలు ఫోన్ ఎత్తి అతనితో మాట్లాడుతుంటాడు. నీ ఫ్రెండ్ నా షాప్‌కి వచ్చి రూ.30 బాకీ పెట్టి ఓ ఐరన్ బాక్స్ తీసుకెళ్లాడు.. వాడి ఫోన్ నంబర్ ఇవ్వు అని అడుగుతాడు. ఓవైపు బాలు మాట్లాడుతుండగా.. ఇటు ఆ విజయ్, అతని భార్య మెల్లగా తప్పించుకుంటారు.
దీంతో బాలుకి ఆవేశం తన్నుకొస్తుంది. మనోజ్ ను బూతులు తిట్టి పెట్టేస్తాడు. రూ.30 కోసం కక్కుర్తి పడి రూ.30 లక్షలు పోగొట్టుకున్నాడు.. వీడు బాగుపడటం ఆ ప్రకృతికి కూడా ఇష్టం లేనట్లుంది అని మీనాతో బాలు అంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


