గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: గుణతో కలిసి రోహిణి మరో ప్లాన్.. శివను గుణ గ్యాంగ్‌లోకి పంపిన బాలు..
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 22 ఎపిసోడ్ లో గుణతో కలిసి రోహిణి మరో ప్లాన్ వేస్తుంది. అయితే ఆ వీడియో గుట్టు రట్టు చేయడానికి మరోసారి శివను గుణ గ్యాంగ్ లోకి పంపేలా చేస్తాడు బాలు.
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, మీనా, రోహిణి ఎత్తులకు పైఎత్తులతో గుండె నిండా గుడి గంటలు సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. ఎపిసోడ్ కో ట్విస్ట్ ఆసక్తి రేపుతోంది. లేటెస్ట్ ఎపిసోడ్ లో ఆ రూర.30 లక్షలు కొట్టేసినవాడిని పట్టుకోవడానికి గుణతో రోహిణి చేతులు కలపగా.. ఆ వీడియో లీక్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకునే పనిలో బాలు ఉంటాడు.

మణికంఠను దారుణంగా అవమానించిన ప్రభావతి
గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (మే 22) ఎపిసోడ్ మనోజ్ ఫ్రెండ్ మణికంఠను ప్రభావతి దారుణంగా అవమానించే సీన్ తో మొదలవుతుంది. మణికంఠను తీసుకొని మనోజ్ ఇంటికి వస్తాడు. అతన్ని చూడగానే.. గేటు మూసి వచ్చావా.. అడ్డమైన కుక్కలు ఇంట్లోకి వస్తున్నాయంటూ ప్రభావతి దారుణంగా మాట్లాడుతుంది. నీ వల్లే రూ.30 లక్షలు మునిగామని నిందిస్తుంది. దీంతో అతని కోసం వెతుకుతున్నామని మణికంఠ అంటాడు.
మనోజ్ గాడి కక్కుర్తి గురించి చెప్పిన బాలు
అప్పుడే బాలు, మీనా ఇంటికి వస్తారు. వంట చేయకుండా ఎక్కడికి వెళ్లావంటూ మీనాను ప్రభావతి నిలదీస్తుంది. దీంతో మనోజ్ గాడి 30 రూపాయల కక్కుర్తి గురించి చెబుతారు. ఆ విల్లా విజయ్ గాడిని పట్టుకున్నామని, కానీ సమయానికి వీడు ఫోన్ చేయడంతో వాడు తప్పించుకున్నాడని అంటారు. మా పనులు మానుకొని, ఎండలో తిరిగి వాడిని పట్టుకుంటే వీడు మరోసారి మొత్తం చెడగొట్టాడని, వీడి దరిద్రం అలా ఉందని బాలు అంటాడు.
నోటికొచ్చినట్లు మాట్లాడిన రోహిణి
దీంతో రోహిణి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. వాడిని పట్టుకోవడంలో మీ సాయం అవసరం లేదు.. మేమే పట్టుకుంటాం.. మీ పనులు మీరు చూసుకోండి.. మీ పనులు మానుకొని ఆ పని చేయాల్సిన అవసరం లేదని అంటుంది. ఆ పని కోసం మరొకరిని ఏర్పాటు చేశాననీ చెబుతుంది. మనోజ్ చెప్పినా వినదు. రోహిణి మరోసారి నోటికి పని చెప్పడంతో మీనా కూడా అదే స్థాయిలో ఆమెపై విరుచుకుపడుతుంది.
మరి మీ ఆయన రూ.40 లక్షలు మింగినప్పుడు ఈ బుద్ధి ఏమైందని అంటుంది. బాలు కూడా సత్యంతో.. నువ్వు చెబితేనే ఈ పని చేశానని, పార్లరమ్మ ఎలా మాట్లాడుతుందో చూశావా అని అంటాడు. ఇక ఇక్కడితో మనకు సంబంధం లేదని, ఇన్ని మోసాలు చేసిన వాళ్లతో ఇలాంటి మాటలు పడాల్సిన అవసరం లేదని మీనా కూడా గట్టిగానే చెబుతుంది. సత్యం కూడా సరే అంటూ.. వాడు దొరకగానే ఆ రూ.30 లక్షల గురించి నాకు కచ్చితంగా చెప్పాల్సిందే అని మనోజ్ కు వార్నింగ్ ఇస్తాడు.
రోహిణిపై బాలు, మీనా అనుమానం
అయితే రోహిణిపై బాలు, మీనాలకు అనుమానం మొదలవుతుంది. తాము సాయం చేస్తామన్నా ఎందుకు వద్దంటోంది.. ఈ రూ.30 లక్షలు కూడా దొరికిన తర్వాత మనకు చెప్పకుండా మాయం చేస్తుందా అని సందేహిస్తారు. కానీ అన్ని మాటలు అన్న తర్వాత ఇక ఆ విషయం గురించి మనం వదిలేద్దామని బాలుతో స్పష్టం చేస్తుంది మీనా.
విద్యకు రోహిణి ప్లాన్
అటు విద్య దగ్గరికి వెళ్తుంది రోహిణి. ఆ విల్లా విజయ్ ను పట్టుకోవడానికి తన ప్లాన్ చెబుతుంది. వాడిని తొలిసారి గుడిలో కలిసినప్పుడు అక్కడ సీసీటీవీలో వాడి ముఖం కనిపిస్తుందని, దాని ద్వారా వాడిని పట్టుకోవచ్చని అంటుంది. ఈ ఐడియా ఎవరు ఇచ్చారని విద్య అడిగితే.. బాలు, మీనా ఇచ్చారని చెబుతుంది. ఈ పని గుణకు అప్పగించాలని అనుకుంటున్నట్లు కూడా విద్యతో రోహిణి అంటుంది. ప్రతిసారీ వాడితో ఎందుకే అని విద్య వారిస్తున్నా వినదు.
చింతామణితో జాగ్రత్త అని మీనాకు చెప్పిన బాలు
ఇటు రాత్రి మీనాతో బాలు సరసాలు ఆడుతుంటాడు. తన భార్య కోసం పది మూరల మల్లెపూలు కావాలంటాడు. అలా మాట్లాడుతూ మీనాకు వచ్చిన పెద్ద ఆర్డర్ గురించి కూడా ప్లాన్ చేస్తారు. అదే సమయంలో ఆ చింతామణితో జాగ్రత్తగా ఉండాలని కూడా మీనాకు బాలు చెబుతాడు. ఆ విషయం మా ఆయన చూసుకుంటాడని మీనా అంటుంది.
గుణ గ్యాంగ్‌లోకి శివ
మరుసటి రోజు శివను కలుస్తారు బాలు, మీనా. అసలు అతని దొంగతనం వీడియో ఎలా లీక్ అయిందో తెలుసుకోవాలని అనుకుంటారు. ఆ గుణనే ఈ పని చేసి ఉంటాడని మీనా అంటే.. అందులో సందేహం లేదని, కానీ తన ఫోన్ లోని వీడియో అతనికి దగ్గరికి ఎలా వెళ్లిందో తెలియాలని బాలు అంటాడు. ఎవరో తెలిసిన వాళ్లే ఈ పని చేసి ఉంటారని శివ చెబుతాడు.
ఆ గుణ గ్యాంగ్ లోని వాళ్లు ఎవరైనా టచ్ లో ఉన్నారా అని బాలు అడుగుతాడు. ఇప్పుడు తాను దూరంగా ఉంటున్నానని అంటే.. ఎలాగైనా వాళ్లతో కలిసి ఈ విషయం రాబట్టాలని బాలు చెబుతాడు. మళ్లీ గుణ దగ్గరికి వద్దని మీనా వారిస్తున్నా.. శివ కూడా ఆమెకు ధైర్యం చెప్పి తాను మళ్లీ ఆ పాత రోజుల్లోకి వెళ్లనని, ఈ విషయం మాత్రం తెలుసుకుంటానని హామీ ఇస్తాడు.
మళ్లీ గుణను కలిసిన రోహిణి, విద్య
ఇటు రోహిణి, విద్య మరోసారి గుణను కలుస్తారు. ఎందుకు పిలిచారని అతడు అడుగుతాడు. విల్లా విషయంలో జరిగిన మోసం గురించి రోహిణి చెబుతుంది. అతన్ని పట్టుకోవడంలో సాయం చేయాలని, గుడిలోని సీసీటీవీ ఫుటేజీ కావాలని అడుగుతుంది. మీకు కావాల్సిన సాయం చేస్తాను కానీ.. వచ్చిన డబ్బులో 2 శాతం అంటే రూ.60 వేలు ఇవ్వాలని గుణ అంటాడు. రోహిణి సరే అంటుంది. ఇక తాను ఆ పనిలో ఉంటానని గుణ వెళ్లిపోతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


