Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మనోజ్, రోహిణి అండ్ ఫ్యామిలీని విల్లా నుంచి తరిమేస్తాడు అసలు ఓనర్. దీంతో మరోసారి తాను రూ.30 లక్షలు మోసపోయానని మనోజ్ తెలుసుకుంటాడు. అదే అదునుగా బాలు, సత్యం అతనితో ఆడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
విల్లా, మనోజ్ గురించి తెగ పొగిడేసిన ప్రభావతి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (మే 6) ఎపిసోడ్ ప్రభావతి, సత్యం మార్నింగ్ వాక్ చేసే సీన్ తో మొదలవుతుంది. ఆ సమయంలో విల్లా గురించి, మనోజ్ గురించి గొప్పగా మాట్లాడుతుంది ప్రభావతి. తమ సొంతింటి గురించి తక్కువ చేసి చూస్తుంది. సత్యం అలా మాట్లాడొద్దని చెప్పినా వినదు. మనోజ్ ఎంతో గొప్పవాడని అంటుంది. అది విన్న సత్యం.. నువ్వు వాడిని పొగిడినప్పుడల్లా తనకు భయం వేస్తుందని అంటాడు.
ఓనర్‌కు అసలు నిజం చెప్పేసిన కొబ్బరి బోండాం అమ్మే వ్యక్తి
ఆ తర్వాత ఇద్దరూ కొబ్బరి బోండాం తాగుదామని వెళ్తారు. ఈ ఏరియాలో మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే అని అతడు అంటాడు. కొత్తగా వచ్చామని, వీధి చివరన ఉన్న విల్లా కొన్నామని సత్యం చెబుతాడు. రూ.3 కోట్లు పెట్టి కొన్నామని ప్రభావతి గొప్పగా చెప్పుకుంటుంది. అది విని కొబ్బరి బోండా అమ్మే వ్యక్తి అయోమయానికి గురవుతాడు. ఏదైనా సమస్యా అని సత్యం అడుగుతాడు. ఏమీ లేదని అతడు అంటాడు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత అసలు ఓనర్ కు ఫోన్ చేసి విషయం చెబుతాడు.
రిజిస్ట్రేషన్ ఆఫీసులో కల్పన.. మనోజ్, రోహిణి కూడా..
ఇటు కల్పనను బాలు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు తీసుకెళ్తాడు. తాను పని చూసుకొని వస్తానని ఆమె లోనికి వెళ్తుంది. ఆ వెంటనే మనోజ్, రోహిణి కూడా ఆఫీసుకు వస్తారు. వాళ్ల వెంట మణికంఠ కూడా ఉంటాడు. అప్పుడే అతడు బాలుని చూస్తాడు. విల్లా రిజిస్ట్రేషన్ ఛార్జీల గురించి అడుగుదామని వచ్చినట్లు వాళ్లు చెబుతారు. తర్వాత లోనికి వెళ్తారు. అక్కడ కల్పన.. మనోజ్, రోహిణిలను చూస్తుంది. వెంటనే చిరాకు పడుతూ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంది.
మనోజ్‌ను చూసి వెళ్లిపోయిన కల్పన.. బాలు, మీనాకి గిఫ్ట్
{{/usCountry}}ఇటు కల్పనను బాలు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు తీసుకెళ్తాడు. తాను పని చూసుకొని వస్తానని ఆమె లోనికి వెళ్తుంది. ఆ వెంటనే మనోజ్, రోహిణి కూడా ఆఫీసుకు వస్తారు. వాళ్ల వెంట మణికంఠ కూడా ఉంటాడు. అప్పుడే అతడు బాలుని చూస్తాడు. విల్లా రిజిస్ట్రేషన్ ఛార్జీల గురించి అడుగుదామని వచ్చినట్లు వాళ్లు చెబుతారు. తర్వాత లోనికి వెళ్తారు. అక్కడ కల్పన.. మనోజ్, రోహిణిలను చూస్తుంది. వెంటనే చిరాకు పడుతూ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంది.
మనోజ్‌ను చూసి వెళ్లిపోయిన కల్పన.. బాలు, మీనాకి గిఫ్ట్
{{/usCountry}}బయటకు వచ్చిన తర్వాత బాలుని కారు తీయమని అంటుంది. త్వరగా వచ్చేశారేంటి అని బాలు అడిగితే.. అక్కడ కొన్ని చూడకూడని ముఖాలు చూశానని చెబుతుంది. తర్వాత ఆమెను ఇంటికి తీసుకెళ్తాడు బాలు. అప్పుడు తాను విదేశాల నుంచి తీసుకొచ్చిన కూలింగ్ గ్లాస్ లను బాలుకి ఇస్తుంది కల్పన. మీ ఆవిడకు కూడా తీసుకొచ్చానని మీనా కోసం కూడా ఇస్తుంది. అవి చూస్తే అంత ఖరీదైనవి ఎందుకని మా ఆవిడ తిడుతుందని, మీరు గిఫ్ట్ గా ఇచ్చినట్లు ఓ సెల్ఫీ తీసుకుంటానని కల్పనతో బాలు సెల్ఫీ తీసుకుంటాడు.
మనోజ్, రోహిణికి దిమ్మదిరిగే షాకిచ్చిన ఓనర్..
ఇటు విల్లా బయట నేమ్ ప్లేట్ ఆర్డర్ గురించి మనోజ్, రోహిణి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అసలు ఓనర్ వస్తాడు. పోలీసులకు ఫోన్ చేసి తమ ఇంటిని ఎవరో కబ్జా చేశారని, వెంటనే వచ్చి ఖాళీ చేయించాలని చెబుతాడు. ఆ ఓనర్ ను చూసి మనోజ్, రోహిణి మొదట నేమ్ ప్లేట్ తీసుకు వచ్చిన వ్యక్తి అనుకుంటారు.
ఆ తర్వాత అతడే అసలు ఓనర్ అని తెలుసుకొని షాక్ తింటారు. మీకు ఇల్లు అమ్మిన వ్యక్తి ఈ ఇంట్లో అద్దెకు ఉండేవాడని, తనకు రెండు నెలలుగా అద్దె ఇవ్వలేదని చెబుతాడు. తమకు ముందు నుంచీ డౌట్ గానే ఉందని బాలు, రవి అంటారు. ఆ మాట విని మనోజ్, రోహిణి షాక్ తింటారు.
పోలీసులను పిలిచి ఇల్లు ఖాళీ చేయించిన ఓనర్
ఇక మీ డబ్బులు మీకు తిరిగి రావని, వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని ఓనర్ స్పష్టం చేస్తాడు. దీంతో రోహిణి కళ్లు తిరిగి పడిపోయినంత పని చేస్తుంది. వాళ్లతో గొడవ పడే బదులు వెంటనే వెళ్లిపోదాం అని మీనా అంటుంది. రూ.30 లక్షలు మునిగామని మనోజ్, రోహిణి బాధపడతారు. అందరూ కలిసి బాధతో విల్లా నుంచి బయటకు వెళ్తారు.
మనోజ్, ప్రభావతి పరువు తీసిన బాలు
తమ ఇంటికి తిరిగి రాగానే మనోజ్ పరువు తీస్తాడు బాలు. ఇంత చిన్న ఇంట్లో మీరు ఉండగలా.. మీ విల్లా కిచెనే ఈ ఇల్లంత ఉంటుంది కదా అని దెప్పిపొడుస్తాడు. అటు ప్రభావతి, రోహిణిలతోనూ ఆడుకుంటాడు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత మనోజ్ కు సత్యం క్లాస్ పీకుతాడు. మమ్మల్ని నిండా ముంచడానికే పుట్టావు కదరా అని మండిపడతాడు. ఆశకుపోయి లక్షలకు లక్షలు తగిలేస్తున్నావని తిడతాడు. అంతటితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.