Gunde Ninda Gudi Gantalu Today Episode: అరుణ్‌ను చితగ్గొట్టిన బాలు.. సుమతి పెళ్లికి నో.. రవికి నీతూ షాక్.. కరిగిన నగావతి
Gunde Ninda Gudi Gantalu Serial November 6th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 6 ఎపిసోడ్ లో సుమతి లవర్ అరుణే అని తెలుసుకొని అతన్ని బాలు కొడతాడు. అటు రెస్టారెంట్ లో రవి, శృతికి నీతూ పెద్ద షాకే ఇస్తుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. రోహిణి ఇచ్చిన నగ చూసి కరిగిపోయిన నగావతితోపాటు రవి, శృతికి రెస్టారెంట్ లో షాక్ తగలడం, చివరికి అటు సుమతి లవర్ అరుణ్ అని తెలుసుకొని అతన్ని బాలు కొట్టే వరకు రసవత్తరంగా సాగిపోయింది.

రోహిణికి గుణ దొంగ చెయిన్.. విద్యకు ఫోన్
రోహిణికి గుణ ఓ బంగారు చెయిన్ ఇచ్చే సీన్ తో సీరియల్ శుక్రవారం (నవంబర్ 6) ఎపిసోడ్ మొదలైంది. మార్కెట్ లో 3 లక్షల విలువ చేసే చెయిన్ లక్షకే నీకు ఇస్తున్నానని గుణ అంటాడు. మొదట ఆలోచించిన రోహిణి కాస్త టైమ్ తీసుకొని బయటకు వెళ్లి విద్యకు ఫోన్ చేస్తుంది. తనకు అర్జెంటుగా లక్ష కావాలని అడుగుతుంది.
తన దగ్గర వంద కూడా లేవని విద్య చెప్పడంతో నీ కాబోయే భర్త మురళిని అడగమని అంటుంది. మొదట విద్య నో చెప్పినా రోహిణి ఇదే తొలి, చివరిసారి అని బతిమాలడంతో సరే అంటుంది. మురళీని అడిగి డబ్బు సర్దుబాటు చేస్తానని, ఇంతకీ దేనికి అని విద్య అడిగితే.. అది సర్ప్రైజ్ అని, మా అత్తను దారికి తెచ్చుకునే ఐడియా దొరికిందని రోహిణి చెబుతుంది.
ప్రభావతికి చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన రోహిణి
ఇటు ఇంట్లో రోహిణి కనిపించకపోవడంతో ఆమె ఎక్కడ అని శృతిని అడుగుతాడు మనోజ్. కానీ ఆమె మాత్రం బాలు స్టైల్లో అతనికి దిమ్మదిరిగే సమాధానం ఇవ్వడంతో షాకవుతాడు. తల్లి దగ్గరికి వెళ్లి అడిగితే ఎవరిని మోసం చేయడానికి వెళ్లిందో అని అంటుంది. ఇంతలో రోహిణి వస్తుంది. తాను తెచ్చిన చెయిన్ ను తీసి అత్తకు ఇస్తుంది.
ఓ గోల్డ్ స్కీమ్ లో నెలనెలా డబ్బు కట్టానని, ఇప్పుడీ చెయిన్ ఇచ్చారంటూ గుణ ఇచ్చిన చెయిన్ ప్రభావతికి ఇస్తుంది. అది చూడగానే ఆమె ముఖం వెలిగిపోయినా రోహిణి ముందు బయటపడకుండా కవర్ చేసుకుంటుంది. ప్రభావతి ఆ చెయిన్ తీసుకుంటుందా లేదా అన్నదానిపై రవి, శృతి బెట్ కూడా వేస్తారు. తీసుకోదని రవి, తీసుకుంటుందని శృతి అనుకుంటారు.
బంగారంతో కొనలేవంటూ ముఖాన కొట్టిన ప్రభావతి
చెయిన్ పై ఆశ ఉన్నా ప్రభావతి మాత్రం తనకు అవసరం లేదంటూ తిరిగి రోహిణికి ఇచ్చేస్తుంది. తనకు బంగారంపై మోజు లేదని, ఇది వద్దని అనడంతో రోహిణి షాకవుతుంది. అది విన్న బాలు కూడా అది నిజమో కలో తేల్చుకోలేకపోతాడు. నగావతి చెయిన్ వద్దనడం ఏంటి.. వెంటనే టీవీ వాళ్లను తీసుకొస్తానని ఎగతాళి చేస్తాడు.
కానీ రోహిణి మాత్రం సెంటిమెంట్ తో కొడుతుంది. మా అమ్మ కోసం తెచ్చిన చెయిన్ ఇది.. మీరే నాకు అమ్మ తర్వాత అమ్మలాంటి వాళ్లు.. చూడగానే ఓ దేవతకు ఉండాల్సిన చెయిన్ లా అనిపించింది.. అందుకే మీకోసం తెచ్చాను.. వేసుకోవాలో వద్దో మీ ఇష్టం అని కింద పెడుతుంది. అటు మనోజ్ కూడా తల్లిని బతిమాలుతాడు. రోహిణి నీపై ప్రేమతో తీసుకొచ్చింది కదా.. తీసుకో అని అడుగుతాడు.
బాలు గల్లా పెట్టె.. మాట మార్చిన నగావతి
రూ.50 లక్షలు ముంచి ఇప్పుడు ఇలా లక్షలు పోసి నగలు తీసుకురావడం అవసరమా.. అది ఇల్లు ఖాతాలో జమ చేస్తే అయిపోయేది కదా అని బాలు అంటాడు. ఇది నెలనెలా కట్టిన సొమ్ముతో తీసుకొచ్చింది అని రోహిణి అంటుంది. అయినా బాలు మాత్రం వెంటనే వెళ్లి ఇంటిని కాపాడుకోవడం కోసం తాను ఏర్పాటు చేసిన గల్లా పెట్టె తీసుకొస్తాడు. నీకు అవసరం లేకపోతే ఆ నగను ఈ ఇంటి ఫండ్ లో వేసెయ్ అని తీసుకోబోతాడు.
కానీ ప్రభావతి మాట మారుస్తుంది. శుక్రవారం పూట బంగారం వద్దనకూడదు.. పైగా మనోజ్ కూడా బతిమాలుతున్నాడు.. సరే తీసుకుంటానులే అని చెయిన్ ను తీసుకుంటుంది. తానే బెట్ లో గెలిచానని రవి దగ్గర శృతి డబ్బు వసూలు చేస్తుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత ఆ చెయిన్ మెడలో వేసుకొని ప్రభావతి తెగ మురిసిపోతుంది.
నీతూ గుడ్ న్యూస్.. హెడ్ షెఫ్‌గా విక్రమ్ మల్హోత్రా.. శృతి గొడవ
మరోవైపు రవి, శృతి రెస్టారెంట్ కు వెళ్తారు. వాళ్లకు నీతూ గుడ్ న్యూస్ చెబుతుంది. అప్పుడు రీవ్యూయర్ మన రెస్టారెంట్ కు ఊహించినట్లే మంచి రివ్యూ ఇచ్చాడని, దీంతో మన పేరు మారుమోగుతోందని అంటుంది. మన టౌన్ లోనే టాప్ 5లో ఒకటిగా మన రెస్టారెంట్ నిలిచిందని చెబుతుంది. దీంతో రవి, శృతి కంగ్రాట్స్ చెబుతారు.
ఇప్పుడీ రెస్టారెంట్ ను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని అనుకుంటున్నానని చెప్పిన నీతూ.. దానికోసం ఓ హెడ్ షెఫ్ ను అపాయింట్ చేస్తున్నట్లు చెబుతుంది. దీంతో అది రవియే అని శృతి అనుకుంటుంది. రవి కూడా అదే అనుకుంటాడు. కానీ నీతూ మాత్రం ముంబైకి చెందిన విక్రమ్ మల్హోత్రా పేరు చెప్పడంతో ఇద్దరూ షాకవుతారు.
నీతూతో శృతి గొడవ పడుతుంది. ఈ రెస్టారెంట్ రవి వల్లే ఈ స్థాయికి వచ్చింది.. ఆ రివ్యూయర్ పాజిటివ్ రివ్యూలు ఇవ్వడానికి కూడా రవియే కారణం.. అలాంటిది అతన్ని కాకుండా మరొకరిని ఎలా తీసుకొస్తావంటూ గొడవ పడుతుంది. రవి ఒక్కడే కాదని, తాను చేసిన మార్కెటింగ్ వల్లే రెస్టారెంట్ ఈ స్థాయికి వచ్చిందని నీతూ అంటుంది. రవి కూడా నీతూని నిలదీస్తాడు. రెస్టారెంట్ ను వదిలెయ్.. రిజైన్ లెటర్ ఇచ్చేయమని శృతి అంటుంది. కానీ రవి తొందర పడొద్దని, నువ్వు అనుకున్నదే చెయ్ అని నీతూతో అనడంతో శృతి షాకవుతుంది.
అరుణ్‌ను కొట్టిన బాలు
ఎపిసోడ్ చివర్లో సుమతి తన లవర్ ను పరిచయం చేయడానికి బాలు, మీనాను పిలుస్తుంది. వాళ్లు వచ్చే సమయానికి సుమతితో అరుణ్ సరదాగా ఉండటం బాలు చూస్తాడు. వెంటనే వెళ్లి అరుణ్ ను కొడతాడు. తాను ప్రేమించింది అతన్నే, అతన్ని పరిచయం చేయడానికే మిమ్మల్ని పిలిచానని సుమతి అంటుంది. వీడు నిన్ను ప్రేమ పేరుతో మోసం చేస్తాడు.. నేను దీనికి ఒప్పుకోను అని బాలు అంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


