Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలు తల్లి ప్రేమ.. అరుణ్ సస్పెండ్.. శోభను గెంటేసిన బాలు.. శృతి సపోర్ట్

Gunde Ninda Gudi Gantalu Serial October 23rd Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 23 ఎపిసోడ్ లో బాలుని మీనా కాపాడుతుంది. ఇది గుణ పనే అని బాలు తెలుసుకుంటాడు. అటు చివర్లో ఇంట్లో చిచ్చు పెట్టడానికి వచ్చిన శోభను శృతి సపోర్ట్ తో బాలు గెంటేస్తాడు.

Published on: Oct 23, 2026, 07:13:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో బాలు కారు, లైసెన్స్ తిరిగి రావడమే కాకుండా అరుణ్ సస్పెండ్ అవుతాడు. తనను మీనానే కాపాడటంతో ఆమెను దేవత అంటూ బాలు పొగుడుతాడు. అటు బాలు తల్లి ప్రేమ ఎలాంటిదో ఈ ఎపిసోడ్ కళ్లకు కట్టినట్లు చూపించింది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 23
 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 23 ఎపిసోడ్

అరుణ్ బండారం బయటపెట్టిన కానిస్టేబుల్

అరుణ్ బండారం కానిస్టేబుల్ బయటపెట్టే సీన్ తో సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 23) ఎపిసోడ్ మొదలైంది. అరుణ్ సారే కావాలని కేసు పెట్టారని, బాలు కారు బ్రేకులు ఫెయిలయ్యాయని అతడు సీఐతో చెబుతాడు. తనకు కూడా గాయాలు అలా అయినవే అని అంటాడు.

బాలు ఒకరి ప్రాణాలు కాపాడేవాడు తప్ప తీయడని, తన కూతురు, మనవడు ప్రాణాలతో ఉండటానికి కారణం బాలునే అని కానిస్టేబుల్ వెల్లడిస్తాడు. అరుణ్ సార్ కు బాలుపై ఉన్న వ్యక్తిగత కక్ష వల్లే ఇలా చేశాడని చెబుతాడు.

అరుణ్ సస్పెన్షన్.. బాలుకి కారు కీస్ ఇచ్చి..

దీంతో అరుణ్ పై సీఐ వారం పాటు సస్పెన్షన్ వేటు వేస్తాడు. వ్యక్తిగత కక్షలతో ఇలా చేసినందుకు మందలిస్తాడు. నీ వల్ల తనకు చీవాట్లు పడేవని అంటాడు. కానీ అరుణ్ మాత్రం ఈ బాలు వల్లే తనకు ప్రతిసారీ చెడు జరుగుతోందని అంటాడు. మరి నీవల్ల నాకు జరుగుతున్నదేంటని బాలు వాదిస్తాడు. చివరికి బాలు కారు కీస్, లైసెన్స్ ను అరుణ్ ద్వారానే బాలుకి సీఐ ఇప్పిస్తాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ కు బాలు, మీనా థ్యాంక్స్ చెబుతారు. అటు అరుణ్ ఆవేశంతో రగిలిపోతుంటాడు.

దేవత అంటూ మీనాపై బాలు ప్రశంసలు

ఆ తర్వాత బయటకు వచ్చి కారును చూసి బాలు ఎమోషనల్ అవుతాడు. ఇది లేకపోతే మనం ఏమైపోయేవాళ్లమో అని అంటాడు. మీనాను కూడా బండి వదిలేసి కారులో తనతోపాటే రమ్మంటాడు. మీనానే చూస్తూ డ్రైవ్ చేస్తుండటంతో రోడ్డు ముందుంది అని ఆమె అంటుంది. కానీ నా కళ్ల ముందు దేవత ఉందంటూ భార్యను పొగుడుతాడు. నీవల్లే ఈ కారు నాకు మళ్లీ దక్కింది.. నువ్వు ఆ గర్భవతికి సాయం చేయడం, ఆమె వచ్చి నిజం చెప్పడం వల్లే అసలు విషయం అందరికీ తెలసిందని బాలు అంటాడు.

నా ఐదు లక్షలు పోయినప్పుడు మీరు కూడా నాకు సాయం చేశారు కదా..మనం భార్యాభర్తలం ఒకరికొకరం సాయం చేసుకోవాలి అని మీనా అంటుంది. అయినా మీరు కూడా మీ ప్రాణాలను పణంగా పెట్టి ఆమెకు ఏమీ కాకుండా చేశారు.. దీనికంతటికీ ఈ కంకణమే కారణం.. అదే మనల్ని కాపాడిందని మీనా అంటుంది. కారు బ్రేకులు ఎవరో కావాలనే తీశారని అన్నారు కదా అని మీనా అంటే.. అవును అదెవరో కనిపెట్టాలని బాలు అంటాడు.

ఇంట్లో బాలు, మీనా ఒకరిపై మరొకరి పొగడ్తలు.. కుళ్లుకున్న ప్రభావతి, మనోజ్

ఇటు ఇంట్లో బాలు, మీనా కోసం సత్యం ఎదురు చూస్తుంటాడు. ప్రభావతి మాత్రం తనదైన స్టైల్లో నోరు జారుతూనే ఉంటుంది. వాళ్లు ఇంటికి రాగానే అప్పుడే వదిలేశారా అంటుంది. అంత సులువుగా ఎలా బయటపడ్డావని మనోజ్ వెటకారంగా అడుగుతాడు. కారు, లైసెన్స్ రెండూ ఇచ్చారని, ఇదంతా మీనా వల్లే సాధ్యమైందని బాలు చెబుతాడు.

దీంతో ప్రభావతి, మనోజ్ మరింత కుళ్లుకుంటారు. మీ పెంపకం, అమ్మమ్మగారి పెంపకంలో ఆయనకు అన్నీ మంచి లక్షణాలే వచ్చాయి.. ఓ గర్భిణి ప్రాణం పోకుండా కారును తీసుకెళ్లి పోలీసు బైకుకు ఢీకొట్టాడు.. అదే ఆయనను కాపాడింది అని మీనా అంటుంది. ఇద్దరి పొగడ్తలూ వినలేక ప్రభావతి, మనోజ్ ముఖాలు అదోలా పెడతారు. ఈ గ్యాప్ లో శృతి తనదైన స్టైల్లో మనోజ్, ప్రభావతిపై పంచులు వేస్తుంది. ఈ మధ్య నీకు బాగా వెటకారం ఎక్కువైందని ప్రభావతి అంటుంది.

కారు బ్రేకులు మన ఇంట్లో వాళ్లే కావాలని తీసేశారన్న బాలు.. రోహిణిపై డౌట్

అయితే కారు బ్రేకులు ఎవరో మన ఇంట్లో వాళ్లే కావాలని తీశారని బాలు చెప్పడంతో అందరూ షాకవుతారు. ముందు రోజు కేవలం మన ఇంట్లోనే కరెంట్ పోయిన విషయం గుర్తుందా అని మీనా అంటుంది. అప్పుడే రోహిణిపై అనుమానం కలిగేలా మనోజ్ మాట్లాడటంతో ఆమె షాక్ తింటుంది. ఆ రోజు కరెంటు పోవడం, నా దిండు కింద ఉన్న తాళాలు ఎక్కడో మూలన పడి ఉండటం చూస్తుంటే ఎవరో మన ఇంట్లో వాళ్లే ఈ పని చేసినట్లు కన్ఫమ్ అవుతుందని బాలు అంటాడు.

మనోజ్ ఈ పని చేశాడా అని శృతి అంటే.. ఆ పిరికి సన్యాసికి అంత సీన్ లేదని బాలు అంటాడు. తర్వాత రోహిణి భయంతో వెళ్లి నీళ్లు తాగుతుంది. ఆమె చుట్టూ తిరుగుతూ అనుమానంగా చూస్తుంటే.. తాను అంత దుర్మార్గురాలిని కానని చెబుతుంది. చివరికి తల్లిని కూడా బాలు అనుమానంగా చూస్తాడు. ఈ మధ్య చింతామణిలాంటి వాళ్లతో సావాసం చేసి ఇలాంటివి చేస్తుందేమో అని అంటాడు. దీంతో వాడంటే ఇష్టం లేదు కానీ.. మరీ కన్న కొడుకును అలా చేసేంత రాక్షసురాలిని కాను అని ప్రభావతి అంటుంది.

గుణ మనుషులే ఈ పని చేశారన్న బాలు

ఆ తర్వాత పైన గదిలోకి వెళ్లిన బాలుకి సడెన్ గా తన కారు వెంట రౌడీలు పడి తనను రెచ్చగొట్టిన సీన్ గుర్తుకు వస్తుంది. మీనా రాగానే ఆ విషయం చెబుతూ వాళ్లు గుణ మనుషులే అని, అంటే వాళ్లే ఈ పని చేశారని అంటాడు. వాళ్లు కావాలని కారు స్పీడు పెంచేలా రెచ్చగొట్టి తన ప్రాణం తీయాలని చూశారని చెబుతాడు. వాళ్లకు కారు తాళాలు ఇంట్లో వాళ్లే ఇచ్చి ఉంటారని అంటాడు. ఆ పని అత్తయ్యే చేశారని అనుకుంటున్నారా అని మీనా అంటుంది.

తల్లిపై బాలు ఎనలేని ప్రేమ

అదేం లేదు.. ఆమెకు నేనంటే ఇష్టం లేదు కానీ.. మరీ కన్న కొడుకును చంపేంత దుర్మార్గురాలైతే కాదు అని బాలు అంటాడు. మరి మీ తల్లిపై ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు ఆమెతో ఊరికే గొడవ పడుతుంటారు.. నానా రకాల పేర్లు పెట్టి పిలుస్తారు అని మీనా అడుగుతుంది. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ లేకుండా పెరిగాను.. ఆమెను అలా ఆట పట్టిస్తూ, ఆమెతో అలా తిట్టించుకుంటూ తిరిగితే అలాగైనా కాస్త అమ్మతో గడిపిన ఫీలింగ్ కలుగుతుంది అని బాలు అంటాడు. మరి ఆమెను చింతామణితో పోల్చారని మీనా అడిగితే.. ఏదో సరదాకి అలా అన్నాను కానీ ఆ చింతామణికి, మా అమ్మకి పోలిక ఎక్కడ.. అని తల్లిపై తనకున్న ఎనలేని ప్రేమను చాటుకుంటాడు బాలు.

శృతి తల్లి శోభ గొడవ.. తరిమేసిన బాలు

చివర్లో ఇంట్లో వాళ్లందరూ కలిసి ఇల్లు దులుపుతుంటారు. అప్పుడే శృతి తల్లి శోభ వస్తుంది. శృతి కూడా ఓ పని మనిషిలా ఇల్లు దులపడం చూసి షాకవుతుంది. నువ్వు కూడా దులుపుతున్నావా.. నీకా కర్మేంటి అని అంటుంది. మేం వద్దన్నా.. సరదాగా ఉంటుందని ఆమే చేస్తోందని సత్యం అంటాడు. మీరూ దులిపి తరించండి అని బాలు వెటకారంగా అంటాడు.

మీ నాన్న బస్సు డ్రైవర్ గా పని చేసి ఖాళీగా ఇంట్లో ఉన్నాడు కదా.. ఆయనతో దులిపించుకోండి అని శోభ అనడంతో శృతి కోప్పడుతుంది. ఇలాగే మాట్లాడే బాలు నిన్ను పలానాదాన్ని తరిమేసినట్లు తరుముతాడు అని అంటుంది. బాలు కూడా నిజంగానే శోభను ఇంట్లో నుంచి గెంటేసే ప్రయత్నం చేస్తాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More