Gunde Ninda Gudi Gantalu Today Episode: అరుణ్‌ను గుద్దిన బాలు- కారు సీజ్, కోర్టుకు బాలు- నిజం కప్పిపెట్టేసిన పోలీస్
Gunde Ninda Gudi Gantalu Serial October 20th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 20వ తేది ఎపిసోడ్లో బాలు కారులో వెళ్తుంటే రౌడీలు రెచ్చగొడతారు. కారు బ్రేకులు ఫెయిల్ అవుతాయి. తల్లిపిల్లాడిని కాపాడబోయి కారును పక్కకు తిప్పడంతో ట్రాఫిక్ పోలీస్ అరుణ్‌కు గుద్దుతాడు బాలు. కారును సీజ్ చేస్తారు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో శ్రుతి ఉప్మా చేసింది చెప్పి అందిరిని పిలుచుకుని వస్తారు. ఏంటే నువ్వు శ్రుతితో వంట చేయించావంట అని ప్రభావతి అంటుంది.

నీకంటే బాగానే వండుతుంది
అవును. ఈరోజు నుంచి శ్రుతి వండిందే మీకు పెడతానని మీనా అంటుంది. రెస్టారెంట్లో చూసి నేర్చుకుంటున్నట్లుంది. నువ్వు పెట్టే చింతకాయ పచ్చడి కంటే బాగానే ఉంటుందిలే అని ప్రభావతి అంటుంది. అయితే, రేపటి నుంచి డబ్బుడమ్మా ఏది చేసిన నీ మీద ప్రయోగం చేయమంటానులే అని బాలు అంటాడు.
శ్రుతి చేసిన ఉప్మా తీసుకొస్తుంది. అందులోనుంచి స్పూన్ రాదు. రవి, బాలు ఇద్దరు కలిసి లాగిన స్పూన్ రాదు. అదంతా చూసి ప్రభావతి, సత్యం, మనోజ్ షాక్ అవుతారు. చివరికి గరిట వస్తుంది. ఫస్ట్ మా అమ్మకు పెట్టు ఆవిడే మా ఇంటి ఇలవేల్పు అని బాలు అంటాడు. ఒరిజినల్ కోటీశ్వరుడి కూతురు మాకోసం వంట వండింది. నువ్వు ఎంత బిల్డప్ ఇచ్చావే అని రోహిణిని తిడుతుంది ప్రభావతి.
ఇలాంటివి పెడితే మీ రెస్టారెంట్ మూసుకోవాల్సిందే. అయిన వంట చేయడానికి మనిషి ఉందిగా అని మనోజ్ అంటాడు. రేయ్ అంటే నా భార్య పని మనిషిలా కనిపిస్తుందా. నీ భార్యను ఏమనాలు, నిన్ను ఏమనాలి అని చేసినవి గుర్తు చేస్తాడు బాలు. ఆపండ్రా. మొదటిసారి చిన్న కోడలు వంట చేసింది. తినండని సత్యం అంటాడు.
శ్రుతికి మీనా వంట క్లాసులు
అది తిని షాక్ అవుతారు. శ్రుతికి రవి పెడతాడు. అది ఉమ్మేస్తుంది. ఇంత చెండాలంగా ఉందా. మీనా రేపటి నుంచి నాకు కుకింగ్ క్లాసెస్ తీసుకోవాలని శ్రుతి అంటుంది. మీనా సరేనంటుంది. బాలు, మీనా వెళ్లేందుకు బయలుదేరుతారు. ఇంతలో మేనేజర్ నిన్నే రమ్మంటున్నాడని ఫ్రెండ్ కాల్ చేసి చెబుతుంది. అదే విషయం బాలుకు చెబుతుంది మీనా.
ఈరోజు మనల్ని విడదీయడానికి విధి కంకణం కట్టుకున్నట్టుందని, చింటు గురించి ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటారు. అది చూసిన రౌడీలు మన పెళ్లాలు ఉన్నారు ఎందుకు అనికుళ్లుకుంటారు. ఇదే వాడికి చివరి నవ్వు అని రౌడీ అంటాడు. బాలు కారు ఎక్కి స్టార్ట్ చేస్తాడు. కారు స్టార్ట్ కాదు. కాసేపటికి అవుతుంది. బాలు కారులో వెళ్తాడు.
రౌడీలు ఫాలో చేస్తారు. కారు స్టార్ట్ కాకపోవడంపై బాలు డౌట్ పడతాడు. కొన్న ఇన్నిరోజుల్లో ఎప్పుడు కాలేదు. నిన్ను సర్వీసింగ్ సెంటర్‌కి తీసుకెళ్లి బాగా సర్వీస్ చేయిస్తా అని కారుతో అంటాడు బాలు. ఇంతలో రౌడీలు వచ్చి హారన్ కొడుతూ రెచ్చగొడతారు. ఏం బంటి నీ బండి స్లోనా ఏంటీ అని కారు స్పీడుగా నడిపేలా చేస్తారు. కారు స్పీడుగా వెళ్లదా.. రాదా అని రౌడీలు ఏడిపిస్తారు.
అరుణ్‌ను గుద్దిన బాలు
దాంతో బాలు స్పీడ్ పెంచుతాడు. కారు బ్రేకులు పడవు. దాంతో బాలు కంగారు పడతాడు. కారు బ్రేకులు పడట్లేదు. తప్పుకోండని అరుస్తాడు. ఎదురుగా ఆటో పక్కన తల్లిపిల్లాడు ఉంటారు. దాంతో పక్కకు తిప్పుతాడు. కానిస్టేబుల్ అరుణ్ బైక్‌ను గుద్దుతాడు బాలు. దాంతో అరుణ్ కోపంతో రెచ్చిపోతాడు. కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. కావాలని గుద్దలేదని బాలు అంటాడు.
కానీ, కానిస్టేబుల్ అరుణ్ వినడు. నాకు నీ గురించి ర్యాష్ డ్రైవింగ్ గురించి తెలుసు అని అరుణ్ అంటాడు. మరో కానిస్టేబుల్‌కి కీస్ ఇచ్చి కారు తీసుకురమ్మంటాడు. బాలు బ్రేకులు పడట్లేదని వద్దంటాడు. నన్ను కారుతో గుద్ది చంపాలని ప్లాన్ చేసిన నీతో మర్యాదగా మాట్లాడాలా. పోలీస్ స్టేషన్లో ఉంటాయి మర్యాదలు. ఈరోజు నీ సంగతి అటో ఇటో తేలుస్తాను అని అరుణ్ అంటాడు.
బాలు చెబుతున్నా పోలీస్ కానిస్టేబుల్ బాలు కారు తీసుకొస్తాడు. బాలును అరుణ్ తీసుకెళ్తాడు. అది చూసిన రౌడీలు నవ్వుకుంటూ వెళ్తారు. మరోవైపు చింటును కలిశారో లేదో అని బాలుకు మీనా కాల్ చేస్తుంది. ఆ ఫోన్ కానిస్టేబుల్ తీసుకుని డ్యూటీలో ఉన్న పోలీస్ బండిని ఢీ కొట్టాడు అని జరిగింది చెబుతాడు. దాంతో కంగారుగా మీనా బయలుదేరుతుంది.
లైసెన్స్ క్యాన్సిల్ చేయిద్దామా
ఇంతలో ఎస్సై వస్తే బాలు జరిగింది చెబుతాడు. అరుణ్ వచ్చి బాలు గురించి చెడుగా చెబుతాడు. అరుణ్ చెప్పింది ఎస్సై నమ్ముతాడు. లైసెన్స్ క్యాన్సిల్ చేయించి కారు ఇక్కడే ఉంచేద్దామా అని ఎస్సై అంటాడు. అంతే సర్ అని అరుణ్ అంటాడు. సర్ అదే నా జీవనాధారం సర్ అని బాలు వేడుకుంటాడు. లెసెన్స్ తీసుకుని కారు సీజ్ చేయమని ఎస్సై చెబుతాడు.
బాలు ఎంత చెప్పిన ఎస్సై వినడు. ఇతని సంగతేంటో నువ్వే చూసుకో అని అరుణ్‌కు అప్పజెప్పి వెళ్లిపోతాడు. ఇక్కడ ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూపిస్తా అని అరుణ్ అంటాడు. చేతిలో పవర్ ఉందిగా అని అంటున్నావుగా. ఏదో ఒకరోజు కచ్చితంగా బాధపడతావ్గా గుర్తుపెట్టుకో అని బాలు అంటాడు. బాలును పంపించేస్తారు.
బాలు బయటకు వెళ్తాడు. ఇంతలో మీనా వస్తుంది. కారు బ్రేకులు ఫెయిల్ అయింది, జరిగింది అంతా బాలు చెబుతాడు. మన కారు మనకు తిరిగి వచ్చేలా లేదని బాలు అంటాడు. ఇంతలో కానిస్టేబుల్ బాలు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చి సర్ చూడకముందే వెళ్లమంటాడు. ఇలా కారు లాక్కోవడం అన్యాయం అని మీనా అంటుంది.
నిజం కప్పిపెట్టేసిన అరుణ్
ఏది అన్యాయమో ఏది న్యాయమో కోర్టు తేలుస్తుంది. అక్కడ తేల్చుకోండని కానిస్టేబుల్ వెళ్లమంటాడు. ఇదంతా వాడి వల్లే అని బాలు కోప్పడితే మీనా ఆపుతుంది. ఇప్పుడేం మాట్లాడిన వాళ్లు తప్పుగా తీసుకుంటారు. ముందు ఇంటికెళ్దాం పదండని మీనా అంటుంది. ఇంటికెళ్తారు. సత్యం వాళ్లు అడిగితే కారు సీజ్ చేసిన విషయం మీనా చెబుతుంది.
పోలీసోడిని కావాలనే గుద్ది ఉంటాడని ప్రభావతి నిందలు వేస్తుంది. మరోవైపు బాలు కారు తీసుకొచ్చిన కానిస్టేబుల్ కట్లతో అరుణ్‌కు బ్రేక్ వైర్ కట్టయింది సర్. కారు బ్రేకులు నిజంగానే ఫెయిల్ అయ్యాయని చెబుతాడు. ఈ విషయం తెలిస్తే మన పరువు పోతుందని అంటాడు. ఈ విషయం ఎవరికి తెలియొద్దని నిజం కప్పిపెట్టాలని అరుణ్ అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


